News
News
X

Chandrababu House Episode: వినతి పత్రం ఇచ్చేందుకే జోగి రమేష్ వెళ్లారు... చంద్రబాబు ఇంటి వద్ద ఘటనపై డీఐజీ వివరణ

చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారని పోలీసులు తెలిపారు.

FOLLOW US: 

ఈనెల 17న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణపై గుంటూరు ఎస్పీలు విశాల్ గున్నీ, ఆరిఫ్ హఫీజ్​తో కలిసి డీఐజీ త్రివిక్రమ్ వర్మ వివరణ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్  చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికే ఆయన ఇంటికి వెళ్లారని తెలిపారు. దాడి చేసే ఆలోచన ఆయనకు లేదన్నారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ రాకపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని డీఐజీ తెలిపారు. జోగి రమేశ్ ను కరకట్ట మొదటి గేట్ వద్దే అడ్డుకున్నామన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి అని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. నిరాధారంగా మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయని డీఐజీ ఆరోపించారు. ఈ ఘటనలో ముందుగా జోగి రమేశ్ కారుపై దాడి జరిగిందన్నారు. 

డీజీపీ లేరని తెలిసి కూడా

ఎమ్మెల్యే రమేశ్ కారుపైన, డ్రైవర్ పై చెప్పులు, రాళ్లతో కొందరు దాడి చేశారని డీఐజీ వీడియోలను ప్రదర్శించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆఫీసులో లేరని తెలిసి కూడా ఆయన కార్యాలయం వద్ద 70 మంది హడావుడి సృష్టించారని డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. వినతిపత్రం ఇవ్వడానికి వచ్చే విధానం ఇది ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారన్నారు. కరకట్ట ఘటనపై ఇరుపక్షాల ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Also Read: Online Movie Ticket Issue: ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ పెద్ద సమస్య కాదు.. నిర్మాత సి.కళ్యాణ్ కామెంట్స్..

అసలేం జరిగింది

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోడెల శివప్రసాద్ వర్ధంతి సభలో సీఎం జగన్, హోంమంత్రి సుచరితపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వైసీపీ కార్యకర్తలతో కలిసి పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. వీరిని బుద్ధా వెంకన్న సహా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు జెండా కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు బారికేడ్లు పెట్టి ఇరు వర్గాలను నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ వెనక్కి తగ్గకపోవటంతో లాఠీఛార్జ్ చేశారు. ఈ సమయంలో జోగి రమేశ్, బుద్ధా వెంకన్న మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. గొడవ మరింత పెరిగేలా ఉందని భావించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి జోగి రమేశ్​ను అరెస్టు చేశారు.

Also Read: Botsa Satyanarayana: అచ్చెన్న రాజీనామా చేస్తే నేను రెడీ... ఓటమిని అంగీకరించే ధైర్యం టీడీపీకి లేదు... పరిషత్ ఫలితాలపై బొత్స కీలక వ్యాఖ్యలు

Published at : 20 Sep 2021 09:10 PM (IST) Tags: tdp AP Latest news ap police MLA Jogi Ramesh Chandarababu house attack ap ysrcp

సంబంధిత కథనాలు

మూలాన‌క్ష‌త్రంలో దేవి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు- విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు

మూలాన‌క్ష‌త్రంలో దేవి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు- విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Minister Ambati Rambabu : మమ్మల్ని వేలు పెట్టి చూపించే అర్హత హరీశ్ రావు, కేసీఆర్ కు లేదు - మంత్రి అంబటి

Minister Ambati Rambabu : మమ్మల్ని వేలు పెట్టి చూపించే అర్హత హరీశ్ రావు, కేసీఆర్ కు లేదు - మంత్రి అంబటి

బస్సుల్లోనే రండి- శ్రీవారి భక్తులకు పోలీసుల విజ్ఞప్తి!

బస్సుల్లోనే రండి- శ్రీవారి భక్తులకు పోలీసుల విజ్ఞప్తి!

టాప్ స్టోరీస్

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం