Ganja Transportation: కారు సీఎన్జీ ట్యాంకులో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లర్లు
Ganjai Transportation: పుష్పా సినిమా తరహాలో గంజాయి స్మగ్లర్లు కొత్తఎత్తుగడ వేశారు. కారు సీఎన్జీ ట్యాంకులో గంజాయి రవాణా చేస్తూ మేడ్చల్ పోలీసులకు పట్టుబడ్డారు
గంజాయి(Ganjai) అక్రమ రవాణాకు స్మగ్లర్లు రకరకాల వేషాలు వేస్తున్నారు. సినిమాను తలపించే రీతిలో పోలీసుల(Police) ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప(Puspa) సినిమాలో ఎర్రచందనాన్ని పాలవ్యాన్ కిందపెట్టుకుని పైన పాలు కనిపించేలా పోలీసులకు కనికట్టు చేసిన తరహాలోనే గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను మేడ్చల్ ఓఎస్ టీ పోలీసులు పట్టుకున్నారు
గంజాయి(Ganjai) అక్రమ రవాణాకు స్మగ్లర్లు రకరకాల వేషాలు వేస్తున్నారు. సినిమాను తలపించే రీతిలో పోలీసుల(Police) ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప(Puspa) సినిమాలో ఎర్రచందనాన్ని పాలవ్యాన్ కిందపెట్టుకుని పైన పాలు కనిపించేలా పోలీసులకు కనికట్టు చేసిన తరహాలోనే గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను మేడ్చల్ ఓఎస్ టీ పోలీసులు పట్టుకున్నారు
సీఎన్జీ ట్యాంకులో గంజాయి రవాణా
పోలీసులు ఎంత నిఘా ఉంచినా...విశాఖ(Vizag) మన్యం నుంచి గంజాయి సరఫరా అవుతూనే ఉంది. చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు పెంచినా...చేరాల్సిన చోటకు చేరాల్సిన సమయంలో సరుకు వచ్చి చేరుతోంది. పోలీసుల కళ్లుగప్పి వివిధ నగరాలకు మాల్ తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. స్మగ్లర్ల పథకాలు చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. సరిగ్గా అలాంటి అనుభవమే మేడ్చల్(Medchal) పోలీసులకు ఎదురైంది. డీజిల్ కారుకు సీఎన్జీ(CNG) ట్యాంకు బిగించి అందులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను ఓఎస్ టీ పోలీసులు పట్టుకున్నారు...
పుష్పా-2
అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప చిత్రం చూశాం కదా....అందులో డీఎస్పీ గోవిందప్ప కంటపడకుండా ఎర్రచందనం దుంగలు చెక్ పోస్టు దాటించేందుకు మన పుష్పగాడు వేసిన ఎత్తులు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. పాల ట్యాంకును సగానికి కత్తిరించి అందులో ఎర్రచందనం( Red Sandel) దుంగలు పేర్చి...పైన రేకుతో కప్పిపెట్ట మళ్లీ పైన పాలట్యాంకు యథావిథిగా ఉండేలా చేసి దుంగలు రవాణా చేస్తారు. సరిగ్గా ఇదే సూత్రాన్ని గంజాయి స్మగర్లు అవలంభించారు. పోలీసులు ఎన్ని విధాలుగా గంజాయి దాచిపెట్టిన కనిపెట్టేస్తుండటంతో ఇలాంటి పథకానికే శ్రీకారం చుట్టారు. డీజిల్(Desil) కారుకు వెనక సీఎన్ జీ ట్యాంకు బిగించారు. దాన్ని కారుకు అనుసంధానం చేసినట్లు వైర్లు, పైపులు మొత్తం సెట్ చేశారు. కారు డీజిల్ తోనే నడుస్తుంది. కానీ ఈ సీఎన్ జీ( CNG) ట్యాంకు నిండా మొత్తం గంజాయితో నింపేశారు. పోలీసులు తనిఖీ చేసినా....లోపల గ్యాస్ ఉంటుందనుకుని దాని జోలికి వెళ్లరు. అదే ధైర్యంతో దర్జాగా మెయిన్ రోడ్డుమీదుగానే గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు...
అరణ్యం టూ ఆగ్రా వయా హైదరాబాద్
విశాక మన్యం నుంచి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా(Aghra)కు కారులో గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ వద్ద అనుమానాస్పదంగా వస్తున్న కారును ఓఎస్టీ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వారి వ్యవహారం తడబాటు చూసి పోలీసుల అనుమానం మరింత ఎక్కువైంది. కార్లను క్షుణ్ణంగా తనిఖీ చేయగా....అసలు విషయం బయటపడింది. సీఎన్జీ ట్యాంకులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 65 కిలోల గంజాయి, 2 కార్లు, 6 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండుకు తరలించారు.