AP bandh on January 24th : జనవరి 24న ఏపీ బంద్ - ట్రేడ్ యూనియన్ల పిలుపు - ఎందుకంటే ?
AP bandh : 24వ తేదీన ఏపీ బంద్ కు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. అంగన్వాడి కార్మికులకు దమనకాండకు నిరసనగా ఈ పిలుపు ఇచ్చారు.
Trade unions called for AP bandh on January 24th : ఆంధ్రప్రదేశ్ బంద్‌కు ఏపీ ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ నెల 24 తేదీన అందరూ బంద్ పాటించాలని ట్రేడ్ యూనియర్లు పిలుపునిచ్చాయి. పోరాడుతున్న అంగన్వాడి టీచర్లు, ఆయాలకు మద్దతుగా ఈ పిలుపునిచ్చారు. వైసీపీ మినహా రాజకీయ పార్టీలన్నీ బంద్‌కు మద్దతు ఇచ్చేఅవకాశాలు ఉన్నాయి. ఈ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎఫ్టియు , టీఎన్టియుసి , ఐ.ఎన్. టి.యు.సి నేతలు పిలుపునిచ్చారు. ”ఒక లక్షా ఐదువేల మంది అంగన్వాడీ మహిళ శ్రామికుల జీతభత్యాలు, పనిభారలు తదితర సమస్యలపై సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో గత 42 రోజులుగా సమ్మె జరుగుతున్నది. వారి డిమాండ్లకు మద్దతుగా ప్రజలనుండి సేకరించిన కోటి సంతకాలను జగన్ కి సమర్పించడానికి విజయవాడ వస్తున్న అంగన్వాడీలపై పాశవికంగా పోలీసులతో దాడి చేయించారన ట్రేడ్ యూనియన్ నేతలు ఆరోపించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అత్యంత నిరంకుశమైనదన్నారు.
నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న దీక్షా శిబిరంపై తెల్లవారుజామున 3 గంటలకు నిరాహారదీక్ష శిబీరాన్ని కూల్చాయి. దీక్షలు చేస్తున్న నాయకులను దూరప్రాంతాలకు తరలించి నిర్బందించారు. వారి ఆరోగ్యాన్నికూడా పట్టించుకోలేదు. కరెంటు తీసివేసి ఆడవాళ్ళను కూడా మగ పోలీసులే అరెస్టులు నిర్వహించి అరగంట పాటు యుద్ధభూమిని తలపించారు. దీక్షలకు మద్దతుగా పాల్గొన్న సుమారు 2 వేల మంది అరెస్టుచేసి మచిలీపట్నం, నూజివీడు తదితర సుదూర ప్రాంతాలకు తరలించారు. లక్ష మందికి పైగా అంగన్వాడీలు చాలిచాలని జీతాలతో జీవిస్తున్న మహిళా కార్మికులపట్ల రాష్ట్ర ప్రభుత్వ పాశవిక విధానానికి వ్యతిరేకంగా, బాధిత అంగన్వాడిలకు సంఘీభావంగా రాష్ట్ర బంద్ చేయడం అవసరమని రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు భావించాయి.
అంగన్వాడీ ఆయాలు, టీచర్లు నెలన్నరగా ఆందోళనలు చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. అయితే అంగన్వాడీల ఆందోళనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దీంత పలు జిల్లాల నుుంచి కలెక్టర్లు.. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలకు ఉపక్రమించనున్నారు కలెక్టర్లు. సుదీర్ఘకాలంగా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీలు.. వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
అయితే, వీరిపై సీరియస్ అయిన ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది.. అయినా వారు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.. ఈ రోజు ఆందోళనల్లో భాగంగా ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.. విజయవాడలో దీక్ష చేస్తున్నవారి దీక్షలు భగ్నం చేసిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.. ఇక, వివిధ జిల్లాల నుంచి విజయవాడకు తరలివస్తున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కొత్త అంగన్వాడీల భర్తీకి ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.. ఆ తర్వాత ఈ నెల 26వ తేదీ నుంచి సచివాలయాల ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని చెబుతున్నారు.