By: ABP Desam | Updated at : 03 Nov 2021 12:30 PM (IST)
ఎవరీ పంచ్ ప్రభాకర్ రెడ్డి ?
సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడిగా చెలామణి అవుతూ ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులలో మొదటి పేరు పంచ్ ప్రభాకర్ పేరు ఉంటుంది. అదే పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న పంచ్ ప్రభాకర్ ఎవర్నీ వదిలి పెట్టారు. భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై "అమ్మ..నా బూతులు" ప్రయోగిస్తూ ఉంటారు. అత్యంత దారుణమైన భాషతో ఉండే ఆయన వ్యాఖ్యలపై తరచూ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదవుతూ ఉంటాయి. కులాలను తిట్లడం దగ్గర్నుంచి న్యాయవ్యవస్థ, రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారిని కూడా వదిలి పెట్టరు. అందుకే ఆయన పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.
ప్రవాసాంధ్రుడైన పంచ్ ప్రభాకర్ అసలు పేరు చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి. ఆయన ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వారని చెబుతారు. వెటర్నరీ డాక్టర్ అయిన ఆయన అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటారు. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంలో కీలక సభ్యుడని అంటారు. అయితే ఓ సారి కులాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి అలియాస్ పంచ్ ప్రభాకర్‌తో వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాకు సంబంధం లేదని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
Also Read : అభ్యంతరకర పోస్టులపై దర్యాప్తు చేయగలరా లేదా... సీబీఐపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
హైకోర్టు న్యాయమూర్తులపై కూడా అనుచితంగా దూషించిన కేసులో ఆయనకు గతంలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఆయన దాదాపుగా ప్రతీ రోజూ యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ప్రతీ వీడియోలోనూ ఆయన వైఎస్ఆర్‌సీపీకి ఎవరు వ్యతిరేకంగా ఉంటారో వారిని బండ బూతులు తిడుతూ ఉంటారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీ రఘురామకృష్ణరాజులను కూడా ఆయన వదల్లేదు. ఈ అంశంపై ఢిల్లీలో కూడా కేసు నమోదయింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read : నెల్లూరు కార్పేరేషన్ ఎన్నికల్లో టీడీపీకి షాక్..
న్యాయమూర్తులపై దూషణల కేసుల్లోనూ ఆయన పేరు కీలకంగా ఉండటం.. ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్ వంటి వారినీ చంపుతానన్నట్లుగా మాట్లాడి ఉండటంతో ఆయనను ఇండియాకు పిలిపిస్తారని అనుకున్నారు. కానీ ఆయనను పట్టుకోవడానికి సీబీఐ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో ఆయన వీడియోలు అలా సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. హైకోర్టు ఆగ్రహించిన తర్వాత ఆయన చానల్ ఇండియాలో మాత్రం కనిపించకుండా లాక్ చేసుకున్నారు. ఇప్పుడు హైకోర్టు పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసేందుకు పది రోజు డెడ్ లైన్ పెట్టింది.
ALSO READ: ఓ కార్పొరేషన్ -12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ! ఏపీలో మినీ స్థానిక సమరానికి షెడ్యూల్ రిలీజ్ !
Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
Breaking News Live Updates : ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం
Chandrababu Tour : నేడు కడప జిల్లాలో చంద్రబాబు టూర్, పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం
Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మిత్రులు సజీవదహనం
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్
ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు
Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్
Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?