News
News
X

MP GVL Narsimharao : చంద్రబాబు ఆరాటం 'లోక' కల్యాణం కోసం కాదు 'లోకేశ్' కల్యాణార్థం - ఎంపీ జీవీఎల్

MP GVL Narsimharao : శ్రీరాముడితో చంద్రబాబును పోలుస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఎంపీ జీవీఎల్ తప్పుబట్టారు. చంద్రబాబు ఆరాటం అంతా లోకేశ్ కల్యాణార్థం కోసమే అని విమర్శించారు.

FOLLOW US: 

MP GVL Narsimharao : శ్రీరాముడు తనొక్కడే వెళ్లి రావణుడిని చంపలేడా? అయినా.. హనుమంతుడు, విభీషణుడు, ఉడతా ఇలా అందరినీ సాయం తీసుకున్నది లోక కల్యాణం కోసమే. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్యాణం కోసం చంద్రబాబు నాయుడు అలాంటి ఆలోచనే చేయాలని అయ్యన్నపాత్రుడు అన్నారు.  శ్రీరాముడితో చంద్రబాబును పోలుస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.   

News Reels

లోకేశ్ కల్యాణార్థం కోసమే 

"భగవంతుడైన శ్రీరాముడితో తమ నాయకుడు చంద్రబాబును పోలుస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు. ఇతర పార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? మీ నాయకుడి ఆరాటం "లోక"కల్యాణం కోసం కాదు. "లోకేశ్"కల్యాణార్థం అని అందరికీ తెలుసు."  అంటూ ట్వీట్ చేశారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 

అయ్యన్నపాత్రుడు ఏమన్నారంటే? 

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ముందే ప్రకటించాలని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. సరిగ్గా పని చేయని వారికి టికెట్ ఇవ్వబోమని చంద్రబాబు నిర్మొహమాటంగా ప్రకటించేయాలని అభిప్రయాపడ్డారు. ఒకవేళ తాను గెలవలేను అనే అభిప్రాయం ఉన్నాసరే టికెట్ ఇవ్వొద్దని చెప్పారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. శ్రీరాముడు తనొక్కడే వెళ్లి రావణుడిని చంపలేడా? అయినా.. హనుమంతుడు, విభీషణుడు, ఉడతా ఇలా అందరినీ సాయం తీసుకున్నది లోక కల్యాణం కోసమే. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్యాణం కోసం చంద్రబాబు నాయుడు అలాంటి ఆలోచనే చేయాలని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.  

'ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి?' అని మార్చాలి

"9 ఎన్నికల్లో పోటీ చేశా.. 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలుపొందా.. రెండు సార్లు ఓడిపోయా.. నాకు ప్రజల నాడి తెలుసు. ఇప్పటికే ప్రజల్లో ట్రెండ్ మారిపోయింది. ఈ దుర్మార్గ పాలన వద్దు అని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు నాయుడిని గెలిపిస్తామని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం. అందుకే అభ్యర్థులను ముందే నిర్ణయించాలి. సరిగ్గా పని చేయని వారికి టికెట్ ఇవ్వబోమని చంద్రబాబు మొహమాటం లేకుండా చెప్పాలి" అని అయ్యన్నపాత్రుడు అన్నారు. "తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని టీడీపీ నాయకులు అంతా 175 నియోజకవర్గాల్లో గట్టిగా నిలదీసి నిలబడాలి. కింది స్థాయికి వెళ్లే వరకు మాట్లాడుతూనే ఉండాలి. అలాగే 'ఇదేం ఖర్మ' పేరులోనూ కొన్ని మార్పులు చేయాలి. దానిని 'ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి?' అని మారిస్తే బాగుంటుంది" అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 

Published at : 20 Nov 2022 02:29 PM (IST) Tags: BJP Visakha News Lokesh MP GVL Chandrababu TDP Ayyannapatrudu

సంబంధిత కథనాలు

Chandrababu: చంద్రబాబు ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ ప్రోగ్రాం సక్సెస్ చేద్దాం: ఎమ్మెల్యే గోరంట్ల పిలుపు

Chandrababu: చంద్రబాబు ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ ప్రోగ్రాం సక్సెస్ చేద్దాం: ఎమ్మెల్యే గోరంట్ల పిలుపు

Kothapeta News : కన్ను పడితే కనకమంతా మాయం, తాళం వేసిన ఇళ్లే టార్గెట్!

Kothapeta News : కన్ను పడితే కనకమంతా మాయం, తాళం వేసిన ఇళ్లే టార్గెట్!

AP CM Jagan Security : ఏపీ సీఎం ఇంటి వద్ద టైర్ కిల్లర్స్ - రూ.2 కోట్లతో పెట్టిన కొత్త రక్షణ వ్యవస్థ గురించి తెలుసా ?

AP CM Jagan Security : ఏపీ సీఎం ఇంటి వద్ద టైర్ కిల్లర్స్  - రూ.2 కోట్లతో పెట్టిన కొత్త రక్షణ వ్యవస్థ గురించి తెలుసా ?

Breaking News Live Telugu Updates: ఏపీ సీఎం జగన్ నివాసానికి అధునాతన పరికరాలతో భద్రత

Breaking News Live Telugu Updates: ఏపీ సీఎం జగన్ నివాసానికి అధునాతన పరికరాలతో భద్రత

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!