అన్వేషించండి

Kanakamedala : బీజేపీతో పొత్తులు ఫైనల్ - సీట్లపై కసేపట్లో అధికారిక ప్రకటన - ఎంపీ కనకమేడల క్లారిటీ !

Andhra : ఏపీలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రకటించారు. సీట్ల సంఖ్యపై అధికారిక ప్రకటన వస్తుందన్నారు

TDP MP Kanakamedala Ravindra Kumar announced that three parties will contest together in AP :  బీజేపీతో పొత్తులు కుదిరాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రకటించారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. అన్ని పార్టీలు బలాబలాలను బట్టి పోటీ చేస్తాయన్నారు. సీట్ల సంఖ్యపై అధికారిక ప్రకటన కాసేపట్లో వస్తుందన్నారు. పొత్తుల వల్ల కొంత మంది సీట్లు కోల్పోతున్నందు వల్ల నేతల్లో అసంతృప్తి పెరుగుతన్నా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి ముందుకు వెళ్తున్నామన్నారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే మూడు పార్టీలో లక్ష్యం అన్నారు.

ఉదయం పదకొండు గంటల సమయంలో   చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమిత్ షాతో సమావేశం అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటుపై ప్ర‌ధానంగా చ‌ర్చ కొన‌సాగింది. ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటుపై టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరిన‌ తర్వాత  అలాగే ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించింది.. ఈ నెల 14వ తేదిన జ‌రిగే ఎన్డీఎ స‌మావేశానికి చంద్ర‌బాబును హాజ‌రుకావాల్సిందిగా అమిత్ షా కోరారు.                                               

నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ లోకి టీడీపీ చేరిక ప్రకటన ఏ క్షణమైనా రానుంది.  రెండు విడతలుగా ఢిల్లీలో  జరిగిన చర్చల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. టీడీపీ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో , బీజేపీ ఆరు స్థానాల్లో, జనసేన రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నారు. జనసేన రెండు స్థానాలు కాకినాడ, మచిలీపట్నంగా ఖరారయ్యాయి. రాజంపేట, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, హిందూపురం నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారు.  ఇక అసెంబ్లీ స్థానాల్లోనూ లెక్క కుదిరింది. బీజేపీ, జనసేనకు కలిసి 30 నియోజకవర్గాలు కేటాయించారు. ఇందులో ఇరవై నాలుగు  జనసేన, ఆరు బీజేపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ ఆరు నియోజకవర్గాలు ఏమిటేమిటి అన్నదానిపై రాష్ట్ర స్థాయిలో చర్చించి ఖరారు చేసుకుంటారు.                          

బీజేపీ పెద్దలతో చర్చల తర్వాత పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు అమరావతి బయలుదేరి వెళ్లినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల్లో వారు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. పొత్తుల్లో పోటీ చేయాల్సిన స్థానాలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వా.. మిగిలిన చోట్ల అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పిటకే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే.. బీజేపీతో పొత్తుల కారణంగానే వాటిని పెండింగ్ లో పెట్టారు. స్థానాలు ఖరారైన తర్వాత ... అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.. మరో మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.              

 

టాప్ హెడ్ లైన్స్

Mudragada Padmanabham Passes Away: ముద్రగడ పద్మనాభం ఇక లేరు - తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత
ముద్రగడ పద్మనాభం ఇక లేరు - తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత
Breaking News: ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
Singarayakonda Train Suicide: ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
TTD Darshan Fraud Arrest: దర్శన టిక్కెట్ల పేరుతో లక్షల్లో మోసం - టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్ - భక్తులకు కీలక సూచనలు
దర్శన టిక్కెట్ల పేరుతో లక్షల్లో మోసం - టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్ - భక్తులకు కీలక సూచనలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget