TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !
జగన్ మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతల్ని అరెస్టులు చేస్తున్నారని సోషల్ మీడియా ద్వారా టీడీపీ విస్తృత ప్రచారం చేస్తోంది. మోత మోగిద్దాం పేరుతో కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
TDP News : మోతమోగిద్దాం పేరుతో టీడీపీ ఓ కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదని.. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందేనని టీడీపీ తెలిపింది. చంద్రబాబు గారికి మద్దతుగా... సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మీరు ఏం చేసినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని టీడీపీ సూచించింది.
అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30 వ తేదీ… pic.twitter.com/K0J6bo5RBY
— Lokesh Nara (@naralokesh) September 29, 2023
అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30 వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్ధం వినిపిద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు.
🧟♂️నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే 🔊. చంద్రబాబు గారికి మద్దతుగా... సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించండి📢🎤. మీరు ఏం చేసినా దాన్ని వీడియో… pic.twitter.com/3WMuhPdw8P
— Telugu Desam Party (@JaiTDP) September 29, 2023
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున సోషల్ మీడియలో ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ప్రచారం చేస్తున్నరు. స్కిల్ కేసులో ఉన్న నిజాలు అంటూ అన్ని డాక్యుమెంట్లతో వెబ్ సైట్ కూడా ప్రారంభించారు. న్యాయస్థానాల్లో సీఐడీ తరపు లాయర్ల వాదనల సారాంశాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఎక్కడా అవినీతి జరగకపోయినా నిధుల దుర్వినియోగం అని.. డబ్బు మళ్లింపు అని రకరకాల మాటలు మార్చుతూ.. రాజకీయ కుట్రతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
ఇప్పుడు వైసీపీ ఆరోపణలపై నేరుగా ఎదురుదాడికి దిగుతున్నారు. సోషల్ మీడియో వేదికగా మోతమోగిద్దామని పిలుపనివ్వడంతో పార్టీ శ్రేణులన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.