అన్వేషించండి

PM Kisan: రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!

PM Kisan: అర్హులైన రైతులకు కేంద్రం ఏటా రూ.6000 మూడు విడతల్లో నేరుగా ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం అర్హతలు, దరఖాస్తు విధానం వివరంగా తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రధాని కిసాన్ పథకం: రైతులకు రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది.
  • 23వ వాయిదా: 9 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్లు విడుదల.
  • అర్హతలు: భారతీయ పౌరులు, 2 హెక్టార్ల లోపు భూ యజమానులు.
  • eKYC తప్పనిసరి: పథకం లబ్ధిదారులు ఆధార్ ద్వారా పూర్తి చేయాలి.

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) యోజన.. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6000 ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రారంభించిన సంక్షేమ పథకం. ఈ పథకం కింద అర్హులైన రైతులకు మూడు విడతల్లో రూ.2,000 చొప్పున ఏడాది రూ.6 వేలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇటీవల 22వ వాయిదా కింద 9.32 కోట్లకు పైగా రైతులు రూ.2,000 ఆర్థిక సహాయం అందుకున్నారు.  

పీఎం-కిసాన్ 23వ వాయిదాపై అప్డేట్ వచ్చింది. జూన్ 18న వారణాసిలో ప్రధాని మోదీ 9 కోట్ల మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.20,000 కోట్లు నేరుగా బదిలీ చేయనున్నట్లు  కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.  పీఎం కిసాన్ పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు తెలుసుకుందాం.  

పీఎం కిసాన్ అర్హులు?

భారతీయ పౌరుడై ఉండాలి.  
రెవెన్యూ గ్రామాలలో 2 హెక్టార్ల లోపు భూ యజమానులు 
ఆధార్ నంబర్‌ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ 
తప్పనిసరి eKYC పూర్తి చేయాలి.  
 

PM-KISAN దరఖాస్తు విధానం  

పీఎం కిసాన్ వెబ్ సైట్, సీఎస్సీ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. 
భూరికార్డులు, రైతు రిజిస్ట్రీలో నమోదు వివరాలతో అప్లై చేసుకోవచ్చు.  

ఆన్ లైన్ ప్రాసెస్ 

PM-KISAN అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in/ సందర్శించండి. 
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఆధార్ ధృవీకరణ చేయండి. 
గ్రామ స్థాయి అధికారులు భూమి వివరాలు ధృవీకరిస్తారు.
రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. 

అవసరమైన పత్రాలు

ఆధార్ కార్డు  
భూ యాజమాన్య పత్రాలు  
IFSC కోడ్‌తో బ్యాంకు అకౌంట్ 
ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు   

PM-KISAN స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? 

1. PM-KISAN అధికారిక పోర్టల్‌కు వెళ్లండి.
2. హోమ్‌పేజీలోని “Know Your Status” పై క్లిక్ చేయండి.
3. అవసరమైన ఫీల్డ్‌లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయండి.

Also Read: ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఏడాదికి 9 సిలిండర్లు, రూ.300 సబ్సిడీ.. PMUY అర్హతలు, అప్లై ప్రాసెస్ ఇదే!

రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తులేకపోతే

"Know Your Registration number" పై క్లిక్ చేయండి
మొబైల్ నెంబర్ లేదా ఆధార్ కార్డు ద్వారా రైతు రిజిస్ట్రేషన్ నెంబర్ సెర్చ్ చేయవచ్చు. 
OTPతో వెరిఫై చేసి,  మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు.  

4. రిజస్టర్ట్ మొబైల్ నెంబర్‌కు పంపిన OTPని ఉపయోగించి వెరిఫికేషన్ పూర్తి చేయండి.
5.  వెరిఫికేషన్ తర్వాత PM KISAN వివరాలను స్క్రీన్‌పై చూడవచ్చు.  

Also Read: మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా 

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో రైతులు తనిఖీ చేసుకోవచ్చు. ఈ జాబితాలో గ్రామంలోని పీఎం కిసాన్ అర్హులందరి పేర్లు ఉంటాయి. 

1. PM-KISAN పోర్టల్‌కు వెళ్లండి.
2. హోమ్‌పేజీలో, “Farmers Corner” విభాగంలో “లబ్ధిదారుల జాబితా” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. తదుపరి పేజీలో రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం పేరు ఎంటర్ చేసి రిపోర్టు పొందవచ్చు.  
4. మీ గ్రామంలో PM KISAN అర్హుల పూర్తి జాబితా డిస్‌ప్లే అవుతుంది. 

Also Read: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు

PM-KISAN eKYCని పూర్తి చేసే ప్రక్రియ

ఈ పథకం కింద నమోదు చేసుకున్న లబ్ధిదారులందరూ eKYC తప్పనిసరి.  

1. PM-KISAN పోర్టల్‌కు వెళ్లండి.

2. e-KYC పై క్లిక్ చేయండి  

3. అవసరమైన ఫీల్డ్‌లో మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి, సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.

4. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు పంపిన OTP వెరిఫై చేసి eKYCని పూర్తి చేయండి.
 
మీ దగ్గరలోని CSC సెంటర్ ద్వారా ఆఫ్‌లైన్‌లో కేవైసీ పూర్తి చేయవచ్చు. 

Frequently Asked Questions

పీఎం కిసాన్ పథకం అంటే ఏమిటి?

పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ డబ్బు మూడు విడతల్లో రూ.2,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.

పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు?

భారతీయ పౌరులు, 2 హెక్టార్ల లోపు భూ యజమానులు, ఆధార్ నంబర్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు, eKYC పూర్తి చేసినవారు అర్హులు.

పీఎం కిసాన్ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

పీఎం కిసాన్ వెబ్సైట్ లేదా సీఎస్సీ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. భూరికార్డులు, రైతు రిజిస్ట్రీ వివరాలతో ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేయవచ్చు.

పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌కు వెళ్లి, 'Know Your Status' పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్‌తో OTP ద్వారా వెరిఫై చేస్తే మీ వివరాలు చూడవచ్చు.

పీఎం కిసాన్ eKYCని ఎలా పూర్తి చేయాలి?

పీఎం కిసాన్ పోర్టల్‌లో 'e-KYC' పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్‌తో OTP ద్వారా వెరిఫై చేయాలి. లేదా దగ్గరలోని CSC సెంటర్‌లో ఆఫ్లైన్‌లో కూడా పూర్తి చేయవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget