అన్వేషించండి

APBJP : ఏపీ బీజేపీకి కొత్త కార్యవర్గం - ఎన్నికలకు పురందేశ్వరి టీమ్ రెడీ !

ఏపీ బీజేపీ కొత్త కార్యవర్గాన్ని పురందేశ్వరి ప్రకటించారు. నలుగురు ప్రధాన కార్యదర్శుల్ని మార్చారు.

 

APBJP :   ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీ ఎన్నికల కోసం తన టీమ్ ను ప్రకటించారు. ఇప్పటి వరకూ ఉన్న నలుగురు ప్రధానకార్యదర్శలను మార్చేసి కొత్త వారికి చాన్సిచ్చారు. నలుగురు ప్రధాన కార్యదర్శులుగా విశ్వనాథరాజు, బిట్రా శివన్నారాయణ, దయాకర్ రెడ్డి, గారపాటి తపనచౌదరిని నియమించారు. అలాగే పదకొండు మందిని ఉపాధ్యక్షులుగా నియమించారు. ఇప్పటి వరకూ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డిలను ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరితో పాటు ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్ రాజు, చందు సాంబశివరావు వంటి సీనియర్ నేతలకూ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. పది మందిని కార్యదర్శులుగా నియమించారు. ఇతర మోర్చాలకూ అధ్యక్షుల్ని నియమించారు.
APBJP : ఏపీ బీజేపీకి కొత్త కార్యవర్గం - ఎన్నికలకు పురందేశ్వరి టీమ్ రెడీ !

 

పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించిన తర్వాత కొత్త టీమ్ ను ఏర్పాటు చేయాలనుకున్నారు. తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారు. చివరికి గత అధ్యక్షుడు సోము వీర్రాజు ముద్ర లేకుండా నియమించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. సోము వీర్రాజు బృందం ఉన్నప్పుడు .. వైఎస్ఆర్‌సీపీ అనుకూలంగా వ్యవహరించారన్న ప్రచారం జరిగింది. అయితే తాము ఏ పార్టీకి అనుకూలంగా లేమని.. బీజేపీ కోసమే నిత్యం పోరాడామని సోము వీర్రాజు సహా అందరూ చెప్పేవారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత..తాము , వైసీపీ ఒకటేనని ప్రజలు నమ్ముతున్నారని.. బీజేపీ నేత మాధవ్ చెప్పడం సంచలనం అయింది. అలాంటి పరిస్థితి మార్చేందుకు.. పురందేశ్వరికి బీజేపీ పగ్గాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. 


APBJP : ఏపీ బీజేపీకి కొత్త కార్యవర్గం - ఎన్నికలకు పురందేశ్వరి టీమ్ రెడీ !


ఎన్నికలు ఎదుర్కోవాల్సిన టీమ్ కావడంతో..చాలా మంది నేతలు కీలక పదవుల కోసం పోటీ పడ్డారు. అయితే ప్రధాన కార్యదర్శులందర్నీ మార్చడం ద్వారా గత ముద్రను తొలగించాలని పురందేశ్వరి ప్రయత్నించినట్లుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కమిటీ ద్వారా సందేశం పంపాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కొంత మంది ప్రాధాన్యత తగ్గించడం ద్వారా.. తాము ఏ పార్టీకి అనుకూలం కాదన్న వాదనను వినిపించడానికి ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు.                              


ఏపీ బీజేపీలో జనంలో పలుకుబడి ఉన్న నేతలు తక్కువే అయినా వర్గపోరాటానికి మాత్రం కొదవ ఉండదు. కన్నా లక్ష్మినారాయణ చీఫ్ గా ఉన్నప్పుడు ఆయన అనుచరుల్ని నియమించారని.. సోము వీర్రాజు.. పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా మందిని సస్పెండ్ చేశారు. చివరికి ఈ కారణంతోనే ఆయన పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. సోము వీర్రాజుకు వ్యతిరేకంగా అనేక మంది ఢిల్లీకి కూడా వెళ్లి ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు  చాలా మంది సీనియర్లకు ప్రాధాన్యత తగ్గించడంతో వారంతా పురందేశ్వరికి వ్యతిరేకమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.                                                                           

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget