Horoscope 2023: 2023 ఈ నాలుగు రాశుల స్త్రీలకు కలిసొస్తుంది, మీరున్నారా ఇందులో!
Rashi Phalalu 2023: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope 2023: గ్రహాలు నెలకోసారి రాశి మారుతుంటాయి. ఆ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. కొందరికి అనుకూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి. అయితే కొన్ని గ్రహాల ప్రభావం ఏడాదంతా వెంటాడుతాయి. అలా 2023లో కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి. అయితే ఈ నాలుగు రాశుల స్త్రీలకు మాత్రం శుభపలితాలున్నాయి అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఆ రాశులేంటో చూద్దాం...
మేష రాశి
మేషరాశి స్త్రీలకు 2023 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. గతేడాది కన్నా ఈ ఏడాది మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగంతో బాధపడుతున్నవారు ఓ స్థిరమైన ఉద్యోగం సంపాదించుకుంటారు. విద్యార్థులకు శుభసమయం. ఉన్నత చదువులు చదువుకోవాలి అన్న మీ కోరిక నెరవేరుతుంది. ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం అస్సలు నిర్లక్ష్యం వద్దు.
Also Read: 2023లో అయినా ఈ రాశివారికి ఆహా అనిపించే రోజు ఉంటుందా! వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు
కర్కాటక రాశి
కర్కాటక రాశి స్త్రీలకు కూడా 2023 అదృష్టాన్నిస్తుంది. ఎప్పటి నుంచో అనుకున్న పనులు 2023లో పూర్తవుతాయి. గతేడాది పెండింగ్ పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పనులు కూడా ఈ ఏడాది సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. అవివాహితులకు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీరు తండ్రినుంచి మద్దతు పొందుతారు. ఇంటిని కొనుగోలు చేయాలని, దాన్ని పునర్నిర్మించాలని ఉన్నవారికి శుభసమయం.
కన్యా రాశి
కన్యారాశి స్త్రీలకు 2022 కన్నా 2023 అద్భుతంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు. ఎప్పటి నుంచో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగి ప్రశాంతత లభిస్తుంది. మీ సక్సెస్ ద్వారా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంటాబయటా గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆహారం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు.
Also Read: ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి స్త్రీలకు కూడా 2023 శుభసమయం అనే చెప్పాలి. తలపెట్టిన పనులు, కొత్త ప్రాజెక్టులు పూర్తిచేస్తారు. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు చేసే మహిళలు లాభాలు పొందుతారు. నగదు లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలి . మీ తెలివితేటల ద్వారా మీరు పెద్ద లాభాలను పొందుతారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
గురువు బాగుంటే అన్ని బాగున్నట్లే అంటారు. ఎన్ని గ్రహాలు నీఛ స్థితిలో ఉన్నా గురుగ్రహం అనుగ్రహం ఉంటే వాటి ప్రభావం అంతగా ఉండదని చెబుతారు జ్యోతిష్య పండితులు. విద్య, ఉపాధి, ఉద్యోగం, వివాహం, సంతానానికి సంబంధించిన తీరాలంటే గురుగ్రహ సంచారం బావుండాలి. బృహస్పతి ప్రభావంలో ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. కొత్త ఏడాదిలో ఈ నాలుగు రాశులవారిపై బృహస్పతి అనుగ్రహం కూడా ఉండడం వల్ల అంతా శుభమే జరుగుతుంది.