Breaking News: భర్త పైశాచికం.. భార్య ఉరి వేసుకుంటే వీడియో తీసి బంధువులకు పంపించిన శాడిస్టు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 21న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
ఏపీ ప్రభుత్వ బడుల్లో బుధవారం పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, రెసిడెన్షియల్, కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్స్, ప్రైవేట్ ఎయిడెడ్, పాఠశాలల్లో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఫలితాలు ప్రకటన, 1.30 గంటలకు ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, రెండు గంటలకు ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం మూడు నుంచి 3.30 గంటల మధ్య తొలి పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.
భర్త పైశాచికం.. భార్య ఉరి వేసుకుంటే వీడియో తీసి బంధువులకు పంపించిన శాడిస్టు
నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. భర్త కళ్లెదుటే ఓ భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆపాల్సిన భర్త మాత్రం ఆత్మహత్య ఘటనను వీడియో తీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఆ వివాహిత ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పని చేస్తోంది. ఆమె పేరు కొండమ్మ. భార్య ఆత్మహత్య చేసుకున్న వీడియోను బంధువులకు సైతం షేర్ చేసి పైశాచిక ఆనందం పొందిన భర్త.
MAA ఎన్నికల హీట్.. రేపు ప్యానెల్ సభ్యులను ప్రకటించనున్న మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందడి మొదలైంది. రేపు తన ప్యానెల్ సభ్యులను నటుడు మంచు విష్ణు ప్రకటించనున్నారు. ఇప్పటివకే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు.. మంచు విష్ణు ప్యానెల్ లో ఉన్నారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించనున్నారు.
రేపటిలోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలి: కేటీఆర్
అన్ని కమిటీల ఏర్పాటు ఈ నెల 23 (రేపు) లోగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో ఆయన ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా జిల్లా పార్టీ , రాష్ట్ర కార్యవర్గం పూర్తి కావాలని ఆదేశించారు. ఈ నెల 24 లోగా తెలంగాణ భవన్‌కు నియోజకవర్గాల వారీగా సంస్థాగత నిర్మాణ వివరాలు అందజేయాలని పార్టీ నేతలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో కుంభకోణం..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల స్కాంలో మరికొందరి ప్రమేయం ఉందన్న అనిశా అధికారులు తేల్చినట్టు సమాచారం. ఏపీ సచివాలయంలోని కొందరు ఉద్యోగుల పాత్రను గుర్తించారు. ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారంతో నిధులు స్వాహా చేసినట్లు గుర్తించారు. ప్రజాప్రతినిధుల పీఏలు, అనుచరుల ప్రమేయం ఉందని తెలిసింది. ఇప్పటికే కొందరు నిందితులను అరెస్టు చేసినట్టు సమాచారం.
కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలా? మీ అభిప్రాయం తెలపండి: కేటీఆర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై మంత్రి కేటీఆర్ ప్రజల అభిప్రాయం కోరారు. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న అభిప్రాయాన్ని తాను స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజలంతా ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలు చెప్పాలని కోరారు. కంటోన్మెంట్ బోర్డు పాలన సరిగా జరగడంలేదని, ప్రజల అవసరాలు తీర్చడంలేదనే విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు.. కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Read a couple is news reports today where citizens overwhelmingly opined that Secunderabad Cantonment Board has to be merged in GHMC
— KTR (@KTRTRS) September 22, 2021
I am in agreement too. What do you guys say?