News
News
X

Daily Horoscope Today 27th November 2022: ఈ రాశివారు కుటుంబ సభ్యులను అనవసరంగా అనుమానించకండి, నవంబరు 27 రాశిఫలాలు

Horoscope Today 27th November 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

27th November 2022 Daily Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ వ్యవహారాలు మీకు పెద్దగా కలసిరావు

వృషభ రాశి
ఉద్యోగాలు మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం మీకు అందుతుంది. సంతోషం, శ్రేయస్సు పెరగడం వల్ల సమస్యను తెలివిగా పరిష్కరించుకోవడం సాధ్యమవుతుంది. అతిథుల వస్తారు

మిథున రాశి
అనుకోకుండా చేసిన పొరపాటు వల్ల నష్టపోతారు. వ్యాపారంలో సమస్యలు ఒత్తిడిని పెంచుతాయి. కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. ఉత్తమ వ్యక్తులతో సమావేశం ఉంటుంది. కుటుంబ కలహాలు తీరుతాయి.

కర్కాటక రాశి 
నూతన పెట్టుబడులకు ఈ రాశివారికి ఇది అనుకూల సమయం. ఉద్యోగంలో పని పెరుగుతుంది. ఈ రోజు మీరు శుభ-అశుభ రెండు వార్తలూ వినే అవకాశం ఉంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. సమయ పాలన చాలా అవసరం. 

Also Read: మరణం సమీపించే ముందు సంకేతాలివే, స్వయంగా శివుడు పార్వతికి చెప్పినవి!

సింహ రాశి
మీ కుటుంబ సభ్యులను అనవసరంగా అనుమానించకండి. ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీ ప్రియమైనవారి ప్రాముఖ్యతను మరచిపోకండి. ఎవరితో ఎలా మాట్లాడాలో ఓసార ఆలోచించుకోవడం మంచిది. వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు సకాలంలో తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

కన్యా రాశి
సమయానికి పని చేయడం నేర్చుకోండి. మీ ఆలోచనలను నియంత్రించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఖర్చుల పెరుగుదల బడ్జెట్‌ను పాడు చేస్తుంది. వ్యాపారం సాధారణంగా సాగుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది.

తులా రాశి
ఈ రోజు మీ కుటుంబానికి ముఖ్యమైన రోజు. వ్యాపారంలో అధిక ఆలోచనల వల్ల అలసిపోతారు. ఉద్యోగులు, ఇతర పనులు చేసేవారు పనికి తగిన ఫలితం పొందుతారు. వాహనం కొనాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు.

Also Read:  నవంబరు 29 సుబ్రహ్మణ్య షష్టి - వివాహం సంతానం సమస్యలు , కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు ఇలా చేయండి
 
వృశ్చిక రాశి
మీ చుట్టూ ఉన్నవారికి మీపై ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోండి. బయటి వారిని త్వరగా నమ్మి నెత్తిన పెట్టుకోవడం మానేస్తే చాలా మంచిది. అర్థం లేని వివాదాలకు దూరంగా ఉండండి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
ఈ రోజు ప్రారంభం నుంచీ బిజీగా ఉంటారు. మీ దినచర్య దెబ్బతింటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు బాగా సాగుతాయి. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ సక్సెస్ కోసం ప్రయత్నించడం మానొద్దు

 

మకర రాశి
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ, గృహ సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో మీ ప్రభావం పెరగడం వల్ల శత్రువులు ఓడిపోతారు. ప్రయాణంలో మీ వస్తువులను సురక్షితంగా ఉంచండి. కొత్త సంబంధాలు లాభిస్తాయి.

కుంభ రాశి
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ కీర్తి పెరుగుతుంది. చేయాల్సిన పనుల నుంచి తప్పించుకోవద్దు...మీ పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు

మీన రాశి
అవసరమైన పత్రాలను సకాలంలో సేకరించండి. పిల్లల చదువు గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో కొత్త ప్రతిపాదనలు అందుతాయి. వ్యక్తిగత పనుల్లో నిర్లక్ష్యం వద్దు. కార్యాలయంలో పురోగతికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 27 Nov 2022 05:22 AM (IST) Tags: Horoscope Today astrological predictions forNovember 2022 27th November horoscope today's horoscope 27 November 2022 27 November 2022 Rashifal

సంబంధిత కథనాలు

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు

Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు

Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు

Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు

ప్లేట్ లో మూడు రొటీలు వడ్డించ కూడాదా?

ప్లేట్ లో మూడు రొటీలు వడ్డించ కూడాదా?

టాప్ స్టోరీస్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబు అంటున్న మంత్రి కేటీఆర్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,  ఖర్మరా బాబు అంటున్న మంత్రి కేటీఆర్

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!