News
News
X

Signs Of Death: మరణం సమీపించే ముందు సంకేతాలివే, స్వయంగా శివుడు పార్వతికి చెప్పినవి!

Signs Of Death: చనిపోయేముందు తెలిసిపోతుందా.. రోజుల్లో కాదు కొన్ని నెలల ముందే మృత్యుదేవత సంకేతాలిస్తుందా.. ఆ సంకేతాలేంటో శివపురాణంలో ప్రత్యేకంగా ప్రస్తావించారా..అంటే..అవుంటారు పండితులు..

FOLLOW US: 
Share:

సృష్టిలో ఏ ప‌ని చేసినా దానిపై క‌ర్మ ఆధార ప‌డి ఉంటుంద‌ని పురాణాలు చెబుతున్నాయి. మ‌న‌ క‌ర్మ ప్ర‌కార‌మే ఎప్ప‌టికైనా మ‌ర‌ణం వ‌స్తుంది. కానీ మ‌న‌కు మ‌ర‌ణం వ‌చ్చే ముందు పలు సంకేతాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయ‌ట‌. ఈ సంకేతాలు కనిపిస్తే మరణం తథ్యం అని శివపురాణం చెబుతోంది. శివపురాణం ప్రకారం, పార్వతి దేవి ఒకసారి తన భర్త పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది.. “స్వామి..! మరణానికి సంకేతం ఏంటి, మరణం రాబోతోందని ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది.

Also Read: ఈ రాశివారు పాత ప్రేమికులను ఆకస్మికంగా కలుస్తారు!

పరమేశ్వరుడు జగన్మాతకు చెప్పిన మరణ సంకేతాలు

 • ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు, కొద్దిగా ఎరుపు రంగులో మారినప్పుడు ఆ వ్యక్తి మరో ఆరు నెలలో చనిపోవచ్చని అర్ధం
 • నీరు, నూనె , అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి 6 నెలల్లో చనిపోతాడు. ఈ సమయం కన్నా ఒక నెల ఎక్కువ జీవిస్తే తమ నీడను తాను చూసుకోలేరు..ఒకవేళ కనిపించినా ఆ నీడకు తలభాగం ఉండదు
 • ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే చనిపోబోతున్నాడని సంకేతం
 • వారం రోజుల పాటు ఎడమ చేయి మెలితిరిగిపోతున్నట్లు అనిపిస్తున్నా కూడా త్వరలో మరణం తథ్యం
 • నోరు, నాలుక, చెవులు, కళ్ళు, ముక్కు రాయిలా గట్టిగా మారిపోయినట్లు అనిపిస్తే ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో ప్రాణం కోల్పోతాడు
 • చంద్రుడు, సూర్యుడు , అగ్ని కాంతిని చూడలేనప్పుడు ఇక జీవించేది ఆరు నెలలే
 • నాలుక అకస్మాత్తుగా ఉబ్బి, దంతాల్లో చీము వస్తే ఆరు నెలలకు మించి బతకరు
 •  సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఎరుపు రంగులోనే కనిపించినా మరణ సమీపించినట్టే
 • గుడ్లగూబ గురించి కలలు కన్నప్పుడు, ఏదైనా గ్రామాన్ని ఖాళీగా కానీ ధ్వంసం చేసినట్టు కానీ కల వస్తే మృత్యువు సమీపిస్తున్నట్టే
 • పావురం, కాకి, గద్ద తలపై కూర్చున్నా, వాలినా మరణ సంకేతమే
 • చనిపోయే ముందురోజు పార్వతీ పరమేశ్వర్లు కలలో పరామర్శిస్తారట
 • మరణానికి ముందురోజు యమభటులు కల్లో కనిపించి పేరు అడుగుతారు
 • రెండు పిచ్చుకలు నీళ్లలో మునగితేలినా మీ ప్రాణం గాల్లో కలిపోతుందని సంకేతమే
 • తీతువు పిట్ట ఇంటిపైనుంచి వెళ్లినా మరణానికి చేరువలో ఉన్నామన్న సంకేతమేనట

Also Read: ఈ నాలుగు రాశులవారిపై శని అనుగ్రహం ఉంటుంది, నవంబరు 26 రాశిఫలాలు

నోట్: ఇవి శివపురాణంలో ప్రస్తావించిన విషయాలు. వీటిని పూర్తిగా అన్వయించుకుని లేనిపోని భయాలు క్రియేట్ చేసుకోవద్దు. పురాణాల్లో ప్రస్తావించిన కొన్ని విషయాలు తెలుసుకునే ఆసక్తి చాలామందికి ఉంటుంది..వారి కోసం మాత్రమే ఈ కథనం. 

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 26 Nov 2022 07:51 AM (IST) Tags: Shiva Purana Signs Of Death Death Signs according to Shiva Purana

సంబంధిత కథనాలు

Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!

Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!

Maha Shivaratri 2023: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!

Maha Shivaratri 2023: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!

Love Horoscope Today 02 February 2023: ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు

Love Horoscope Today 02 February 2023: ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు

Horoscope Today 02nd February 2023: ఈ రాశివారికి తమ పనిపై కన్నా పక్కవారి పనిపై శ్రద్ధ ఎక్కువ, ఫిబ్రవరి 2 రాశిఫలాలు

Horoscope Today 02nd February 2023: ఈ రాశివారికి తమ పనిపై కన్నా పక్కవారి పనిపై శ్రద్ధ ఎక్కువ, ఫిబ్రవరి 2 రాశిఫలాలు

Vishnu Sahasranamam : విష్ణు సహస్రమానాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!

Vishnu Sahasranamam : విష్ణు సహస్రమానాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!

టాప్ స్టోరీస్

Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్‌లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?

Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్‌లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?

Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక

Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, తమతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, తమతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్