Tdp News: ఏకపక్షంగా పరిషత్ ఎన్నికలు... అందుకే బహిష్కరించామన్న చంద్రబాబు.... పోలీసులపై లోకేశ్ ఫైర్
రాష్ట్రంలో ఏకపక్షంలో పరిషత్ ఎన్నికలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై టీడీపీ నేతలు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో ఏకపక్షంగా పరిషత్ ఎన్నికలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రజలకు న్యాయం జరగడం లేదనే ఎన్నికల బహిష్కరించామన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న చంద్రబాబు.. సంక్షేమ పథకాల వల్లే గెలిచామని భావించడం అవివేకమని విమర్శలు చేశారు. దాడులు చేసిన దాఖలాలు టీడీపీ చరిత్రలో లేవన్నారు. వైసీపీ నమ్మి ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారని, ఇప్పుడు ఆ పార్టీకి అసలు ఓటువేయోద్దని అనుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయని ఆరోపించారు. ప్రజలకు న్యాయం జరగట్లేదనే టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించినట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు తెలిపారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను సోమవారం చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల దిల్లీలో గాయపడి కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న మందకృష్ణ మాదిగను ఆయన నివాసంలో చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని మందకృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.
వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారు : లోకేశ్
ఇంత చదువూ చదివి, ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ పొంది, ప్రజాధనం జీతంగా తీసుకుంటూ వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించడానికి సిగ్గు లేదా? ముగ్గురు ఐపీఎస్ అధికారులు వైసీపీ అధికారుల్లా దిగజారి మాట్లాడటం ఇండియన్ పోలీస్ సర్వీస్ హిస్టరీలో బ్లాక్‌డే.(1/4) pic.twitter.com/jfESjIen35
— Lokesh Nara (@naralokesh) September 20, 2021
కొంత పోలీసులు ప్రభుత్వ శిక్షణ పొంది, ప్రజాధనం జీతంగా తీసుకుంటూ వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు వైసీపీ అధికారుల్లా మాట్లాడున్నారని ఆరోపించారు. వైసీపీకి వత్తాసు పలికే అధికారులు తాడేపల్లిలో బులుగు కండువాలు కప్పుకుని మాట్లాడాలని విమర్శించారు. .ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడికెళ్తున్నానని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ప్రకటించి మరీ వచ్చారన్నారు. కానీ పోలీసులు సమాచారం లేదని చెప్పడం వింతగా ఉందన్నారు.
Also Read: AP CM Jagan Comments : అబద్ధాన్ని నిజం చేసి.. ముఖ్యమంత్రిని దింపేయాలని చూస్తున్నారు
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు
చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీ కనకమేడల. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఎంపీ కనకమేడల లేఖ రాశారు. జడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న నేతపై దాడికి ప్రయత్నించారని లేఖలో తెలిపారు. దాడి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబుకు మరింత భద్రతను పెంచాలని కోరారు. దాడికి సంబంధించిన ఆధారాలను హోంశాఖ కార్యదర్శికి అందించారు.