అన్వేషించండి

Yanamala About Navaratnalu: జగన్ 3 ఏళ్ల పాలనపై యనమల సెటైర్లు - 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలన్న మాజీ మంత్రి

Yanamala Comments on Navaratnalu: ఏపీ సీఎం వైఎస్ జగన్ 3 ఏళ్ల పాలన 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలుగా కొనసాగుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.

Yanamala Ramakrishnudu Comments on AP CM YS Jagan Mohan Reddys 3 Year Ruling : ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనపై మాట్లాడుతూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సెటైర్లు వేశారు. జగన్ 3 ఏళ్ల పాలన 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలుగా కొనసాగుతోందని యనమల ఎద్దేవా చేశారు. అధికారం కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నవరత్నాలు ఇస్తానని చెప్పిన వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చిన తరువాత నవమోసాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు.

నవరత్నాలు కాదు నవమోసాలు..
ఏపీ ప్రజలకు నవరత్నాలు తీసుకొచ్చానని సీఎం జగన్ డబ్బా కొడుతున్నారని, ప్రజల పాలిట అవి నవమోసాలని యనమల రామకృష్ణుడు (Yanamala About Navaratnalu) పేర్కొన్నారు. నవరత్నాలు ఇస్తానని చెప్పి, నవమోసాలకు పాల్పడిన సీఎం జగన్‌కు ఎప్పుడెప్పుడు బుద్ధి చెప్పాలా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్ మూడేళ్ల పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే.. 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలుగా పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. గెలవకపోతే నవరత్నాలను నిలిపివేస్తానని అధికార పార్టీ చెప్పడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి రాబోయే రోజులు గడ్డు కాలమేనని యనమల తెలిపారు.

రాష్ట్రంలో ఎటు చూసినా సమస్యలే..
సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన ఘనత సీఎం జగన్ (AP CM YS Jagan Mohan Reddy) సొంతమని వ్యాఖ్యానించారు. కరెంట్ కోతలతో పలు రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, తద్వారా పలు వర్గాలకు ఇది తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందన్నారు. విచ్చలవిడిగా అప్పులు చేయడంతో రాష్ట్ర ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజలను పని చేయకుండా సోమరులను చేస్తూ వారి భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్న నేత ఏపీ సీఎం అని చెప్పారు. సంక్షేమ పథకాలలోనూ అవినీతికి పాల్పడిన ప్రభుత్వం వైఎస్సార్ సీపీ సర్కార్ అని చురకలు అంటించారు యనమల.

Also Read: Home Minister Taneti Vanita : చిన్నారులపై అఘాయిత్యాల కామెంట్స్ పై హోంమంత్రి వివరణ, ముందు వెనక కట్ చేసి ప్రసారం చేస్తున్నారని ఆరోపణ

Also Read: Minister Kottu Satyanarayana : ఎంతటి హీరో అయినా దేవుడి కన్నా ఎక్కువేం కాదు, రామ్ చరణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహంపై మంత్రి కొట్టు సత్యనారాయణ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Embed widget