(Source: ECI/ABP News/ABP Majha)
AP High Court: అభ్యంతరకర పోస్టులపై దర్యాప్తు చేయగలరా లేదా... సీబీఐపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్ కేసులో సిబీఐను తీవ్రంగా ఆక్షేపించింది ఏపీ హైకోర్టు. పది రోజుల్లో పంచ్ ప్రభాకర్‌ను అరెస్టు చేయాలని ఆదేశించింది.
జడ్జ్‌లపై కామెంట్స్ చేసిన కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిని అరెస్టుకు అల్టిమేటం జారీ చేసింది. ముఖ్యంగా పంచ్‌ప్రభాకర్‌ను పది రోజుల్లో అరెస్టు చేయాలని ఆదేశించింది.
న్యాయవ్యవస్థను, తీర్పులు ఇచ్చిన జడ్జ్‌లపై సోషల్ మీడియాలో కామెంట్ చేసిన కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పు పట్టింది. విచారణ రైట్ డైరెక్షన్‌లో వెళ్లడం లేదని.. ఆక్షేపించింది. ఇన్‌టైంలో నిందితులను అరెస్టు చేయలేపోతే సిట్ ఏర్పాటు చేస్తామని తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై పూర్తి వివరాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు జోక్యాన్ని కూడా కోరుతామని అభిప్రాయపడింది హైకోర్టు.
జడ్జిలను అసభ్యకరంగా దూషించిన కేసును మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ లలితతో కూడిన బెంచ్ విచారించింది. ఈ కేసులో పిటిషనర్ తరఫున అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కామెంట్ చేసిన బెంచ్.. సోషల్ మీడియాలో పోస్టులు ఎప్పుడు తొలగిస్తారని ప్రశ్నించింది. పోస్టులు పెట్టిన రెండు మూడేళ్లకు తొలగిస్తారా అని వ్యాఖ్యానించింది. అప్పుడు తొలగిస్తే ప్రయోజనం ఏంటని నిలదీసింది.
అయితే వీడియోలు, పోస్టులు తొలగించేందుకు గూగుల్‌కు లేఖలు రాశామన్నారు సీబీఐ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది. దీనికి సమాధానంగా పోస్టులు పెట్టిన వ్యక్తినే రిక్వస్ట్ చేసుకోవాలని గూగుల్ సమాధానం ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. పంచ్‌ప్రభాకర్‌కు రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేశామన్నారు. ఈ సమాధానంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. సీబీకి చేతకాకపోతే సిట్ ఏర్పాటు చేస్తామంది. పంచ్‌ప్రభాకర్‌ను పట్టుకోవడానికి మూడు రోజులే గడువు ఇస్తున్నట్టు తేల్చి చెప్పింది. అయితే సీబీఐ రిక్వస్ఠ్ మేరకు పదిరోజుల సమయం ఇచ్చింది. అనంతరం కేసు విచారణ వాయిదా వేసింది.
ALSO READ:విటమిన్ సి వల్ల జలుబు తగ్గుతుందా? నిజమేనా?
ALSO READ: ఇక ఆ ఐదు అంశాలపైనే నా పోరాటం.. ఇలాంటి ఎన్నికలు మళ్లీ రావొద్దు
ALSO READ: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి
ALSO READ: మానస్ ని సేవ్ చేసిన యానీ మాస్టర్.. ప్రియాంక ఫైర్..
ALSO READ: ఒత్తిడి ఎక్కువైపోతుందా.... వీటిని తినడం అలవాటు చేసుకోండి.
ALSO READ: ఐదు రోజుల పండుగ దీపావళి... ధంతేరాస్ నుంచి భగనీహస్తం భోజనం ప్రతిరోజూ ప్రత్యేకమే
ALSO READ: 'అభిమానులు అనాలా..? ఆర్మీ అనాలా..?'.. 'ఆహా 2.0' ఈవెంట్ లో బన్నీ..