Tirumala Temple: ప్రతి సోమవారం తిరుమల శ్రీవారికి నిర్వహించే ఆ సేవను రద్దు చేసిన టీటీడీ- ఎందుకంటే!
Tirumala Temple: ప్రతి సోమవారం తిరుమల స్వామివారికి నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. ఎందుకంటే..
Tirumala Temple: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న 67,169 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 21,222 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే రూ. 3.86 కోట్ల రూపాయలు హుండీ కానుకగా వచ్చాయి. అయితే ప్రతి సోమవారం స్వామివారికి నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. ఎందుకంటే..
తిరుమల వేంకటేశ్వర స్వామికి ప్రతి సోమవారం విడిగా చతుర్దశ కలశ విశేష పూజను నిర్వహిస్తుంటారు. అయితే ఈరోజు ఆ పూజను టీటీడీ రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు.
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు... బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించిన తర్వాత శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
చతుర్దశ కలశపూజ రద్దు
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించిన తర్వాత వైకుంఠ ద్వారం గుండా ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండో గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతిగా సోమవారం రోజు నిర్వహించే "చతుర్ధశ కలశ విశేష పూజ ను టీటీడీ రద్దు చేసింది.. ఉత్సవమూర్తుల విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం వైకుంఠ ద్వారం గుండా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆ తర్వాత అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలిపివేసిన తర్వాత శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. వీటిలో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. అనంతరం తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) January 2, 2023
Om Namo Venkateshaya! pic.twitter.com/VnQwxmf6pv
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) November 6, 2022