News
News
X

Weather Update: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు.. ఆ ప్రాంతాల్లో వర్షాలు

నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న సమయంలో ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమలోని అనేక చోట్ల వర్షాలు కురిశాయి.

FOLLOW US: 

నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న వేళ ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి.  ఎర్రగొండపాలెం, ఉదయగిరి, కనిగిరి, తిరుపతి ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి.. ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఇప్పటికే ఆలస్యమైంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమన రేఖ కళింగపట్నం, నందిగామ, కర్నూలు, గదగ్ , మజలి ప్రాంతాల గుండా వెళుతుంది. అక్టోబర్ 26, 2021న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందు వల్ల నైరుతి రుతుపవనాలు మొత్తం దేశం నుంచి తిరోగమించుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ నెల 26న ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల రాక ప్రారంభం కానుంది. మరోవైపు అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి తేమ  రాష్ట్రం వైపు వస్తోంది. దీంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా  మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. తిరుపతిలో 106.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. 

నీటిలో చిక్కుకుని నవ వధువు మృతి

తిరుపతిలో ఘోరం జరిగింది. భారీ వర్షానికి నీటిలో మునిగి నవ వధువు మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు కర్ణాటక రాయచూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుండగా భారీ వర్షం కురిసింది. తిరుపతి వెస్ట్ చర్చి అండర్ బ్రిడ్జి లోకి భారీగా వరద నీరు చేరింది.  ఏడుగురితో ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం వరద నీటిలో చిక్కుకుంది. వాహనంలోని నవ వధువు సంధ్య వరద నీటిలో చిక్కుకొని చనిపోయింది. మరో చిన్నారి అస్వస్థత గురైంది. వరద నీటిలో వాహనం చిక్కుకున్న విషయాన్ని గమనించి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు మిగతా వారిని రక్షించారు. 

Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?

Also Read: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్

Also Read: Petrol-Diesel Price, 24 October: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి.. నేడు మీ నగరంలో ఎంత పెరిగిందంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Oct 2021 08:13 AM (IST) Tags: IMD weather news rains in ap tirupati latest weather updates

సంబంధిత కథనాలు

MP Vijaysai Reddy : దసపల్లా భూములపై సుప్రీం ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం- ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijaysai Reddy : దసపల్లా భూములపై సుప్రీం ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం- ఎంపీ విజయసాయి రెడ్డి

Breaking News Live Telugu Updates: కోతులు వెంటబడటంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు

Breaking News Live Telugu Updates: కోతులు వెంటబడటంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు

కొత్త జాతీయ పార్టీ పేరుతో కేసిఆర్ వేయబోతున్న స్కెచ్ ఇదేనా?

కొత్త జాతీయ పార్టీ పేరుతో కేసిఆర్ వేయబోతున్న స్కెచ్ ఇదేనా?

Prajaporu BJP : ప్రజాపోరుతో వణుకు పుట్టించాం - ఏపీ ప్రభుత్వ అరాచక, అవినీతి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న ఏపీ బీజేపీ !

Prajaporu  BJP :  ప్రజాపోరుతో వణుకు పుట్టించాం - ఏపీ ప్రభుత్వ అరాచక, అవినీతి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న ఏపీ బీజేపీ !

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

టాప్ స్టోరీస్

Crime News : రియల్ ఆవేశం స్టార్ - పోలీసులు ఆపారని బైక్ కాల్చేసుకున్నాడు.. కేసుల పాలయ్యాడు !

Crime News : రియల్ ఆవేశం స్టార్ - పోలీసులు ఆపారని బైక్ కాల్చేసుకున్నాడు.. కేసుల పాలయ్యాడు !

రూ.15 వేలలోపే ల్యాప్‌టాప్ - కొత్త మార్కెట్‌పై దాడికి జియో సిద్ధం!

రూ.15 వేలలోపే ల్యాప్‌టాప్ - కొత్త మార్కెట్‌పై దాడికి జియో సిద్ధం!

God Father: చిరంజీవి 'గాడ్ ఫాదర్' టైటిల్ సాంగ్ వచ్చేసిందోచ్!

God Father: చిరంజీవి 'గాడ్ ఫాదర్' టైటిల్ సాంగ్ వచ్చేసిందోచ్!

Prabhas-Maruthi: ప్రభాస్‌తో హారర్ కామెడీ కాదు - కథ మారిందట!

Prabhas-Maruthi: ప్రభాస్‌తో హారర్ కామెడీ కాదు - కథ మారిందట!