By: ABP Desam | Updated at : 17 Nov 2021 02:46 PM (IST)
నెల్లూరులో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ సాధించింది. ప్రతిపక్ష టీడీపీకి ఒక్క కార్పొరేటర్ సీటు కూడా రాలేదు. ఇక బీజేపీ, జనసేన, వామపక్షాలు, స్వతంత్రులు కనీస సంఖ్యలో కూడా ఓట్లు సాధించలేకపోయాయి. 8 ఏకగ్రీవాలతోపాటు మొత్తం 54 వార్డుల్ని వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.
నెల్లూరు నగర కార్పొరేషన్ లో వైఎస్ఆర్‌సీపీ ముందుగానే అభ్యర్థుల్ని రంగంలోకి దించి ప్రచారం మొదలు పెట్టింది. టీడీపీ కూడా పోటా పోటీగా అభ్యర్థుల్ని బరిలో దించింది. అచ్చెన్నాయుడు, చినరాజప్ప, ఆనంద్ బాబు వంటి మాజీ మంత్రులు సైతం నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేశారు. పోలింగ్ కి ముందే 8 డివిజన్లను ఏకగ్రీవం చేసుకుని వైఎస్ఆర్‌సీపీ సగం పని పూర్తి చేసింది, ఇప్పుడు పోలింగ్‌లో మిగిలిన డివిజన్లను సొంతం చేసుకుంది. కనీసం నాలుగైదు స్థానాల్లో అయినా టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని భావించారు కానీ, అది కూడా సాధ్యం కాలేదు. 8 ఏకగ్రీవ స్థానాలు మినహాయిస్తే మిగతా 46 స్థానాలకు జరిగిన పోటీలో అన్నింటిని వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.
Also Read : గవర్నర్ బిశ్వభూషణ్‌కు అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు !
నామినేషన్లు, ఉపసంహరణ, పోలింగ్ విషయంలో అధికార పక్షానికి ప్రభుత్వ ఉద్యోగులు అండగా నిలిచారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే.. తమకి చెప్పుకోదగ్గ స్థానాలు వచ్చి ఉండేవని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎన్నికల ముందు నుంచీ నెల్లూరు సిటీని క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ పంతం నెగ్గించుకున్నారు.
నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీకి కూడా ఎన్నికలు జరిగాయి. అక్కడా వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. 20 వార్డులకు గాను 18 వార్డుల్ని వైఎస్ఆర్‌సీపీ గెలుచుకుంది. 2 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక వార్డు కౌంటింగ్ విషయంలో గొడవ జరగడంతో రీకౌంటింగ్ పెట్టారు. రీకౌంటింగ్ లో కూడా విజయం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థినే వరించింది. దీంతో నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పదవితోపాటు, బుచ్చి మున్సిపల్ చైర్మన్ పదవి కూడా వైఎస్ఆర్‌సీపీకే ఖాయమైంది.
Also Read: తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
Breaking News Live Telugu Updates: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్వేర్ ఉద్యోగి సజీవ దహనం
YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
Tirupati: సాఫ్ట్వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు
NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్
Lok Sabha Election 2024: ఢిల్లీ వేదికగా ఒక్కటవుతున్న విపక్షాలు, స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం