Top Headlines Today: మాజీ మంత్రి శంకర్ నారాయణపై హత్యాయత్నం - అప్పటిదాకా తానే సుప్రీం అంటున్న రాజయ్య!
Top 5 Telugu Headlines Today 08 October 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Telugu Headlines Today 08 October 2023:
విజయవాడలో వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రతినిధుల సమావేశం, హాజరుకానున్న సీఎం జగన్
విజయవాడలో సోమవారం (అక్టోబరు 9) వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం పదిన్నరకు బయలుదేరతారు. రోడ్డు మార్గాన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రతినిధుల సభలో పాల్గొంటారు. రాష్ట్ర నలమూలల నుంచి 8,222 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్లు, సమన్వయకర్తలు, మున్సిపల్ ఛైర్మన్లు, మార్కెట్ యార్డు ఛైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. పూర్తి వివరాలు
బీఆర్ఎస్ నేతల సొంతానికి జీహెచ్ఎంసీ నిధులు - ఎమ్మెల్యే రాజసింగ్ ఆరోపణలు
జీహెచ్ఎంసీ నిధులను బీఆర్ఎస్ నేతలు సొంతానికి వాడుకుంటున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... మున్సిపల్ కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఎమ్మెల్యే రాజసింగ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సర్కారు రాజకీయాలను అవినీతి మయం చేసిందని రాజసింగ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ అవినీతి పాలన, కుటుంబ పాలన తెలంగాణను అప్పుల పాలు చేశాయని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు
టీడీపీ అధినేత చంద్రబాబుకు రేపే కీలకం, అన్ని కేసుల్లో తీర్పులు సోమవారమే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన అన్ని కేసుల్లోనూ రేపే తీర్పులు వెలువడనున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు సోమవారం ఎలాంటి తీర్పు వస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నెల రోజులకుపైగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు రేపే రానున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. ఇదే కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. పూర్తి వివరాలు
మాజీ మంత్రి శంకర్ నారాయణపై హత్యాయత్నం, పేలుడు పదార్థంతో దుండగుడి దాడి!
పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ కాన్వాయ్ పై పేలుడు పదార్థంతో దాడికి యత్నించాడు ఓ దుండగుడు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుడ్డంపల్లి తండాలో మాజీ మంత్రి శంకర్ నారాయణ గడపగడపకు కార్యక్రమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమం ముగించుకుని ఊరు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని అగంతకుడు కొండలను పేల్చే పేలుడు పదార్థంతో మంత్రి కాన్వాయ్ పై దాడి చేశాడు. అయితే అది పేలక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు
అప్పటిదాకా నేనే సుప్రీం, ఎందుకు అలా వణికిపోతున్నారు - రాజయ్య మళ్లీ హాట్ కామెంట్స్
స్టేషన్ ఘన్ పూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. అసలే తనకు సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని ఆయన కాస్త అసహనంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాను అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ప్రకటించారు. తనకు ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరితో కేటీఆర్ సమక్షంలో ఇటీవలే చేతులు కలిపి, ఎమ్మెల్యే టికెట్ దక్కిన కడియంకు పూర్తిగా మద్దతు పలుకుతానని కూడా చెప్పారు. తాజాగా రాజయ్య ఓ కార్యక్రమంలో పాల్గొని చర్చనీయాంశ రీతిలో మాట్లాడారు. పూర్తి వివరాలు