ఆచార్య చాణక్యుడి విధానాలు జీవితంలో మార్గదర్శకాలుగా పనిచేస్తాయి
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తెలివిగా ఎలా పరిష్కరించాలో, తన చుట్టూ ఉన్న ప్రత్యర్థులను ఎలా గుర్తించాలో బోధించాడు
చాణక్యుడు తన జీవితంలో ఏం నేర్చుకున్నాడో, ఆ జ్ఞానం.. అనుభవాన్ని చాణక్య నీతిలో వివరించాడు.
జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించిన చాణక్యుడు ప్రతి మలుపులో తెలివిగా ముందుకు సాగాలని, వచ్చే సమస్యని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ వెళ్లిపోవాలని సూచించాడు
సమస్యలు పరిష్కరించుకోవడం సంగతి సరే..అస్సలు సమస్యలు రాకుండా ఉండాలంటే కొందరు వ్యక్తులను గుడ్డిగా నమ్మకూడదని వివరించాడు
అతి నమ్మకం, గుడ్డి నమ్మకం మీకు ఎప్పటికైనా హానిచేస్తుందని హెచ్చరించిన చాణక్యుడు ముఖ్యంగా ఈ ముగ్గురు వ్యక్తులతో జాగ్రత్తగా మసలుకోవాలని చెప్పాడు
ఆయుధం ఉన్నవారిని ఆయుధాన్ని తన వద్ద ఉంచుకునే వ్యక్తిని గుడ్డిగా నమ్మడం వల్ల ప్రమాదం నుంచి ఎప్పటికైనా తప్పించుకోలేరు. అలాంటి వ్యక్తి మాటలు తియ్యగా ఉన్నా ఏ క్షణం అయినా మిమ్మల్ని చిక్కుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది.
అధికారంలో ఉన్న వ్యక్తి ఆచార్య చాణక్యుడి ప్రకారం..మీ కన్నా ఉన్నతాధికారి లేదా పాలకుడిని గుడ్డిగా నమ్మడం అస్సలు మంచిది కాదు. పొరపాటున మీ మాటల్లో ఏదైనా వారికి నెగిటివ్ అనిపిస్తే..వారు తమ శక్తి, బలంతో మీకు సమస్యలు సృష్టించవచ్చు , మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేయవచ్చు.
అత్యాశగల పురుషులు అత్యాశతో ఉన్న వ్యక్తిని గుడ్డిగా నమ్మడం అత్యంత ప్రమాదం. వారు మీనుంచి ఎప్పుడు ఏం ఆశిస్తారో తెలుసుకోలేరు.
ఆ వ్యక్తిలో దురాశ ఎప్పటికైనా మీకు ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి వారు మీ ప్రత్యర్థులతో కలసి మీకు హాని చేయడానికి కూడా వెనుకాడరు