By: RAMA | Updated at : 26 Nov 2022 06:44 AM (IST)
Edited By: RamaLakshmibai
Love Horoscope Today 26th November 2022 (Image Credit: Freepik)
Love Horoscope Today 26th November 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
ప్రేమికుల మధ్య దూరం తగ్గుతుంది. జీవిత భాగస్వామిని స్పెషల్ గిఫ్ట్ తో సర్ ప్రైజ్ చేస్తారు. భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడతారు. కొంతమంది స్నేహితులతో సమావేశాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
వృషభ రాశి
ప్రేమికులకు ఈ రోజు మిశ్రమ దినంగా ఉంటుంది. ఇద్దరి మధ్యా మాట పట్టింపులు పెరుగుతాయి..గొడవ జరిగే అవకాశం ఉంది. కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ ని ఎంజాయ్ చేస్తారు. వేరేవారి మాటవిని మీ జీవిత భాగస్వామిని అనుమానించకండి.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారు రొమాంటిక్ ఆలోచనలతో ఉంటారు. భార్య-భర్త మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. పాత ప్రేమికుల మధ్య ఆకస్మిక సమావేశం జరగొచ్చు.
కర్కాటక రాశి
ఈ రాశి ప్రేమికులు సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడుకుంటారు. మీకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులను రెచ్చగొట్టే బ్యాచ్ మీ చుట్టూ ఉన్నారు జాగ్రత్త. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.
Also Read: మానవ శరీర నిర్మాణానికి - 14 లోకాలకు ఉన్న సంబంధం ఇదే
సింహ రాశి
ప్రేమ జంటలకు ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి శుభవార్త చెబుతారు. నిజంగా మీరు ఎవరినైనా ప్రేమించి ఉంటే ఈ రోజు మనసులో మాట చెప్పేయండి.
కన్యా రాశి
రొమాంటిక్ గా మాట్లాడడంలో ఈ రాశివారు ఘనులు. ప్రేమికులకు అద్భుతమైన రోజు. వివాహితులు మీ జీవిత భాగస్వామిపై వచ్చే రూమర్స్ ని పట్టించుకోవద్దు.
తులా రాశి
ఆన్ లైన్ పరిచయాలు,ప్రేమలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమికులు కొత్త వారిని ఎవ్వరినీ నమ్మొద్దు. ఈ రోజు ఓ శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వద్దు
వృశ్చిక రాశి
మీ జీవిత భాగస్వామిపై మీకు పూర్తిస్థాయి నమ్మకం ఉంటుంది. ప్రేమికులు మాత్రం ఇద్దరిలో ఉన్న చిన్న చిన్న లోపాలు, అసహనం తొలగించుకునేందుకు ప్రయత్నించండి. సమీపంలో ఉన్న సందర్శనా స్థలాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
ధనుస్సు రాశి
ఈ రాశి ప్రేమికుల మధ్య దూరం తగ్గుతుంది. విడిపోయిన వారు మళ్లీ కలుస్తారు. స్నేహితుల సలహాలు మీకు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉన్నప్పటికీ తొందర్లోనే కాంప్రమైజ్ అవుతారు.
Also Read: మార్గశిర గురువారం లక్ష్మీపూజ ప్రత్యేకం, అష్ట లక్ష్మీ రూపాల వెనుకున్న ఆంతర్యం ఇదే!
మకరం రాశి
ఈ రాశికి చెందిన దంపతుల మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమికులు చాలా బిజీగా ఉంటారు...వివాహానికి సంబంధించిన ప్రణాళిక వాయిదా పడుతుంది. సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు అందుబాటులో ఉంటారు. జీవిత భాగస్వామికి బహుమతి ఇస్తారు.
కుంభ రాశి
ఈ రాశి ప్రేమికులు పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. వివాహితులు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ప్రేమపూర్వక చర్చల్లో మీ జీవిత భాగస్వామితో ఓడిపోయి ఆనందిస్తారు...మంచి బహుమతి అందిస్తారు. ఈ రోజు దంపతులకు ప్రత్యేకం.
మీన రాశి
వివాహితులు-ప్రేమికులు...మీ భాగస్వామికి మీకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. దూరాన్ని తొలగించుకునేందుకు ఇదే మంచి సమయం. మరీ బెట్టు చేస్తే గడిచిన సంఘటనల్లో పడి మరింత మూడీగా మారిపోతారు.
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!
Maha Shivaratri 2023: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!
Love Horoscope Today 02 February 2023: ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు
Horoscope Today 02nd February 2023: ఈ రాశివారికి తమ పనిపై కన్నా పక్కవారి పనిపై శ్రద్ధ ఎక్కువ, ఫిబ్రవరి 2 రాశిఫలాలు
Vishnu Sahasranamam : విష్ణు సహస్రమానాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!
Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!
Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్కు ఇదే పెద్ద టాస్క్
Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని
PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam