మీ రాశి ప్రకారం మీరు మార్చుకోవాల్సిన లక్షణంమేష రాశి
ఎక్కువగా మేషరాశివారు తన జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయిస్తారు. కోపం తగ్గించుకుని పార్టనర్ కి కూడా ప్రయార్టీ ఇవ్వాలి. సరైన కమ్యూనికేషన్ మెంటైన్ చేయడం మంచిది. అహంకారాన్ని విడిచిపెట్టి ఆప్యాయంగా ఉండడం మంచిది.వృషభ రాశి
ఈ రాశి వారు చిన్న చిన్న గొడవలకు దూరంగా ఉండాలి. మీ పార్టనర్‌తో ఎలాంటి గొడవలు అయిన సరే వీలైనంత త్వరగా సర్దుబాటు చేసుకోవడం మంచిది. చిన్న చిన్న గొడవలను పట్టించుకోకుండా ఉంటే మీ మధ్య రిలేషన్ బావుంటుంది.మిధున రాశి
మిధున రాశి వారు లైఫ్ పార్టనర్‌తో మంచి రిలేషన్ కావాలి అనుకుంటే కచ్చితంగా మీరు ఇతరులతో కంపేర్ చేసుకోవడం మానేయాలి. మీ భర్త లేదా భార్యని ఇతరులతో పోల్చొద్దు. మీ జీవిత భాగస్వామి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని అంగీకరించండి.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులను కూడా బయటకు చెప్పేందుకు ఇష్టపడరు. మీ ఆలస్యం కారణంగా పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మీ ఆలోచనలను పార్టనర్ తో పంచుకోండి.సింహ రాశి
సింహ రాశి వారికి రిలేషన్ షిప్‌లో ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే మీ జీవితభాగస్వామితో ఎక్కువ సమయం కేటాయించాలి. మీ మొదటి ప్రయార్టీ మీ పార్టనర్ అవ్వాలి. బయటకు వెళ్లడం, బహుమతులు కొనుగోలు చేసి ఇవ్వడం మంచిదికన్యా రాశి
కన్యా రాశి వారు జీవిత భాగస్వామి అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి. మీ ఎమోషన్స్‌ని పంచుకోవాలి. అలా అయితేనే మీ మధ్య బంధం బాగా పెరుగుతుంది. అనవసర చర్చలకు అస్సలు అవకాశం ఇవ్వొద్దుతులా రాశి
తులా రాశి వారు మీ జీవిత భాగస్వామి ప్రవర్తనను బాగా అర్థం చేసుకోవాలి. వారి మూడ్ ని అర్థం చేసుకుని నడుచుకోవడం చాలా మంచిది. ఇలా ఉంటేనే మీ బంధం బలపడుతుంది.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు మీ పార్టనర్ తో సమయాన్ని గడిపేటప్పుడు, మీ ఆలోచనలు పంచుకునేటప్పుడు ప్రశాంతంగా, సున్నితంగా డీల్ చేయాలి. మీరు ఎంత కూల్ గా వ్యవహరిస్తే మీ బంధం అంత ప్రశాంతంగా ఉంటుంది.ధనస్సు రాశి
మీ జీవితంలో గతంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకోవడం మానేయాలి. పదే పదే అవే విషయాలు ప్రస్తావిస్తే మీ బంధం బలహీనపడుతుంది.మకర రాశి
మకర రాశి వారికి పార్ట్నర్‌తో రిలేషన్ బాగుండాలంటే అనవసర బాధ్యతలను తలకెత్తుకోకండి. బాధ్యతలకు బంధీగా ఉండనంత వరకూ మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.కుంభ రాశి
ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి. ఏ నిర్ణయాన్ని కంగారుపడి తీసుకోవద్దు. ప్రశాంతంగా ఆలోచించాకే ఓ నిర్ణయానికి రావాలి. మీ జీవిత భాగస్వామితో మీ అభిప్రాయం పంచుకోవడం వల్ల సమస్యల నుంచి బయటపడతారుమీన రాశి
మీన రాశి వారికి వాళ్ళ పార్ట్నర్‌తో మంచి ప్రేమని పంచుకోవాలని ఉంటుంది. వారి నుంచి కూడా సపోర్ట్ ఆశిస్తారు. పార్టనర్ ప్రతి సందర్భంలోనూ భాగం అవ్వాలని కోరుకుంటారు. కానీ కోపం కారణంగా మొత్తం పోతుందని గ్రహించాలి


Follow for more Web Stories: ABP LIVE Visual Stories