Vizag TCS: విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
Andhra Pradesh News | యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రముఖ ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు. విశాఖలో టీసీఎస్ ఆఫీసు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.
![Vizag TCS: విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్ TCS to open its office in Visakhapatnam says AP Minister Nara Lokesh Vizag TCS: విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/09/292be6e18436e3af7633706972e41c031728481605149233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TCS to open its office in Visakhapatnam says AP Minister Nara Lokesh | విశాఖపట్నం: ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ సాధించారు. ఇచ్చిన మాట ప్రకారం టాటా గ్రూప్ ని ఒప్పించి విశాఖలో సంస్థ ఏర్పాటుకు ఒప్పించారు. దాంతో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ( TCS) విశాఖలో మణిహారం కానుంది. మెరుగైన జీతభత్యాలతో దాదాపు 10 వేల ఐటీ ఉద్యోగాలు యువతకు లభిస్తాయి. యువగళం పాదయాత్రలో నారా లోకేష్, ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు రప్పించి యువతికి రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తానని మాటిచ్చారు. ఆ మాట నెరవేర్చే దిశగా అడుగులు వేశారు. అందులో భాగంగా టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, పెద్దలను ఒప్పించి విశాఖకు టెక్ దిగ్గజ సంస్థ టీసీఎస్ ని రప్పించారు.
ముంబైలో టాటా సన్స్ చైర్మన్, ప్రతినిధులతో నారా లోకేష్ భేటీ
ముంబైలోని టాటా సన్స్ ఆఫీస్ (Tata Sons Office in Bombay) బాంబే హౌస్ లో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌తో ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ ముఖ్య సమావేశంలో సీఎంవో అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా, టాటా గ్రూప్ (Tata Group) అధికారులు పాల్గొని ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించారు. చంద్రబాబు ప్రభుత్వంలో విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను టాటా సంస్థ చైర్మన్, ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ వివరించారు. ఏపీ ప్రభుత్వం అందించనున్న సహకారం, వారి విజన్ ను విన్న అనంతరం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ( TCS in Vizag) తమ సెంటర్‌ను సాగర నగరం వైజాగ్ లో నెలకొల్పుతామని సంస్థ ప్రకటించింది. తద్వారా 10వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని టీసీఎస్ ప్రతినిధులు తెలిపారు. దాంతో పాటు ఏపీలో ఈవీ, స్టీల్, ఏరో స్పేస్, హోటల్స్, టూరిజం రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు చూసుకుంటామని టాటా గ్రూప్ మంత్రి నారా లోకేష్‌కి తెలిపింది.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీ ప్రభుత్వం
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 'ప్రముఖ టెక్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) విశాఖలో ఆఫీసు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. తద్వారా 10,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీ ప్రభుత్వం ప్రముఖ కంపెనీలను రాష్ట్రానికి రావాలని స్వాగతిస్తోంది ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపేందుకు టీసీఎస్ లాంటి ప్రఖ్యాత కంపెనీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకుందని’ హర్షం వ్యక్తం చేశారు.
Also Read: Andhra News: విభజన కంటే జగన్ పాలనతోనే ఏపీకి ఎక్కువ నష్టం, కల్తీ మనుషులు అంటూ చంద్రబాబు ఆగ్రహం
ఐటీ హబ్‌గా మారనున్న విశాఖపట్నం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను తమ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో పరుగులు పెట్టిస్తుందని సీఎం చంద్రబాబు ఇటీవల అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పాటు మరోవైపు యువతకి తాను ఇచ్చిన మాట మేరకు నారా లోకేష్ ప్రముఖ టెక్ సహా ఇతర కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా టీసీఎస్ ఏర్పాటు ఖాయమైంది. మరోవైపు లులూ, బ్రూక్ ఫీల్డ్, సుజలాన్, ఒబెరాయ్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయి. తాజాగా మంత్రి లోకేష్ టాటా గ్రూప్‌ని ఒప్పించి విశాఖకు టీసీఎస్ ( TCS) రప్పిస్తున్నారు. త్వరలో విశాఖ ఐటీ హబ్‌గా మారనుంది.
Also Read: Chandrababu: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు చంద్రబాబు మద్దతు, మరో ఎన్నికలు సైతం నిర్వహణపై యోచన
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)