Coronavirus Cases Today: ఏపీలో తగ్గని కరోనా ఉద్ధృతి.. భారీగా పెరిగిన కొవిడ్ పాజిటివ్ కేసులు
కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,20,347 పాజిటివ్ కేసులకు గాను 19,91,960 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో క్రితం రోజుతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా కరోనా కేసులలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,178 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 10 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,20,347 పాజిటివ్ కేసులకు గాను 19,91,960 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, ఏపీలో ఇప్పటివరకూ 13,935 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. ప్రస్తుతం 14,452 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం నాడు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో కొత్త వేరియంట్ ఏవై 12 కేసులు సైతం తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ఏపీలో ఇప్పటివరకూ 18 ఏవై 12 కొత్త వేరియంట్ కేసులు గుర్తించినట్లు సమాచారం. అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కావాలని కేంద్రం ప్రభుత్వం హెచ్చరించింది.
Also Read: Miracle Tree Moringa: అందానికి, ఆరోగ్యానికి.. గుప్పెడు మునగాకులు
#COVIDUpdates: 07/09/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) September 7, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,20,347 పాజిటివ్ కేసు లకు గాను
*19,91,960 మంది డిశ్చార్జ్ కాగా
*13,935 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,452#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/nWoska4Coo
గడిచిన 24 గంటల్లో 1,266 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. కొవిడ్ బారిన పడి కృష్ణా జిల్లాలో ఇద్దరు.. ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు.. చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకూ 2 కోట్ల 70 లక్షల 37 వేల 651 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.
Also Read: Nipah Virus: నిఫా- కరోనా ఒకేసారి వస్తే? ఈ వైరస్ గురించి షాకింగ్ విషయాలివే
ఏపీలో నమూనా పరీక్షల సంఖ్య : 54970
కోవిడ్19 పాజిటివ్ కేసులు: 1,178
తాజా మరణాలు : 10
అత్యధిక కేసులు: చిత్తూరు జిల్లా (204 కేసులు) , నెల్లూరు జిల్లాలో 177 పాజిటివ్ కేసులు
కరోనా యాక్టివ్ కేసులు : 14452
గడిచిన 24 గంటల్లో రికవరీల సంఖ్య : 1,266
#COVIDUpdates: As on 07th September 2021 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) September 7, 2021
COVID Positives: 20,20,347
Discharged: 19,91,960
Deceased: 13,935
Active Cases: 14,452#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/vPJXqjTIAv