అన్వేషించండి

RBI Card Rules Change: మీ క్రెడిట్, డెబిట్ కార్డు మారినా పేమెంట్స్ ఆగవు.. కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్

Card Rules Change: RBI కొత్త నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ మార్చినా auto payments కు ఎలాంటి అంతరాయం కలగదు. ఇకపై EMIs, SIPలు, ఇన్సూరెన్స్ కొత్త కార్డుకు అప్డేట్ అవుతాయి.

RBI New Card Rules: మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. అయితే వాటి వ్యాలిడిటీ పూర్తవడమో, లేక పోయినప్పుడు కొత్త కార్డ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పాత కార్డుతో లింక్ అయి ఉన్న ఆటో పేమెంట్స్ నిలిచిపోతాయి. మళ్లీ కొత్త కార్డ్ అప్‌డేట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల అప్పటివరకూ మీ OTT సర్వీస్, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, SIP వంటి పేమెంట్స్ నిలిచిపోతాయి.

ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి పాత కార్డ్స్ లింక్ అయి ఉన్న ప్రతిచోటా కొత్త కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది వినియోగదారులకు చాలా ఇబ్బందికరమైన పని. అసలే బిజీ షెడ్యూల్స్, రోజువారీ బిజినెస్ లేక ఆఫీసు పనులతో సతమతవుతుంటారు. ఈ సమస్య నుంచి కస్టమర్లను ఊరట కలిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటి గురించి ఇక్కడ తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది. 

కార్డు మారినా మీ పేమెంట్ ఆగదు
రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం పాత కార్డ్ లింక్ పేమెంట్ ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఇప్పుడు బ్యాంకులు, కార్డు కంపెనీలు పాత కార్డుకు అనుసంధానమైన ఆటో పేమెంట్లను కొత్త కార్డుకు ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. అంటే మీరు కొత్త డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పటికీ సబ్‌స్క్రిప్షన్లు లేదా బిల్లులు, SIP వంటి ఈ-మ్యాండేట్ పేమెంట్లు వాటంతట అవే పేమెంట్ అవుతాయి. దాంతో మీరు పదేపదే పాత కార్డ్ లింక్ అయి ఉన్నచోట వివరాలను అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉండదు.

కొత్త రూల్స్ ఏమిటి?
ఇకపై మీ కార్డు మారినప్పుడు OTT, SIP, ఇన్సూరెన్స్ ప్రీమియం, EMI వంటి అన్ని ఆటో పేమెంట్లు ఆటోమేటిక్‌గా కొత్త కార్డుతో లింక్ అవుతాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, దీని కోసం వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు. ప్రతి ట్రాన్సాక్షన్ సమాచారంతో పాటు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కస్టమర్లకు కల్పిస్తారు. అలాగే కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారం కోసం బ్యాంకులు ఒక స్పెషల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఈ సౌకర్యం మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.. కస్టమర్లను ఆర్థిక నష్టాల నుండి కాపాడటం. కార్డు ఎక్స్‌పైరీ అయినా లేదా బ్లాక్ అయినా, దానికి సంబంధించి ఆటో పేమెంట్లు నిలిచిపోతాయి. SIP పెట్టుబడులు, లోన్ EMI పేమెంట్ మిస్ అవుతాయి. దాంతో మీకు ఫైన్ పడుతుంది. ఈ ఇబ్బందుల్ని తొలగించేందుకు కొత్త కార్డ్ తీసుకోగానే ఆటో పేమెంట్స్ యాక్టివేట్ అవుతాయి.

బ్యాంక్ అకౌంట్లో నగదు ఉన్నప్పటికీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల మీ పేమెంట్ పూర్తి కాకపోతే పెనాల్టీ రూపంలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ విధానంలో ఆర్బీఐ కొన్ని మార్పులు చేసి కార్డ్ వినియోగదారులకు ఊరట కలిగించింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Reliance Foundation Outreach: రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక సేవలు - జియో ఉచిత ఏఐ కోర్సుతో డిజిటల్ విప్లవం!
రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక సేవలు - జియో ఉచిత ఏఐ కోర్సుతో డిజిటల్ విప్లవం!
Reliance Industries 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget