శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో పూజిస్తారు. నవదుర్గల్లో మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణి కాగా..మూడో రోజు చంద్రఘంటగా దర్శనమిస్తోంది.
శివుడి శిరస్సున ఉన్న చంద్రుడిని చూసి ముచ్చటపడ్డ పార్వతీదేవి కోరిక తీర్చేందుకు ఆ చంద్రుడిని ఆమెకు అలంకరించాడట శంకరుడు. ఆ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంతో ఆమెకు చంద్రఘంట అని పేరు.
చంద్రఘంట దేవిని పూజించడం వల్ల భయాలను తొలగి..బతుకుపై ఆశ, విశ్వాసం పెరుగుతుంది. ఇంట్లో ప్రతికూల శక్తులు చేరవు. జీవితంలో వృత్తి లేదా వ్యాపార రంగాల్లో ఆశలను కోల్పోయిన సమయంలో చంద్రఘంట పూజను చేయడం వల్ల నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
చంద్రఘంట దేవి మంత్రం ఓం దేవి చంద్రగుటాయై నమః ఓం దేవి చంద్రగుటాయై నమః పిండాజ్ ప్రవార్ధ్ చండ్కోపష్ర్కైర్యుట ప్రసాదమ్ తనుతే మధ్యమ్ చంద్రఘంటేటి విశృతా