అన్వేషించండి

KTR On Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉపఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2004 కాంగ్రెస్ పార్టీతో, ఆ మరుసటి ఎన్నికల్లో 2009లో టీడీపీతో కేసీఆర్ పొత్తుపెట్టుకున్నారని.. వారితో తెలంగాణకు కేసీఆర్ జై కొట్టించారని మంత్రి కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని తొక్కిపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని.. అయితే ఆనాడు కేసీఆర్ ఒకే ఒక్కడుగా బయలుదేరాడని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారని జలవిహార్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక చిన్న ఎన్నిక.. స్థానిక నేతలు ఆ వ్యవహారం చూసుకుంటారని.. ప్రతిపక్షాలను ధీటుగా తిప్పికొట్టే రంగం సిద్ధం చేద్దామని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2004 కాంగ్రెస్ పార్టీతో, ఆ మరుసటి ఎన్నికల్లో 2009లో టీడీపీతో కేసీఆర్ పొత్తుపెట్టుకున్నారని.. వారితో తెలంగాణకు కేసీఆర్ జై కొట్టించారని చెప్పారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని.. కేసీఆర్ దెబ్బకు విధిలేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ ఇస్తానని 2004లో మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 2009లోనూ అధికారంలోకి వచ్చినా మాట తప్పిందన్నారు. నిన్న మొన్న పుట్టిన చిల్లరగాళ్లు సైతం తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలు అని చెప్పుకునే వాళ్లు 70ఏళ్లలో రైతులకు నీళ్లు, కరెంటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Also Read: Taliban Government Update: నెరవేరిన తాలిబన్ల లక్ష్యం.. అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు.. అధ్యక్షుడు ఎవరంటే..

ఏడేళ్లు ఓపిక పట్టాం.. ఇకనుంచి లెక్కలు మారతాయి.. మంత్రి కేటీఆర్

గత ఏడేళ్లుగా ఓపిక పట్టామని.. ఇకనుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు సమాధానం చెప్తామన్నారు. నిన్న మొన్న పుట్టిన చిల్లర గాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉరుకుంటే చిల్లర గాళ్ల మాటలు ఎక్కువగా అయితున్నాయని మండిపడ్డారు. సెప్టెంబర్ 20వ తేదీ లోపు బస్తీ- కాలనీ కమిటీలు పూర్తి కావాలని.. మొత్తం 150 డివిజన్ కమిటీలు వెయ్యాలన్నారు. కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక చిన్న వ్యవహారమని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ మంత్రి హరీష్ రావును ఎందుకు రంగంలోకి దించిందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Also Read: Afghanistan Crisis: అఫ్గాన్‌లో అల్లకల్లోలం.. తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటుతో ఉద్రిక్తత..

పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తిస్తాం..
‘టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కష్టపడుతున్న సోదరులు ఉన్నారు. త్వరలోనే వారికి పోస్టులు ఇచ్చి కచ్చితంగా న్యాయం చేస్తాం. 500 పోస్టులు పలు కార్పొరేషన్లు నింపే బాధ్యత తీసుకుంటాను. దాంతోపాటుగా 150 డివిజన్లకు సోషల్ మీడియా కమిటీ వేయాలని నిర్ణయించాం. నగరంలో అందరికీ అందుబాటులో ఉండేలా హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కట్టుకోవాలి. దాశరథి అన్నట్లు తెలంగాణ కోటి రతనాల వీన- అయితే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయిందని’ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

టాప్ హెడ్ లైన్స్

MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Maggi Size: మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!
మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Tata Sierra EV Price: ఏ కాంపాక్ట్ SUVకి లేని శక్తితో వచ్చిన టాటా సియరా EV!బేసిక్‌, టాప్‌ వేరియంట్‌ ధరలు ఎలా ఉన్నాయి? 
ఏ కాంపాక్ట్ SUVకి లేని శక్తితో వచ్చిన టాటా సియరా EV!బేసిక్‌, టాప్‌ వేరియంట్‌ ధరలు ఎలా ఉన్నాయి? 
WhatsApp Username: వాట్సాప్‌లో నంబర్‌ను చెప్పకుండానే ఎలా చాట్ చేయవచ్చు! 
వాట్సాప్‌లో నంబర్‌ను చెప్పకుండానే ఎలా చాట్ చేయవచ్చు! 
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
Embed widget