News
News
X

Nipah Virus: నిఫా- కరోనా ఒకేసారి వస్తే? ఈ వైరస్ గురించి షాకింగ్ విషయాలివే

కేరళలో ఓవైపు కరోనా.. మరోవైపు నిఫా వైరస్ కల్లోలం సృష్టిస్తున్నాయి. అయితే కరోనా-నిఫా కలిసివస్తే పరిస్థితేంటనే ఆందోళన ఎక్కువైంది? అసలు నిఫా వైరస్ లక్షణాలేంటి? చికిత్స ఉందా?

FOLLOW US: 

నిఫా వైరస్.. 2018లో వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని తనతో తీసుకువెళ్లింది. అయితే తాజాగా మరోసారి కేరళపై పంజా విసరడానికి సిద్ధమైంది. ఇటీవల రాష్ట్రంలోని కొజీకోడ్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ తో మృతి చెందాడు. అసలు నిఫా వైరస్ ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఏంటి? రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.

ఎలాంటి లక్షణాలు?

ఇటీవల నిఫా వైరస్ తో చనిపోయిన బాలుడు.. మెదడువాపు, కండరాల నొప్పితో సెప్టెంబర్ 1న ఆసుపత్రిలో చేరాడు. చికిత్స చేస్తోన్న సమయంలోనే మృతి చెందాడు. ఆ బాలుడికి ప్రైమరీ కాంటాక్ట్ లుగా 20 మందిని గుర్తించి వారందరినీ ప్రభుత్వం అబ్లర్వేషన్ లో పెట్టింది. వారిలో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు నిఫా వైరస్ లక్షణాలు ఉన్నట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అప్రమత్తమైన కేంద్రం.. ఓ బృందాన్ని రాష్ట్రానికి సాయంగా పంపింది.  

2018లో కొజీకోడ్, మలప్పురం జిల్లాల్లో నిఫా వైరస్ తో 17 మంది చనిపోయారు. 2019లో కొచ్చిలో కూడా ఓ కేసును గుర్తించింది ప్రభుత్వం. 

ఏంటీ నిఫా వైరస్?

నిఫా అనేది ఓ జూనొటిక్ వైరస్. ఇది జంతువుల నుంచి మనషులకు సోకుతుంది. నిఫా వైరస్ సోకిన వారికి మెదడువాపు వ్యాధి లేదా శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ఇది అంటువ్యాధి. వ్యాప్తి కూడా చాలా వేగంగా ఉంటుంది. జంతువులు, మనుషుల్లో ఇతర ప్రమాదమైన వ్యాధులు కూడా వచ్చేలా చేస్తోంది.

ఎలా వ్యాపిస్తుంది?

 1. ఫ్రూట్ బ్యాట్స్ (గబ్బిలాలు) లాలాజలం నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంటే ఎవరైనా ఈ గబ్బిలాలు కొరికిన పళ్లు తింటే ఈ వైరస్ శరీరంలోకి ఎంటర్ అవుతుంది.
 2. వైరస్ సోకిన ఏదైనా జంతువు బైట్ చేసిన ఫ్రూట్స్ తినడం వల్ల కూడా వైరస్ సోకుతుంది.
 3. నిఫా సోకిన పందులు కూడా వైరస్ కు ప్రధాన కారకాలని అంటున్నారు. 
 4. వైరస్ సోకిన జంతువుతో డైరెక్ట్ కాంటాక్ట్ అయినా ఈ వైరస్ సోకే ప్రమాదముంది.
 5. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. వైరస్ సోకిన 4- 45 రోజుల్లోపు లక్షణాలు బయటపడే అవకాశం ఉంది.

లక్షణాలేంటి?

నిఫా వైరస్ సోకితే తీవ్రమైన మెదడువాపు వస్తుంది. ఫీవర్, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు.. వంటి లక్షణాలు తొలుత ఉంటాయి. ఆ తర్వాత నీరసం, కళ్లుతిరగడం, మగతగా ఉండటం వంటి మెదడువాపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. డబ్ల్యూహెచ్ ఓ చెప్పినదాని ప్రకారం కొంతమందిలో న్యుమోనియా సహా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

తీవ్రమైన కేసుల్లో రోగి.. 24-48 గంటల్లో కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది.

రికవరీ ఛాన్స్..

మెదడువాపు కనిపించిన వారిలో చాలా మంది పూర్తిగా కోలుకున్నారు. 20 శాతం మందిలో న్యూరోలాజికల్ సమస్యలు తలెత్తాయి. 15 శాతం మందిలో రికవరీ అయ్యాక కూడా లాంగ్ టర్మ్ లో నాడీ సంబంధ సమస్యలు వచ్చాయి. 

