Ganesh Chaturthi 2021:- చిత్తూరు పోలీసు వర్గాల్లో చవితి పంచాయితీ... ఓ ట్రైనీ ఎస్సైపై వేటు.. బీజేపీ చీఫ్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్
వినాయక చవితిపై ఆంక్షలు రాష్ట్రం భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో చిత్తూరు జిల్లా పోలీసుల చర్య వివాదాన్ని మరింత రాజేస్తోంది.
సమస్యలను పరిష్కరించాల్సిన పోలీసులే వివాదాలను రాజేస్తున్నారా? ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ప్రయత్నిస్తూ సమస్యల సుడిలో చిక్కుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్‌లో కొందరు ఖాకీల ప్రవర్తనపై ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఖాకీల తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఘాటైన విమర్శలు చేస్తున్నాయి. అవేమీ తమకు పట్టవన్నట్టు మరికొందరు పోలీసులు రెచ్చిపోతున్నారు. అందుకే ఎగ్జాంపులే చిత్తూరుజిల్లా పోలీసుల చర్య.
అసలే వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజానీకం నుంచి రాజకీయ పార్టీలు వరకు అంతా దీనిపై భగ్గుమంటున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ లీడర్లు కూడా ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని పోలీసులు చుట్టూ తిరుగుతున్నారు. ఈ టైంలో చిత్తూరు జిల్లా పోలీసుల తీసుకున్న నిర్ణయం విస్మయాన్ని కలిగిస్తోంది.
ALSO READ: East Godavari జిల్లాలో కుండపోత వర్షం.. పొంగి పొంగుతున్న వాగులు, వంకలు
ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారని ఐరాల మండలంలో ట్రైనీ ఎస్సై లోకేష్‌ను చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పోలీసులు వెల్లడించారు. ఈ సస్పెన్ష్ ట్వీట్‌ను ఏపీ బీజేపీకి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు ట్యాగ్ చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది.
ALSO READ: హుజూరాబాద్ ఉపఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
వినాయక ఉత్సవాలకు కచ్చితంగా అనుమతి ఇవ్వాలని పోరాడుతున్న బీజేపీ, ఆ పార్టీ లీడర్లను కవ్వించడానికి ఇలా ట్యాగ్ చేశారా. లేకుంటే ఎవరు ఏం చేసుకున్నా తాము పట్టించుకోమని.. ఎవరి మాట వినమని వివాదాన్ని మరింత రాజేసేందుకు ఈ ట్యాగ్ చేశారా అనేది తేలాల్సి ఉంది.
పోలీసులు ఓ ఎస్సైను సస్పెండ్ చేసి.. ఆ విషయాన్ని తమకు ట్యాగ్ చేయడంపై బీజేపీ లీడర్లు మండిపడుతున్నారు. అధికార పార్టీకి వంతపాడుతున్న ఖాకీలు చేస్తున్న ఇలాంటి చర్య వివాదాన్ని మరింత తీవ్రం చేస్తుందని రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పుతాయని హెచ్చరిస్తున్నారు. ఇలా ట్యాగ్ చేయడమంటే తమను రెచ్చగొట్టడమేనంటున్ననారు కమలనాథులు.
ALSO READ: ఏపీలో ముదిరిన "చవితి ఆంక్షలు" వివాదం..! నిర్వహించి తీరుతామని ప్రభుత్వానికి పార్టీల సవాల్ !
బీజేపీ నేతలకు ట్యాగ్ చేయడం ఓ వివాదమైతే... అసలు ట్రైనీ ఎస్సైను ఎందుకు సస్పెండ్ చేశారో ఇంత వరకు క్లారిటీ లేదు. ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్టుగానే లోకేష్ ఓ ఆర్డర్ ఇష్యూ చేశారు. ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో పూజామందిరాలు, విగ్రహాలు పెట్టొద్దని.. ఇంట్లోనే పూజలు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఓ లెటర్ విడుదల చేశారు.
ALSO READ:బిల్లులు చెల్లించకపోతే ఇక కోర్టు ధిక్కరణ కేసులే.. ఏపీ అధికారులకు హైకోర్టు ఫైనల్ వార్నింగ్
ఇదే అసలు వివాదానికి కారణమని తెలుస్తోంది. లోకేష్ చెప్పిందాంట్లో ఎలాంటి అభ్యంతరకరమైన పదాలు లేవు.. ఎక్కడా బహిరంగ ప్రదేశాల్లో పూజలు చేయమని చెప్పలేదు. కానీ ఆయన్ని సస్పెండ్ చేయడంపై జిల్లా పోలీసులు ఒక్కసారి షాక్‌కి గురయ్యారు. ఇంతకీ లోకేష్‌ను ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కాక అంతా తలలు పట్టుకుంటున్నారు.
అయితే లిఖిత పూరకంగా ఇలాంటి ఆదేశాలు ఇవ్వడమే లోకేష్ చేసిన తప్పుగా కొందరు చెబుతున్నారు. బీజేపీ లీడర్లు మాత్రం ఆయన అనుమతులు ఇచ్చినందుకు చర్యలు తీసుకున్నారని వాదిస్తున్నారు. మొత్తానికి చవితి నేపథ్యంలో మరో కొత్త వివాదం మొదలైంది.
ALSO READ: ఏపీలో తగ్గని కరోనా ఉద్ధృతి.. భారీగా పెరిగిన కొవిడ్ పాజిటివ్ కేసులు
వైసీపీ ఎమ్మెల్యే రాజన్న దొరను ఎప్పుడు సస్పెండ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు బీజేపీ లీడర్ విష్ణువర్దన్ రెడ్డి. సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర.. వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సాలూరు అధికారులకు లిఖిత పూరక ఆదేశాలు ఇచ్చారని... ఆయన్ని ఎందుకు సస్పెండ్ చేయరని ప్రశ్నించారు. ఆదేశాలు ఇచ్చినా ఎస్ఐలను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. ఎమ్మెల్యే ని ఎప్పుడు సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు.
అయ్యా ముఖ్యమంత్రి @ysjagan గారు,
— S.Vishnu Vardhan Reddy (@SVishnuReddy) September 7, 2021
ఇది సాలూరు మీ @YSRCParty MLA శ్రీ రాజన్న దొర గారు వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సాలూరు అధికారులకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన లెటర్.
ఆదేశాలు ఇచ్చినా ఎస్ఐలు సస్పెండ్ చేశారు.మరి ఎమ్మెల్యే ని ఎప్పుడు సస్పెండ్ చేస్తారు? pic.twitter.com/pzbQuYzE1q