News
News
X

Botsa Satyanarayana: అచ్చెన్న రాజీనామా చేస్తే నేను రెడీ... ఓటమిని అంగీకరించే ధైర్యం టీడీపీకి లేదు... పరిషత్ ఫలితాలపై బొత్స కీలక వ్యాఖ్యలు

పరిషత్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించే ధైర్యం టీడీపీ లేదని మంత్రి బొత్స సత్సనారాయణ ఆరోపించారు. సంక్షేమపాలనకు ప్రజలు పట్టంకట్టారని ఆయన స్పష్టం చేశారు.

FOLLOW US: 

టీడీపీకి ఓటమిని అంగీకరించే ధైర్యం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజలు సంక్షేమ పాలనకు పట్టంకట్టారని అన్నారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. పరిషత్ ఎన్నికలు బహిష్కరణ తెలుగుదేశం పార్టీ ఆడిన డ్రామా అని మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ ఇప్పటికైనా ఓటమిని అంగీకరించి, ఫలితాలను విశ్లేషించుకోవాలని బొత్స హితవు పలికారు. టీడీపీకి ఓటమిని అంగీకరించే ధైర్యం లేదని ఆయన మండిపడ్డారు.

Also Read: Tollywood: మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం.. చర్చించే అంశాలేంటి?

టీడీపీ పనైపోయింది

తెలుగు దేశం పార్టీ పనైపోయిందని మంత్రి బొత్స విమర్శలు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. పరిషత్ ఫలితాల లెక్కింపునకు కోర్టు అంగీకరించినప్పటి నుంచి టీడీపీ మరింత ఆక్రోశం వ్యక్తం చేస్తుందని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజాసమస్యలు తెలుసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు వాటిని పరిష్కరిస్తున్నారని అన్నారు. టీడీపీ ఆరోపిస్తున్నట్లు ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఇంత భారీ విజయాలు ఎందుకు వస్తాయని మంత్రి అన్నారు. 

News Reels

Also Read: KTR: తెలంగాణకు కీటెక్స్ కంపెనీ.. రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు

వైసీపీ పాలకను నిదర్శనం

పరిషత్ ఎన్నికల తీర్పుతో టీడీపీ పనైపోయిందని ప్రజాతీర్పు వచ్చిందని మంత్రి బొత్స అన్నారు. ఇప్పటికైనా టీడీపీ తన ప్రవర్తన మార్చుకుని ప్రజా సమస్యసపై పోరాడాలని కోరారు. సీఎం జగన్ పాలనకు నిన్న వచ్చిన తీర్పు నిదర్శనమన్నారు. రాజీనామాలపై విలేకరులు అడిన ప్రశ్నలకు.. అచ్చెన్నను రాజీనామా చేయమను, నేను చేస్తాను.. ఇవేమన్నా కుస్తీ పోటీలా అని బొత్స సత్యనారాయణ నిలదీశారు.

Also Read: Fiber Net Case : ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావుకు బెయిల్

డిసెంబర్ లోగా టిడ్కో ఇళ్లు 

టీడీపీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించి విశ్లేషణ చేసుకోవాలని బొత్స హితవు పలికారు. ప్రజలు అమాయకులు కాదని, ఎవరేమి చేస్తున్నారో ప్రజలకు తెలుస్తోందన్నారు.  గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు శాశ్వత హక్కు కింద అందిస్తున్నామన్నారు. 80 వేల టిడ్కో ఇళ్లను డిసెంబర్ లోగా లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 

Also Read: AP CM Jagan Comments : అబద్ధాన్ని నిజం చేసి.. ముఖ్యమంత్రిని దింపేయాలని చూస్తున్నారు

Published at : 20 Sep 2021 03:31 PM (IST) Tags: YSRCP Tdp news Chandrababu AP ZPTC MPTC Elections Zptc Mptc results botsa satyanarayana atchan naid

సంబంధిత కథనాలు

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Vizag News: త్వరలోనే విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు: వై.వి సుబ్బారెడ్డి

Vizag News: త్వరలోనే విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు: వై.వి సుబ్బారెడ్డి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

MP Vijayasai Reddy : త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy :  త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

టాప్ స్టోరీస్

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!