అన్వేషించండి

Pan Card for Kids : ఇంట్లో నుంచే పిల్లల పాన్ కార్డ్ అప్లై చేయవచ్చు.. స్టెప్ బై స్టెప్ గైడ్, పూర్తి ప్రాసెస్ ఇదే

PAN Card for Minors : పిల్లల పాన్ కార్డ్ ఇప్పుడు ఇంట్లో కూర్చుని సులభంగా పొందవచ్చు. ఆన్లైన్ ఫారమ్ నింపి, డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి, e-KYC పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా ఉందంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పిల్లల భవిష్యత్తుకు పాన్ కార్డు ఆర్థిక ప్రణాళికకు ఉపయోగం.
  • ఆన్‌లైన్‌లోనే పిల్లలకు పాన్ కార్డుకు సులభంగా దరఖాస్తు చేయవచ్చు.
  • పెట్టుబడులకు, ప్రభుత్వ పథకాలకు, ఆర్థిక రికార్డులకు పాన్ కార్డు అవసరం.
  • బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

PAN Card for Children : పిల్లల పేరు మీద, వారి ఫ్యూచర్ కోసం ఆర్థికంగా ప్రణాళికలు చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది పిల్లల చిన్నప్పటి నుంచే పొదుపు, పెట్టుబడి గురించి ఆలోచిస్తారు. దీనివల్ల పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పాన్ కార్డ్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ అవుతుంది. అయితే ఇది పెద్దవారికి మాత్రమే అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే పిల్లలకు కూడా పాన్ కార్డ్ మంచి ప్రయోజనాలు ఇస్తుంది. దీంతో మీరు పిల్లల పేరు మీద మ్యూచువల్ ఫండ్స్, FDలు లేదా ప్రభుత్వ పథకాల్లో డబ్బు పెట్టుకోవచ్చు.

అదృష్టవశాత్తూ పిల్లలకు పాన్ కార్డ్ అప్లై చేయడం కోసం లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. లేదా ఏజెంట్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. మీరు ఇంట్లో కూర్చొని సులభంగా దీనిని పూర్తి చేయవచ్చు. సరైన సమాచారం, డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంటే సరిపోతుంది. ప్రక్రియ కూడా చాలా సులభం. కొంచెం శ్రద్ధతో నిమిషాల్లో పని పూర్తవుతుంది.

పిల్లల పాన్ కార్డ్ ఎందుకు అవసరం?

పాన్ కార్డ్ ఇప్పుడు కేవలం ఫార్మాలిటీ మాత్రమే కాదు. ఇది పిల్లల ఆర్థిక రికార్డులను స్పష్టంగా, క్రమబద్ధంగా ఉంచుతుంది. భవిష్యత్తులో అనేక పనులను సులభతరం చేస్తుంది.

  • మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, FDలలో పెట్టుబడి పెట్టడానికి అవసరం.
  • ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌లలో ప్రయోజనం లభిస్తుంది.
  • పిల్లల ఆర్థిక రికార్డులు స్పష్టంగా, క్రమబద్ధంగా ఉంటాయి.

ఇది పిల్లల భవిష్యత్తు ప్రణాళికను సులభతరం చేస్తుంది. భవిష్యత్తులో బ్యాంకింగ్ లేదా పన్నులకు సంబంధించిన ఏదైనా ప్రక్రియలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ఏయే డాక్యుమెంట్లు అవసరం?

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందు ఈ డాక్యుమెంట్‌లను సిద్ధంగా ఉంచుకోండి. ఇది ప్రక్రియను సులభతరం చేస్తుంది. సమయాన్ని ఆదా చేస్తుంది.

  •  పిల్లల వయస్సు, గుర్తింపును నిరూపించడానికి బర్త్ సర్టిఫికెట్ అడుగుతారు.
  • పిల్లల ఆధార్ కార్డ్ ఆన్‌లైన్ KYC కోసం అవసరం.
  • తల్లి/తండ్రి ఆధార్ కార్డ్, వారి సంతకం కూడా ఉండాలి. ఇది గుర్తింపు, చిరునామాను తెలుసుకునేందుకు హెల్ప్ చేస్తుంది.
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు భవిష్యత్తులో పాన్ అప్‌డేట్ కోసం ఉపయోగపడతాయి.

ఈ డాక్యుమెంట్లను ముందుగానే డిజిటల్ రూపంలో సిద్ధం చేయడం వల్ల అప్లికేషన్ సమర్పించడంలో ఆలస్యం జరగదు.

ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయండి..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం చాలా సులభం. ఇది దశల వారీగా ఉంటుంది. దీన్ని ఇంట్లో కూర్చొని నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.

  • NSDL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 'Apply Online' ఎంచుకోండి.
  • 'New PAN – Indian Citizen (Form 49A)', 'Individual' కేటగిరీని ఎంచుకోండి.
  • పిల్లల వివరాలను పూర్తిచేయండి. మైనర్ ఆప్షన్‌ను ఎంచుకోండి. తల్లి/తండ్రి వివరాలను ఇవ్వండి.
  • అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  • నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా 107 రూపాయల రుసుమును చెల్లించండి.
  • OTP ద్వారా e-KYC ప్రక్రియను పూర్తి చేయండి.
  • చివరగా రసీదుని డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇది చేసిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మీట్ చేయాలి. దీంతో పాన్ కార్డ్ ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget