17th July 2024 News Headlines: జులై 17న మీ స్కూల్ అసెంబ్లీలో చదవదగ్గ న్యూస్ హెడ్‌లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు
17 th July School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.
17th July 2024 News Headlines in Telugu For School Assembly:
1. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన్యత ఇవ్వాలని చంద్రబాబు కోరారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని.. ఆదుకోవాలంటూ అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విభజన చట్ట సమస్యలు పరిష్కరించాలని కోరారు.
2. జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ చట్టంపై అనేక సందేహాలు.. భయాందోళనలు ఉండడంతో చట్టాన్ని రద్దుచేయాలని కేబినేట్ తీర్మానించింది
3. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 9.914 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 4.500 టీఎంసీలు, తెలంగాణకు 5.414 టీఎంసీల నీటిని శ్రీశైలం పవర్ హౌసెస్ ద్వారానే విడుదల చేయాలని బోర్డు తేల్చి చెప్పింది.
4. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాల్లో 11.5 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడటం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలకు వరద ముంపు పొంచి ఉందని తెలిపింది.
5. ఒడిశాలోని శ్రీక్షేత్రంలో ఉన్న రత్న భాండాగారం రహస్య గది తలుపులు లేరు తెరుచుకోనున్నాయి. ఉదయం 9.51 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు తలుపులు తెరిచేందుకు శుభముహూర్తంగా నిర్ణయించారు. ఇప్పటికే పూరీ జగన్నాథుడి సంపదను వెలికితీసి స్ట్రాంగ్‌రూంకు తరలించారు.
6. ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ప్రసంగం చేయనున్నారు. ఈ నెల 26న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ప్రాథమిక జాబితాలో ప్రధాని మోదీ పేరు ఉంది. అయితే ఈ జాబితానే తుది జాబితా కాదు.
7. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ట్రంప్‌పై దాడితో ఈ రేసులో రిపబ్లికన్ పార్టీ కాస్త దూకుడు పెంచింది. ఈ పరిస్థితుల్లో బైడెన్ తన తప్పును అంగీకరించారు. ప్రజాస్వామ వ్యవస్థకు ట్రంప్ ముప్పుగా మారారని బైడెన్ గతంలో వ్యాఖ్యానించారు.
8. అమెరికా ఉపాధ్యక్ష పదవికి తెలుగింటి అల్లుడు పోటీ పడుతున్నాడు. రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థి జేమ్స్ డేవిడ్ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. ఓహియో సెనేటర్‌గా ఉన్న జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరికి ప్రవాసాంధ్రులు.
9. టీ 20 క్రికెట్‌లో టీమిండియా కొత్త కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ పేరు విస్తృతంగా వినిపిస్తోంది. ఇప్పటివరకూ హార్దిక్ పాండ్యా పేరు వినిపించగా... ఇప్పుడు స్కై పేరు బలంగా వినిపిస్తోంది. టీ 20 ప్రపంచకప్ గెలుపుతో రోహిత్ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ స్థానాన్ని సూర్య భర్తీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మంచి మాట : లేవండి , మేల్కోండి , గమ్యం చేరేవరకు విశ్రమించకండి. -- స్వామి వివేకానంద