అన్వేషించండి

Rushikonda : రుషికొండ బీచ్‌కు వెళ్లాలంటే రూ. 20 కట్టాల్సిందే - పార్కింగ్ అదనం !

రుషికొండ బీచ్‌లో ప్రభుత్వం ఎంట్రీ ఫీజు విధించింది. రూ. 20 కడితేనే అనుమతిస్తారు.


Rushikonda :  వైజాగ్ లో ఉండే వారికైనా... వైజాగ్ వెళ్లే  వారికైనా రుషికొండ బీచ్ అనేది మంచి టూరిస్ట్ స్పాట్. బీచ్ లోకి వెళ్లడానికి ఎలాంటి ఖర్చూ ఉండదు. అందుకే హాయిగా వెళ్లి సముద్ర తీరాన్ని ఎంజాయ్ చేసి వస్తారు. అలసిపోయిన వారు సేద తీరుతారు. అయితే ఇక నుంచి రుషికొండ బీచ్‌కు వెల్లాలంటే టిక్కెట్ కొనాల్సిందే . లేకపోతే అడుగు పెట్టనీయరు. టిక్కెట్ ధరను రూ. ఇరవైగా నిర్ణయించారు. ఓ కుటుంబం బీచ్ కు వెళ్లాలంటే వంద వదిలించుకోవాల్సిందేనన్నమాట. 

రుషికొండ బీచ్‌లో తొలి సారి ఫీజు పద్దతిని ప్రవేశ పెట్టిన ప్రభుత్వం                                        
  
సాగర తీర నగరమైన విశాఖలో ఇప్పటివరకు ఇలా ఎక్కడా బీచ్‌లలో టిక్కెట్లు పెట్టలేదు.  ఆర్‌కే బీచ్‌వద్ద గానీ, భీమిలి బీచ్‌లో గానీ ఎక్కడా రుసుములు వసూలు చేయడం లేదు. రుషికొండ, తొట్లకొండ, అప్పికొండ ఎక్కడా ఇలాంటి నిబంధనలు లేవు. కానీ ప్రభుత్వం కొత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. రుషికొండను కేంద్ర ప్రభుత్వం ‘బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌’గా గుర్తించడంతో అక్కడ కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు, టాయిలెట్లు, స్నానాల గదులు, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. 

నిర్వహణ ఖర్చుల కోసం డబ్బులను సందర్శకుల దగ్గర్నుంచే వసూలు చేయాలని నిర్ణయం                                           

ఈ బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి క్లీనర్లు, సెక్యూరిటీ, లైఫ్‌ గార్డులు అంతా కలిసి 39 మంది పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.6 లక్షల వ్యయం అవుతోంది. ప్రభుత్వం ఈ బీచ్‌కు ఎటువంటి నిధులు ఇవ్వడం లేదు. అందుకని పార్కింగ్‌ ఫీజు, టాయిలెట్‌, స్నానాల గదుల వద్ద ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవి సరిపోవడం లేదని ఇతర రాష్ట్రాల్లో బ్లూఫాగ్‌ బీచ్‌లను పరిశీలించారు. అక్కడ  ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారని .. ఇక్కడ కూడా అలాగే చేయాలని నిర్ణయించారు.  ఈ నెల 11వ తేదీ నుంచి ఈ బీచ్‌కు వచ్చే వారి నుంచి రూ.20 టిక్కెట్‌ వసూలు చేస్తామని ప్రకటించారు. 

రుషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ కడుతున్నందున సందర్శకులను నియంత్రిస్తారా ?                      

ఈ టిక్కెట్‌ తీసుకునేవారు తాగునీరు, టాయిలెట్లు, స్విమ్మింగ్‌ జోన్‌, ఆటస్థలం వినియోగించుకోవచ్చు. పదేళ్ల లోపు పిల్లలకు రుసుము తీసుకోరు. పార్కింగ్‌ ఫీజు ఎప్పటిలాగే వసూలు చేస్తారు. రుషికొండ బీచ్ కు ఎదురుగా ఉన్న కొండపై ప్రభుత్వం భారీ భవనాలు నిర్మిస్తోంది. అవి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అన్న ప్రచారం జరుగుతోంది. అందుకే అక్కడకు సందర్శకుల్ని వీలైనంత వరకూ తగ్గించే ఉద్దేశంతోనే.. ఇలాంటి టిక్కెట్ భారాలను మోపుతున్నారని.. ముందు ముందు  సందర్శకులపై మరిన్ని ఆంక్షలు విధిస్తారన్న ప్రచారం జరుగుతోంది.  

టాప్ హెడ్ లైన్స్

Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Nara Lokesh Speech At Bhogapuram Airport: ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్
ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్
PM Modi Inaugurates Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

వీడియోలు

Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget