AP Buggana : చట్టాన్ని ఉల్లంఘించి అప్పులు చేసినట్లుగా ఒప్పుకున్న బుగ్గన ! ఇక కేంద్రం అప్పులు తీసుకోనివ్వకపోతే ఏం చేస్తారు ?
ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమర్థనపై నిపుణుల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి 7 శాతం ఎక్కువ అప్పులు చేసినట్లుగా ఆయన చెప్పారు.
" ఎఫ్‌బీఎం చట్టాల ప్రకారం రుణాలు 4 శాతం దాటకూడదు. 11 శాతం దాటాయి. దీనిపైనా కేంద్రం నోటీసులు పంపుతుంది. వివరణ ఇస్తాం..." ఆంటూ ఆంద్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆర్థిక నిపుణుల్లో చర్చనీయాంశం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఇప్పటికే అనేక రకాల సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగా అన్నారో లేకపోతే ముందు ముందు వివాదం అవుతుంది కాబట్టి మందుగానే తెలియాలి అని అనుకున్నారో కానీ ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎఫ్ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి మరీ ఏడు శాతం ఎక్కువ తెచ్చుకున్నట్లుగా చెప్పారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఎలా కవర్ చేసుకుంటారు..? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కిస్తారన్నది కీలకంగా మారింది.
Also Read : అభ్యంతరకర పోస్టులపై దర్యాప్తు చేయగలరా లేదా... సీబీఐపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి 7 శాతం మేర అదనపు అప్పులు !
కేంద్రం అయినా, రాష్ట్ర ప్రభుత్వాలు అయినా చట్టాల ప్రకారం పాలన చేయాలి. ఆ ప్రకారం అప్పులు చేయడానికి పరిమితి విధిస్తూ ఓచట్టం కూడా అదే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) ప్రకారం రుణాల పరిమితి ఉటుంది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వాలు రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే జీఎస్‌డీపీలో 4శాతం రుణాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల కరోనా పరిస్థితులు, వివిధ సంస్కరణల అమలు వంటివి చేయడం వల్ల కొంత మేర వరకూ అదనపు రుణాలు తీసుకోవచ్చు. కానీ అది అర శాతం.. పావు శాతం వరకే ఉంటుంది. కానీ బుగ్గన రాజేంద్రనాథ్ అప్పులు జీఎస్డీపీలో 11 శాతానికి చేరాయని నేరుగా ప్రకటించారు.
Also Read : రఘువీరారెడ్డిని తాడుతో కట్టేసిన మనవరాలు... విషయం తెలిస్తే మీరూ ప్రశంసిస్తారు..
కేంద్రం అనుమతి లేకుండా అలా అప్పులు చేయడం సాధ్యమేనా ?
2020-21లో ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ రూ. 10,61,902 కోట్లుగా ఉంది. నిబంధనల ప్రకారం అందులో 4 శాతం వరకూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం అప్పులు చేసుకునే వీలుంటుంది. అంటే ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 42,472 కోట్ల వరకూ అప్పులు తెచ్చుకునే వీలుంది. అందులో మూలధనం కింద రూ. 27,589 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది ఖర్చు చేస్తే అదనంగా మరో 0.5 శాతం అప్పులు చేసుకునే వీలుంటుంది. అంతే కానీ అంతకు మించి అప్పులు చేయడానికి లేదు. ఈ అప్పులు కేవలం ఆర్బీఐ వద్ద బాండ్లు వేయం వేయడం అప్పులు మాత్రమే కాదు.. ఏపీ ప్రభుత్వం తిరిగి చెల్లించేలా తీసుకున్న ప్రతి రూపాయి ఈ రుణం కిందకు వస్తుంది. అంటే కార్పొరేషన్లు.. ఇతర పద్దతుల్లో తీసుకుంటున్న రుణాలన్నీ ఈ పరిధిలోకి వస్తాయి.
Also Read: "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?
పరిమితిని మించి అప్పులు చేస్తే రుణభారాన్ని ఎలా మోస్తారు ?
నాలుగు శాతం అంటేనే రూ. 42,472 కోట్ల రుణాలు అంటే.. అదే పదకొండు శాతం రుణాలు అంటే... రూ. లక్ష కోట్ల పైమాటే. అంత భారీ ఎత్తున రుణం తీసుకోవడం చట్ట వ్యతిరేకం. కేంద్రానికి తెలిస్తే అంగీకరించే అవకాశం లేదు. అయితే ఇప్పటికే అప్పులు చేసేశామని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. దీనిపై కేంద్రం నోటీసులు ఇస్తుందని.. దానికి సమాధానం ఇస్తామని కూడా చెప్పారు. కేంద్రం నోటీసులు.. దానికి రాష్ట్రం సమాధానం రొటీన్ ప్రక్రియే అనుకున్నా.. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఇక్కడ ఆసక్తికరంగా మరింది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు
ఇక అప్పులు చేయకుండా కట్టడి చేస్తే ప్రభుత్వం నడిచేదెలా ?
గత ఆర్థిక సంవత్సరంలో చెప్పకుండా దాచి పెట్టిన అప్పుల లెక్కల కారణంగా పరిమితికి మించి అప్పులు చేశారని ఈ ఏడాది రుణ పరిమితిలో కేంద్రం కోత విధించింది. అయితే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేసుకుని అదనపు రుణాలకు పర్మిషన్ తెచ్చుకుంది. ఇప్పుడు చట్టా్ి పూర్తి స్థాయిలో ఉల్లంఘించినట్లుగా బుగ్గనే అంగీకరించినందున.. త్వరలో ఇక అప్పులు చేయకుండా కేంద్రం పూర్తి స్థాయిలో కట్టడి చేస్తే ప్రభుత్వం నడవడం కష్టమైపోతుందన్న అంచనాలు ఉన్నాయి. నెలకు రూ. పది వేల కోట్లు అప్పులు చేస్తే తప్ప.. ఇప్పటి వరకూ చేసిన అప్పులకు వడ్డీలు, జీతాలు ఇతర ఖర్చులకు సరిపోవడం లేదన్న లెక్కలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు బుగ్గన చెప్పిన ఎఫ్‌ఆర్‌బీఎం అప్పుల లెక్కలు ముందు ముందు కీలక పరిణామాలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read : లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యాన్ని సాధించలేకపోయిన వైఎస్ఆర్‌సీపీ ! ఓటింగ్ తగ్గడమే కారణం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి