కేరళలో ప్రమాదానికి గురైన ఏపీ యాత్రికుల బస్సు- ముగ్గురి పరిస్థితి విషమం- సీఎం ఆరా
శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికుల బస్సు పతనంమిట్ట వద్ద ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. సీఎంఓ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
శబరిమలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సు పతనంతిట్ట సమీపంలో లోయలో పడిపోయింది. 18 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు కొండ ఎక్కుతుండగా అదుపుతప్పి కింద పడినట్లు అనుమానిస్తున్నారు.
శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికుల బస్సు పతనంమిట్ట వద్ద ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. సీఎంఓ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వారికి సరైన సహాయం అందించేలా చూడాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడమే కాకుండా, యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు.
18 seriously injured and three critical after an #AndhraPradesh bus with pilgrims, en route #Sabarimala met with an accident near Pathanamthitta in Kerala.
— Apoorva Jayachandran (@Jay_Apoorva18) November 19, 2022
The bus they were traveling in overturned and fell into the valley near Pathanamthitta of #Kerala pic.twitter.com/PJ1QhtdzVP
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఏపీకి చెందిన భక్తుల బృందం మొత్తం 3 బస్సుల్లో శబరిమల వెళ్లారని, ఈ మూడు బస్సులు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఉదయం 8:10 గంటలకు పతనంమిట్ట వద్ద ఒక బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణిస్తున్నారని, 18 మంది గాయపడ్డారని, ఇందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నామని, మిగిలిన యాత్రికులకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పతనంమిట్ట జిల్లా అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.