అన్వేషించండి

YS Sharmila : రుషికొండపై సిట్టింగ్ జడ్జితో విచారణ - షర్మిల డిమాండ్

Andhra Politics : రుషికొండపై ప్రజాధనం దుర్వినియోగం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు.

Sharmila demanded sitting judge inquiry in Rushikonda Palace Issue  :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రుషికొండ అంశం సంచలనంగా మారింది. ప్రజాధనం వందల కోట్లు దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి తాను ఉండేందుకు క్యాంప్ ఆఫీసు కట్టించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం రుషికొడంలో నిర్మాణాలపై ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. కనీసం లోపలి ఫోటోలు కూడా వెలుగులోకి రాలేదు. ప్రభుత్వం మారడంతో .. సీన్ మారిపోయింది. భీమిలి నియోజకవర్గం పరిధిలోకి రుషికొండ వస్తుంది. దీంతో అక్కడి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ భవనాన్ని పరిశీలించారు. ఆయన మీడియా ప్రతినిధుల్ని కూడా తీసుకెళ్లడంతో లోపలి వైభోగాలు సంచలనంగా మారాయి.                                

ఈ అంశంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా స్పందించారు. రిషికొండ విషయంలో ప్రజాధనం  దుర్వినియోగం జరిగిందని ఇలాంటి వాటిని అంగీకరించే ప్రసక్తే ఉండదన్నారు. మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రుషికొండపై గతంలో పర్యాటక శాఖకు చెందిన కాటేజీలు ఉండేవి. వాటి నుంచి ఏడాదికి రూ. పాతిక కోట్ల వరకూ ఆదాయం వచ్చేది. అయితే ప్రభుత్వం హఠాత్తుగా వాటిని రూ. 90 కోట్లకుపైగా ఖర్చుతో కూల్చేసి స్టార్ హోటల్ కడుతున్నామని ప్రకటించింది. కానీ చేసిన నిర్మాణం స్టార్ హోటల్ కాదు. గెస్ట్ హౌస్ లా ఉంది.                            

ఎన్నికలకు ముందు ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ఓ కమిటీ వేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిమి శ్రీలక్ష్మి నేతృత్వంలో కమిటీ ఈ భవనాలను సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుగా వినియోగించుకోవచ్చని సిఫారసు చేసింది. దీంతో ఎన్నికలు అయిపోగానే ఆయన విశాఖకు వచ్చి కాపురం పెట్టి.. పాలన చేయాలనుకున్నారు. అయితే పలితాలు తేడాగా రావడంతో మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు ప్యాలెస్ నిర్మాణం కోసం చేసిన ఖర్చు కూడా వైరల్ గా మారుతోంది.                                                            

రుషికొండ ఇంటికి సంబంధించి ప్రతి ఒక్క వస్తువును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. టాయిలెట్ కమోడ్ ధర ముఫ్పై లక్షల రూపాయల వరకూ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అక్కడ పెట్టిన వస్తువుల ఫోటోలను ఆన్ లైన్ లో సెర్చ్ చేసి వాటి ధర ఎతో నెటిజన్లు సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో ఆశ్చర్యపోవడం ప్రజల వంతు అవుతోంది. అందుకే ఈ అంశంపై న్యాయ విచారణకు ఆదేశించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. షర్మిల కూడా అదే చెబుతున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget