Andhra News: విభజన కంటే జగన్ పాలనతోనే ఏపీకి ఎక్కువ నష్టం, కల్తీ మనుషులు అంటూ చంద్రబాబు ఆగ్రహం
Andhra Pradesh News | ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల తలెత్తిన సమస్యల కంటే గత ఐదేళ్లలో పాలనతో విధ్వంసం జరిగి, తీవ్రంగా నష్టపోయామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
AP CM Chandrababu on Vizag Steel Plant | అమరావతి: సుస్థిరమైన పాలన, అభివృద్ధి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోజు చేసిన పనుల వల్ల హైదరాబాద్ బెస్ట్ ఎకో సిస్టమ్ వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే విధ్వంసకర పాలన వల్ల ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఓట్లు వేస్తే మెరుగైన, పారదర్శకత కలిగిన పాలన ఉంటే సంస్కరణలు వస్తాయన్నారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుని చేసే ప్రభుత్వం ఉంటే ఏపీలో మెరుగైన ఫలితాలు ఉండేవని పేర్కొన్నారు.
4 నగరాలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్..
చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ రెండు దఫాలుగా సేవలు అందించి, మరోసారి పదవి చేపట్టారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. వృద్ధిరేటు 7కి పైగా నమోదు చేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన ఆరు లక్షల మంది ఆరోగ్య ప్రయోజనం చేకూరుతుంది. ప్రైవేట్ మాళిక సదుపాయాలు ద్వారా అభివృద్ది కొత్త పుంతలు తొక్కుతోంది. ఏపీలో రైల్వే మీద కేంద్ర ప్రభుత్వం రూ.75 వేల కోట్లు ఖర్చు చేయనుంది. సింగిల్ లైన్లను డబుల్ లైన్ గా పనులు చేపడతారు. అహ్మదాబాద్ నుంచి ముంబై బుల్లెట్ ట్రైన్ తెస్తున్నారు. దక్షిణ భారత్ లో హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు. వీటిని కలుపుతూ బుల్లెట్ ట్రైన్ వస్తే ఈ నగరాలలో ఉండే 4 కోట్ల వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయంపై కేంద్రాన్ని కోరాం.
రోడ్ల అభివృద్ధి కోసం రూ.62,500 కోట్లు ఖర్చు, జల్ జీవన్ మిషన్ పై కేంద్రం ఫోకస్ చేస్తోంది. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఎనర్జీ లాంటి కనెక్టివిటీ పెరుగుతుంది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను బాధ్యతగా ప్రశంసించాలి. ఉద్దేశపూర్వకంగా తలా తోకా లేకుండా ఏపీలో విమర్శలు చేస్తున్నారు. వైసీపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వారిలో రాజకీయ చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ కూటమిలో తాము భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉన్నాం. దేశ అభివృద్ధిలో తాము కూడా కూటమి ద్వారా పాలు పంచుకుంటున్నాం. ఓవైపు నాలెడ్జ్ మొత్తం క్లౌడ్ లో ఉంటుంది, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇతర కొత్త టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించాలి. ఆధార్ అనేది విప్లవాత్మక విధానం. వ్యక్తి పూర్తి వివరాలు అందులో ఉంటాయి. వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు సైతం కొత్త డిజిటల్ కార్డు లాంటివి వస్తాయి. స్కూళ్లో విద్యార్థులు చేరిన సమయంలో కొత్త ప్రొఫైల్ లాంటివి చేస్తే.. పెద్ద డేటా హబ్ ఏర్పడి అత్యవసరమైన సమయంలో ప్రయోజనం ఉంటుందని’ చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
మంత్రులు, సీఎస్ అంతా బురదలో దిగారు..
కేంద్రంతో అనుసంధానమై పనులు చేస్తూపోతే ఏపీ అభివృద్ధి వేగవంతం అవుతుంది. తెలుగుజాతి దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ అగ్రస్థానంలో నిలవాలి. కానీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం పెరిగింది. వాస్తవం ఏదో తెలిసేలోపే వదంతులు చివరి వ్యక్తిని కూడా చేరుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా పది రోజులు బురదలో దిగి మేం పరిస్థితిని చక్కదిద్దాం. వరదలపై వీలైనంత వరకు దుష్ప్రచారం చేశారు. బుడమేరుకు గండి పడేందుకు, సర్వనాశననానికి కారకులు వాళ్లు. తప్పుడు పనులు చేసింది వాళ్లు. ఆఖరికి ప్రకాశం బ్యారేజీని డ్యామేజీ చేసేందుకు ఏకంగా బోట్లను సైతం పంపారు. ఇలాంటి సమయంలో కొందరికి ఏమైనా చేరకపోయి ఉండొచ్చు. చేతైనైతే వాళ్లకు సాయం చేసి ఉండాలి. రూ.450 కోట్ల నిధులను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చింది. చరిత్రలో ఇదే అత్యధికం. ఎంతో మంది బాధ్యతగా ముందుకొచ్చి తమ వంతు విరాళాలు ఇచ్చారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు, ఇక్కడ విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిపించాం. కల్తీ మనుషులు, కల్తీ లడ్డూలు. వాళ్ల పనులే కల్తీ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: Chandrababu: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు చంద్రబాబు మద్దతు, మరో ఎన్నికలు సైతం నిర్వహణపై యోచన
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
విశాఖ స్టీల్ ప్లాంట్ పై రెండుసార్లు కేంద్ర మంత్రి కుమారస్వామిని, నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్ర ప్రజల మనోభావాలు, పరిస్థితిని వివరించినట్లు చంద్రబాబు తెలిపారు. దీనిపై ఇంకా కొన్ని రిపోర్టులు రావాలని కేంద్రం చెబుతోంది. అయితే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని కేంద్రానికి స్పష్టం చేశానన్నారు. కొన్ని కారణాల వల్ల మిస్ మేనేజ్ మెంట్ జరిగింది. విశాఖకు సొంత మైన్స్ కూడా లేదు. సెయిల్ కు ఐరన్ ఓర్, మైన్స్ ఉన్నాయన్నారు. టెక్నికల్ గా, ఫైనాన్షియల్ గా ఏ సమస్యలు ఉన్నాయనే దానిపై ఫోకస్ చేశాం. కేంద్రానికి వైసీపీ హయాంలో స్థలం ఇచ్చి సహకరించకపోవడంతో ఎంతో నష్టపోయామని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లు మనం కేంద్రంతో కలిసి పనిచేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, బుల్లెట్ రైలు లాంటి ఎన్నో అంశాలలో పురోగతి చూపిస్తామని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు.