YSRCP Leaders : అరెస్ట్ భయంతో ఆజ్ఞాతంలో వైసీపీ ముఖ్య నేతలు - ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు
Andhra Pradesh : వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు అరెస్ట్ భయంతో ఆజ్ఞాతంలోకి వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.
YSRCP Main leaders went into hiding fearing arrest : వైఎస్ఆర్‌సీపీకి చెందిన ముఖ్య నేతలు ఆజ్ఞాతంలోకి వెళ్లారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి, చంద్రబాబునాయుడు ఆఫీసుపై దాడి వ్యవహారంలో వీరంతా నిందితులుగా ఉన్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించగా.. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని చేసుకున్న విజ్ఞప్తులు కూడా మన్నించలేదు. దీంతో పోలీసులు వారందర్నీ అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నందిగరం సురేష్ హైదరాబాద్ పారిపోవడంతో వెంటనే ఆయన ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేసి తీసుకు వచ్చారు. మిగతా వారి కోసం ప్రత్యేకబృందాలు గాలింపులు చేపడుతున్నాయి.
ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పరారీలో !
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిన్నామొన్నటి వరకూ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పని చేసిన లేళ్ల అప్పిరెడ్డి , దేవినేని అవినాష్ కీలక వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు, కాల్ డేట్ ద్వారా గుర్తించారు. వీరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు. దీంతో పోలీసులు అరెస్టు చేయలేదు. కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూశారు. ఈ మధ్యలో దేవినేని అవినాష్ దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసు జారీ చేయడంతో ఆయన ప్రయాణానికి అంగీకరించలేదు. ఇప్పుడు దేవినేని అవినాష్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పిరెడ్డి ఆచూకీ కూడా తెలియడం లేదు. వీరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తన్నాయి.
సత్యవేడు ఎమ్మెల్యేపై టీడీపీ చర్యలు - పార్టీ నుంచి సస్పెండ్
మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసుల గాలింపు
మరో వైపు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో నిందితడిగా ఉన్న జోగి రమేష్ కు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు.. అరెస్టు నంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆయన కూడా అరెస్టు భయంతో కనిపించకుండా వెళ్లారు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. దీంతో పోలీసులు ఆయన అనుచరుల కోసం గాలిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన వారిని సీసీ టీవీ ఫుటేజీల్లో గుర్తించి నిందితులుగా చేర్చారు. వారందర్న ఇవాళో రేపో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
పోటెత్తుతున్న ఉగ్రగోదావరి - భద్రాచలం వద్ద 45 అడుగులకు చేరిన వరద
సుప్రీంకోర్టులో పిటిషన్ కోసం ప్రయత్నాలు
మరో వైపు.. ఇప్పుడు అరెస్టుల నుంచి తప్పించుకుంటే ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని అనుకుంటున్నారు. ఆ పిటిషన్ దాఖలు చేసి విచారణ జరిగే వరకూ ఆజ్ఞాతంలో ఉంటే.. అరెస్టు నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నారు. అందుకే వారంతా ఆజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో తల దాచుకున్న వీరు.. పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో టచ్ లో ఉండి.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు వీరి పూర్తి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు దొరికితే అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.