By: ABP Desam | Updated at : 24 Oct 2021 07:49 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
భారత మార్కెట్‌లో బంగారం ధరలు నేడు పెరిగాయి. గ్రాముకు రూ.19 వరకూ పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ రూ.46,650 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.47,650గా ఉంది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర పెరిగింది.
బంగారం ధరలు పెరగ్గా వెండి ధర మాత్రం అతి అస్వల్ప పెరుగుదల నమోదు చేసింది. గ్రాముకు రూ.0.30 పైసలు చొప్పున పెరిగింది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.65,600 గా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర గ్రాముకు రూ.4.60 పైసలు వరకూ పెరిగింది. ఇక్కడ కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.69,900 వరకూ ధర పలుకుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ, ఏపీల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.20 చొప్పున పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,820 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,750 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,900గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉండనున్నాయి.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,750 గానే ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,820గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,900గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,750 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,820గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.69,900 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,250గా ఉంది.
ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం నేడు పెరిగింది. గ్రాముకు రూ.52 వరకూ పెరిగి తాజా ధర రూ.2,544గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,440 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్
Petrol-Diesel Price, 30 June: ఈ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుదల, మిగతా చోట్ల మాత్రం సాధారణమే!
Gold-Silver Price: నేడు బిగ్ గుడ్‌న్యూస్! భారీగా బంగారం పతనం, వెండి కూడా కిందికి
GST Rate Cut: ప్రభువుల వారు కరుణించారు! జీఎస్టీ తగ్గించిన వస్తువుల జాబితా!
GST Rate Increase: ప్యాక్ చేసిన పెరుగు, లస్సీపై జీఎస్టీ - ఆస్పత్రి బెడ్స్, గ్రైండర్లపై పన్ను మోత!
Hero Passion XTEC: కొత్త ప్యాషన్ వచ్చేసింది - రూ.లక్ష లోపు బెస్ట్ బైక్!
TS SSC Results 2022: ఇవాళే తెలంగాణ పదోతరగతి ఫలితాలు - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్!
Relief For Amaravati Employees : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !
Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?