నిఫాకు నివారణేంటి?

ప్రస్తుతానికి నిఫా వైరస్ కు ఇంకా వ్యాక్సిన్ రాలేదు. అయితే వ్యాప్తిని అరికట్టడమే ప్రధానమని నిపుణులు అంటున్నారు. జంతువులు-మనుషులు, మనుషులు-మనుషులకు మధ్య వ్యాప్తిని అరికట్టాలన్నారు.

 1. ఎలాంటి పండ్లనైనా తినే ముందు శుభ్రంగా కడగాలి.
 2. నిఫా బాధితుల బాగోగులు చూసేవారు కచ్చితంగా చేతిగ్లౌజులు సహా ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ ధరించాలి.
 3. తరుచుగా సోప్ వాటర్ తో చేతులు శుభ్రపరుచుకోవాలి.
 4. వ్యాప్తిని అరికట్టేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ ముఖ్యం. బాధితులతో దగ్గరగా ఉన్నవాళ్లు ఐసోలేషన్ లో ఉండాలి.

చికిత్స ఉందా?

ప్రస్తుతానికి నిఫా వైరస్ కు చికిత్స లేదు. అయితే లక్షణాలు బట్టి వాటికి సంబంధించిన మందులు ఇస్తున్నారు. ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి మెడికల్ హెల్ప్ అందిస్తున్నారు. సరైన విశ్రాంతి, హైడ్రేషన్ తప్పనిసరి.

యాక్షన్ ప్లాన్..

 1. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం.. కొన్ని అత్యవసర సూచనలు చేసింది.
 2. రోగికి సంబంధిచిన కుటుంబాలలో యాక్టివ్ కేసులను వెంటనే గుర్తించడం.
 3. వైరస్ సోకిన వ్యక్తికి గత 12 రోజుల్లో కాంటాక్ట్ లో ఉన్నవారిని గుర్తించడం.
 4. కాంటాక్ట్ లో ఉన్నవారు కచ్చితమైన క్వారంటైన్, ఐసోలేషన్ పాటించాలి.
 5. శాంపిల్స్ ను త్వరగా పరీక్షించాలి.

కొజికోడ్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో నిఫా వార్డ్ ను ఏర్పాటు చేశారు. 0495-2382500, 04952382800 రెండు హెల్ప్ లైన్ నంబర్లను ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిఫా కోసం 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

నిఫా-కొవిడ్ కలిపొస్తుందా?

కేరళలో ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో నిఫా వైరస్ రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కరోనా, నిఫా రెండు సోకితే పరిస్థితి ఏంటని చాలా మంది భయపడుతున్నారు. అయితే వైద్యులు మాత్రం రెండు ఒకేసారి వచ్చే అవకాశం చాలా తక్కువ అంటున్నారు. ఎందుకంటే నిఫా ఎక్కువ దూరం వ్యాప్తి చెందదని తెలిపారు. తక్కువ ఏరియాలో మాత్రమే నిఫా వైరస్ వ్యాప్తి చెందుతుందని వారు అంటున్నారు. ఎప్పడు 50 కంటే ఎక్కువ నిఫా కేసులు వెలుగుచూడలేదని వెల్లడించారు.

Published at : 06 Sep 2021 02:24 PM (IST) Tags: coronavirus COVID-19 Kerala Nipah virus Nipah Nipah Virus Kerala Nipah Virus In Kerala

సంబంధిత కథనాలు

Women Fertility: స్త్రీలు ఏ వయసు వరకు బిడ్డను కనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు?

Women Fertility: స్త్రీలు ఏ వయసు వరకు బిడ్డను కనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు?

రాత్రి పూట ఈ మందులు వేసుకుంటే నిద్రకు దూరమవ్వడం ఖాయం

రాత్రి పూట ఈ మందులు వేసుకుంటే నిద్రకు దూరమవ్వడం ఖాయం

Skinny Jeans:స్టైలిష్‌గా కనిపించాలని స్కిన్నీ జీన్స్ వేసుకుంటున్నారా? వాటి వల్ల తీవ్ర సమస్యలు, తెలుసుకోకపోతే మీకే నష్టం

Skinny Jeans:స్టైలిష్‌గా కనిపించాలని స్కిన్నీ జీన్స్ వేసుకుంటున్నారా? వాటి వల్ల తీవ్ర సమస్యలు, తెలుసుకోకపోతే మీకే నష్టం

గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి

గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి

ఖాళీ కడుపున బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే!

ఖాళీ కడుపున బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే!

టాప్ స్టోరీస్

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు

Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు

AP 10th Supply Students: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున నిర్ణయం

AP 10th Supply Students: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున నిర్ణయం