Tirupati News: ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు!
Tirupati News: ఈనెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీ బ్రహ్మోత్సవాలను నిర్వహించబోతున్నారు.
Tirupati News: ఈనెల నవంబరు 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తిరుమల తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్వాలు నిర్వహించబోతున్నారు. నవంబరు 19వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 15వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్ల తరువాత ఆలయ మాడ వీధుల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
వాహనసేవల వివరాలు..
ఈనెల 20వ తేదీ అంటే ఆదివారం ఉదయం ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి చిన్న శేష వాహనం జరిపిస్తారు. అలాగే 21వ తేదీ అంటే సోమవారం రోజు ఉదయం పెద్దశేష వాహనం, రాత్రికి హంస వాహనం పై ఊరేగిస్తారు. ఈనెల 22వ తేదీ నుంచి అంటే మంగళవారం ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రికి సింహ వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు. అలాగే 23వ తేదీ బుధవారం రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి హనుమంత వాహనం జరిపిస్తారు. 24వ తేదీ గురువారం రోజు ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గజ వాహనం నిర్వహిస్తారు. 25వ తేదీ అంటే శుక్రవారం రోజు ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రికి స్వర్ణ రథం, గరుడ వాహనంపై ఊరేగిస్తారు. అంతేకాకుండా 26వ తేదీ శినవారం రోజు ఉదయం సూర్య ప్రభ వాహనం, రాత్రికి చంద్ర ప్రభ వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు. 27వ తేదీ ఆదివారం రోజు ఉదయం రథోత్సవం, రాత్రికి అశ్వ వాహనంపై నిర్వహిస్తారు. 28వ తేదీ సోమవారం రోజు ఉదయం పంచమీ తీర్థం, రాత్రికి ధ్వజావరోహణం నిర్వహిస్తారు.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..
తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీనివాసుడికి ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని నైవేద్యంగా నివేదిస్తారు అర్చకులు. ఇక బుధవారం నాడు (నవంబర్ 9న) బెల్లంతో తయారు చేసిన పాయసంను అర్చకులు స్వామి వారి నైవేద్యంగా మొదటి గంటాలో సమర్పిస్తారు. మంగళవారం 08-11-2022 రోజున చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయంను 11 గంటల పాటు మూసి వేసి, తిరిగి తెరిచిన తరువాత 22,423 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 9,679 మంది తలనీలాలు సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రెండు కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతుంది.
ఉదయం వేళలో శ్రీవారి తోమాల, అర్చన సేవలు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు సమర్పించగా, ఇక బుధవారం నాడు "బెల్లం పాయసం" ను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.