Tirumala Laddu Issue: లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
Tirupati Laddu Issue: తిరుమల శ్రీవారికి ప్రతిరోజు కోట్ల ఆదాయం వస్తుంది కానీ వస్తువుల్లో నాణ్యత పరిశీలన చేసేందుకు మాత్రం 75 లక్షల ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు. ఆ ల్యాబ్ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.
Tirumala Tirupati Laddu Controversy: కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం కోసం వందల కిలో మీటర్ల ప్రయాణం చేస్తారు. క్షణకాలం పాటు దర్శనం చేసుకుని పుణీతులు అవుతారు. తమ కోర్కెలు తీర్చిన భగవంతుడికి తమ వద్ద ఉన్న మేరకు కానుకలు సమర్పిస్తారు. ఇలా ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు హుండీ ద్వారా సమర్పించే కానుకలు రూ. 3 నుంచి 5 కోట్లు వరకు రద్దీ దృష్ట్యా మారుతూ ఉంటుంది. అయితే రాష్ట్ర బడ్జెట్‌తో సమానంగా నిర్వహణ చేసే టీటీడీలో కేవలం రూ.75 లక్షలు పెట్టుబడి పెట్టే అవకాశం లేకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతిసే పరిస్థితి ఏర్పడింది.
ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు
టీటీడీ వంటి ధార్మిక సంస్థ చేసే అనేక కార్యక్రమాలు.. ఉత్సవాలు.. క్యూ లైన్ నిర్వహణ.. టికెట్ల విక్రయం.. ప్రసాదాల తయారీ.. వాటి పంపిణీ.. నిరంతరాయంగా పారిశుద్ధ్యం.. ప్రకృతి... వసతి సముదాయాలు ఇలా టీటీడీ శ్రీవారి భక్తుల కోసం చేసే పనులు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీటిని చూసి నేర్చుకోవడానికి అనేక దేవాలయాలు అధికారులు పలుమార్లు పర్యటించారు. ఇలాంటి టీటీలో ఎంతో పవిత్రంగా భావించే స్వామి వారి లడ్డూ, నైవేద్యాల్లో వాడే ముడి సరుకులు పరీక్షించేందుకు ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు అనేది భక్తుల ప్రశ్న.
గత పాలకుల నిర్లక్ష్యమే..!
టీటీడీ కోరితే కోట్లాది రూపాయలు ఏ రూపంలో అయిన అందించేందుకు వేలాది మంది భక్తులు వేచి ఉన్నారు. టీటీడీ ట్రస్టులకు, విద్య, వైద్య ఇతర కార్యక్రమాలకు సంబంధించి అనేక మంది విరాళాలు సమర్పిస్తుంటారు. ఇలాంటి చోట టీటీడీ ఒక ల్యాబ్ ను అయితే ఏర్పాటు చేసుకుని ఉంది.
అప్పటి నాయకులు పాలకులు ల్యాబ్ అయితే ఏర్పాటు చేశారు కాని దానికి సంబంధించి నిపుణులు ఎవ్వరు లేరు. 2015, 2016 లో ల్యాబ్ ఏర్పాటు చేసినా పని చేసే వారు లేక మరుగున పడింది. ఇక్కడ నామమాత్రపు తనిఖీ చేసే వారు.. రాను రాను అది పూర్తిగా మరుగున పడిపోయింది. ప్రస్తుతం ఎవరో రిటైర్ అయిన ఉద్యోగి ఇక్కడ నాణ్యత ప్రమాణాలు పరీక్ష చేస్తున్నారని చెబుతున్నారు.
ప్రభుత్వాలు.. ఇంత మంది పాలకమండలిలు... అనేక మంది అధికారులు ల్యాబ్ ఏర్పాటు పై దృష్టి పెట్టలేదు. ఇది గత పాలకుల తప్పిదంగా భక్తులు భావిస్తున్నారు. పాలకుల తప్పిదం నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలను దెబ్బ తింటున్నాయి.
డిసెంబర్‌లోపు ల్యాబ్ ఏర్పాటు
టీటీలో లడ్డూ వివాదం వేళ తిరుమలకు వచ్చిన నెయ్యిని ప్రముఖ సంస్థ అయిన NDDB CALF ల్యాబరేటరీకి పంపారు. వాళ్లతో ఒప్పందం చేసుకుంటే ఆ ల్యాబ్ వాళ్లే నాణ్యత ప్రమాణాలు పాటించే రూ.75 లక్షల విలువైన పరికరాలు దిగుమతి చేసుకుని టీటీడీలో ఆ విభాగం ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు ల్యాబ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు.
Also Read: టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?