అన్వేషించండి

Spirituality: మానవ శరీర నిర్మాణానికి - 14 లోకాలకు ఉన్న సంబంధం ఇదే

Spirituality: పాదాల నుంచి తల వరకూ మానవ శరీర నిర్మాణం మొత్తం అద్భుతమే..దీనివెనుకున్న ఆంతర్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి...అడుగు ముందుకు పడేలా ఉండాలి అని చెబుతుంటారు పెద్దలు. ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంటే విజయానికి అంత చేరువలో ఉన్నట్టే. చెడు ఆలోచనలు చేస్తున్నవారిని అందుకే అంటుంటారు రోజురోజుకీ దిగజారిపోతున్నారు..అధ:పాతాళంలో పడిపోతున్నారని...ఇంతకీ ఆలోచనకు పాతాళానికి ఏంటి సంబంధం... మనకున్న 14 లోకాల్లో ఆలోచనను అధ:పాతాళంతో పోలిస్తే..మరి మిగిలిన లోకాల సంగతేంటి అంటారా.. ఆలోచన మాత్రమే కాదు మానవ శరీర నిర్మాణంలో మొత్తం 14 లోకాలు ఉన్నాయి...అవేంటంటే...

పదునాలుగు లోకాలు అనే మాట వినే ఉంటారుగా... భూలోకానికి పైన ఆరు లోకాలు..కింద ఏడు లోకాలు ఉన్నాయని చెబుతారు. 
భూలోకానికి పైన ఉన్న లోకాలు (ఊర్ధ్వ లోకాలు) 
మనిషి ఊర్ధ్వ ముఖంగా మాత్రమే ప్రయాణం చేయాలని చెబుతారు. ఊర్థ్వ లోకాలు ఏంటంటే 
1.భూలోకం
2.భువర్లోకం
3.సువర్ణలోకం అంటే స్వర్గం
4.మహార్లోకం
5.జనోలోకం
6.తపోలోకం
7.సత్య లోకం (మోక్ష దశ పుట్టుక మరణం లేని దశ అదే బ్రహ్మ దశ )

భూలోకానికి కింద ఉన్న లోకాలు (అధోలోకాలు:) 
1.అతల
2.సుతల ( బలి చక్రవర్తి చోటు)
3.వితల: శివుడు అంశం
4.తలాతల: మయుడు ఉండే చోటు
5.మహాతల: నాగులు ఉండే చోటు (నాగలోకం)
6.రసాతల: రాక్షసులు ఉండే చోటు
7.పాతాళం: వాసుకి ఉండే చోటు

Also Read: హవన భస్మాన్ని నీటిలో వదులుతున్నారా? ఎంత నష్ట పోతున్నారో తెలుసా?

ఈ లోకాలని మానవ శరీరానికి పోలిక ఏంటంటే
 శరీరంలో మూలాధారం నుంచి పైకి... స్వాధిష్టాన, మణిపూరక,అనహత, విశుద్ధి,ఆజ్ఞ చక్రాలనే 6చక్రాలు ఉన్నాయి. వాటికి పైన ఉన్నది సహస్రారం/ సహస్రపద్మం. ఇవన్నీ కలిపి ఏడు. 
1. మూలాధారం: వెన్నుపూస అంత్య భాగంలో ఉంటుంది. ధారణశక్తి కి కేంద్రస్థానం ఇది. దీనికి మహాగణపతి అధిదేవత. ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు.
2. స్వాధిష్టానం:  బొడ్డు క్రింద, జననేంద్రియాల వద్ద ఉంటుంది. వివేకం దీని లక్షణం.
3. మణిపూరం: నాభిలో ఉంటుంది. సంకల్పశక్తికి కేంద్రస్థానం ఇది
4. అనాహతం: హృదయం దగ్గర ఉంటుంది. అపరోక్ష జ్ఞానానికి స్థానం
5. విశుద్ధం: కంఠంలో ఉంటుంది. దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం.
6. ఆజ్ఞ: కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం.
7. సహస్రారం: తలమీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం.

Also Read: ఇరుముడి అంటే ఏంటి, అయ్యప్ప స్వామి దర్శనానికి ఇరుముడి ఎందుకు!

మూలా ధారానికి దిగువన కూడా ఏడు చక్రాలున్నాయని కొన్ని ఆగమాల్లో కనిపిస్తుంది. వీటికి పాతాళలోకాలకు పోలిక ఏంటంటే..
1. అతల: అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది. తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామం దీని లక్షణం
2. వితల: నీరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది.
3. సుతల: బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది. అసూయ దీని లక్షణం.
4. తలాతలం: అంధకారం, తామసికం దీని లక్షణం. పిక్కల్లో ఉంటుంది. క్రింది స్థాయి చక్రం ఇది. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండి తనానికి ఇది స్థానం.
5. రసాతల: కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం. స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణo
6. మహాతల: అవివేకం దీని లక్షణం. పాదాల్లో ఉంటుంది.
7. పాతాళం: కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. అరికాలులో ఉంటుంది. 

 ఇవన్నీ ఎందుకు చెబుతారంటే ఎదుగుదల అయినా, ఆలోచన అయినా ఊర్థ్వముఖంగా ఉండాలి కానీ దిగువ ముఖంగా ఉండరాదు. పాతాళ లోకాల చక్రాల గురించి ప్రస్తావించిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఆ దుర్గుణాలను దూరం చేసుకుంటే మనిషిగా విజయం సాధించినట్టే...

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget