అన్వేషించండి

Andhra News : ఏపీలో ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు స్కాం - కీలక వివరాలు బయట పెట్టిన సోమిరెడ్డి !

ఏపీలో ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు స్కాం జరిగిందని టీడీపీ ఆరోపించింది. టీడీపీ నేత సోమిరెడ్డి కీలక విషయాలను వెల్లడించారు.


Andhra News :   ఏపీలో ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు స్కాం జరిగిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ారోపించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ట్రాన్స్ ఫార్మర్ల స్కామ్ ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విలేకరులకు వివరించారు.‘జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు దత్తపుత్రులు..వారిలో ఒకరు అరబిందో సంస్థ యాజమాన్యమైతే, మరొకరు షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ యజమాని. ఈ రెండు సంస్థలకు పుట్టిన విషపుత్రికే ఇండో సోల్ సోలార్ సంస్థ. ఇండో సోల్ సోలార్ సంస్థ వయస్సు కేవలం 18 నెలలు మాత్రమే. ఆ సంస్థను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి అందుకు బహుమతిగా రూ.75,706 కోట్ల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టాడు’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ‘గతంలో తాము షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ స్మార్ట్ మీటర్ల కుంభకోణాన్ని బయటపెట్టామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు.

2023లో తెలంగాణతో పోలిస్తే ఏపీలో ట్రాన్స్ ఫార్మర్ల ధరలు ఎక్కువ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 25 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్‍ ధర తెలంగాణలో రూ.79,829 అయితే ఏపీలో రూ.1,78,800 ధర అని చెప్పుకొచ్చారు. 63 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్ ధర తెలంగాణలో రూ.1,22,936 అయితే ఏపీలో రూ.2,81,00 అని వెల్లడించారు. తెలంగాణ కంటే ఏపీలో 200 నుంచి 300 శాతం ఎక్కువ ధరకు ట్రాన్స్ ఫార్మర్లు అమ్మకాలు జరిగాయని అన్నారు. గత ఏడాది ధరలు చెబితే ఇప్పటికీ ధరలు పెరగవా అని అంటున్నారని మండిపడ్డారు. ఒక్క ఏపీసీపీడీసీఎల్‍లో వచ్చిన ఆర్డర్లలో 60 శాతానికి పైగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కేనని పత్రాలు చూపించారు. 

వచ్చిన ఆర్డర్లలో ఒక్క కంపెనీకే 60 శాతం కట్టబెడతారా? అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. సీపీడీసీఎల్ పరిధిలోని రూ.611.40కోట్ల విలువైన పనుల్లో రూ.380 కోట్ల విలువైన  పనులు షిరిడీసాయి సంస్థకే అప్పగించడం వెనకున్న మర్మమేంటి? అని నిలదీశారు. జగన్ రెడ్డి...వైసీపీ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై మాట్లాడే ధైర్యం లేకే మంత్రులు, వైసీపీనేతలు టీడీపీపై, చంద్రబాబుపై నిందలేస్తున్నారని మండిపడ్డారు.         

అధికారంలోకి వచ్చినప్పటినుంచీ వైఎస్ జగన్ అమలు చేస్తున్న ప్రతి స్కీమ్, ప్రతి ప్రాజెక్ట్ లోనూ స్కామ్ అవినీతేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి దోపిడీపై హైకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు. ఏపీ సర్కార్ పలు అంశాల్లో కొన్ని కంపెనీలనే ప్రోత్సాహిస్తూండటం.. వాటికే టెండర్లు దక్కడం విపరీతమైన అవినీతి కారణంగానే ఎక్కవ ధరలకు కొనుగోళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు.                                                            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Forbes 30 Under 30 Asia 2026:ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
Mandula Samuel controversial comments : ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలతో కలకలం - కేసులు నమోదు చేయరా అని బీజేపీ ప్రశ్న
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలతో కలకలం - కేసులు నమోదు చేయరా అని బీజేపీ ప్రశ్న
YS Sharmila Rajya Sabha: ఏపీ కాంగ్రెస్ పై అధిష్టానం ఫోకస్.. కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిళ!
ఏపీ కాంగ్రెస్ పై అధిష్టానం ఫోకస్.. కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిళ!
Breaking News: సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు!
సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు!

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Tripti Dimri Photos : స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
Embed widget