YS Vijayamma: వైఎస్ విజయమ్మ మరో బహిరంగ లేఖ - జగన్‌కు ఊరట కల్పించే విషయమే !
YSRCP: వైఎస్ విజయమ్మ తనకు జరిగిన కారు ప్రమాదంపై మరో బహిరంగ లేఖ రాశారు. ఈ విషయంలో జగన్ పేరు తీసుకు రావడంపై ఆామె కీలక వ్యాఖ్యలు చేశారు.

YS Vijayamma has written another open letter on her car accident: వైఎస్ విజయలక్ష్మి రాష్ట్ర ప్రజలకు మరో బహిరంగ లేఖ రాశారు. కొన్నాళ్ల క్రితం కర్నూలులో జరిగిన కారు ప్రమాదం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తన లేఖలో ఖండించారు. అసత్య ప్రచారాలతో తనకు మానసిక వేదన కలుగుతోందన్నారు. వాటిని ఖండించకపోతే ప్రజలు నిజం అనుకునే ప్రమాదం ఉందన్నారు. ప్రజలకు నిజం తెలియాలని కొంత మంది దుర్మార్గపు ఉద్దేశాలను ప్రజలకు తెలియచేయాలనే మరో బహిరంగ లేక రాస్తున్నానని తెలిపారు.
ఎప్పుడో జరిగిన ప్రమాదాన్ని తన కుమారుడికి ముడిపెట్టి ప్రచారం చేయడం జుగుప్సాకరమని విజయమ్మ పేర్కొన్నారు. రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేయడం దర్మార్గమన్నారు. అమెరికాలో ఉన్న మనవడి దగ్గరకు వెళ్లానని.. జగన్‌కు భయపడి వెళ్లలేదన్నారు. ఇలా చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను, వ్యక్తిత్వ హననాలను ఆపితే మంచిదని విజయమ్మ స్పష్టం చేశారు. ప్రజలు బుద్ది చెబుతారని ఇలాంటి ప్రచారాలు చేస్తే తాను సహించబోననన్నారు. 
ఇటీవల తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విజయమ్మ కారు ప్రమాదం జగన్ కుట్రేనని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. కొత్త కారు .. రెండు టైర్లు ఒకే సారి పేలిపోవడం ఏమిటని సందేహం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో విజయమ్మ అమెరికాకు .. జగన్ కు భయపడే వెళ్లారని ఆరోపించింది.
రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు... వందల మందిని తనకు రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఇది. సరికొత్త కారు. అత్యాధునిక సెక్యూరిటీ హంగులు ఉన్న కారు. అయినప్పటికీ ఒకేసారి రెండు… pic.twitter.com/GWGdbXm6xz
— Telugu Desam Party (@JaiTDP) November 1, 2024
ఈ ఆరోపణ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణం అయింది. ఇది ప్రజల్లోకి మరింతగా వెళ్తే జగన్ గురించి తప్పుగా అనుకుంటారన్న ఉద్దేశంతో.. విజయమ్మ ఈ లేఖ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.
11 కలిసొచ్చేలా అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు - వైసీపీని ట్రోల్ చేస్తున్నారా ?
ఆస్తుల వివాదంలో జగన్, షర్మిల మధ్య వచ్చిన వివాదంలో... విజయలక్ష్మి కుమార్తె షర్మిల వైపే ఉన్నారు. ఈ కారణంగా జగన్ తో ఆమె సంబంధాలు దెబ్బతిన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఒకటో తేదీన టీడీపీ చేసిన ఆరోపణలపై వైసీపీలో ఆగ్రహం వ్యక్తమయిది. తాము ఖండించడం కంటే.. విజయమ్మతో ఇలాంటి ఆరోపణలను ఖండింప చేస్తేనే మంచిదన్న ఉద్దేశంతో కుటుంబసభ్యులు విజయమ్మతో మాట్లాడి ఈ వివరణ లేఖను రిలీజ్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఆస్తుల వివాదాల ను ఆసరాగా చేసుకుని తమ కుమారుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరి కాదని విజయమ్మ భావిస్తున్నారు.
నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది - పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు





















