అన్వేషించండి

NTR Bharat Ratna resolution Mahanadu 2026: మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?

TDP Mahanadu 2026 resolutions: టీడీపీ మహానాడు 2026లో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. కేంద్రంలో పలుకుబడి ఉన్నా ఎందుకు సాధించలేకపోతున్నారు?

Bharat Ratna For NTR :  తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడులో ఈసారి కూడా ఒక సంప్రదాయం పునరావృతమైంది. తెలుగుజాతి గర్వకారణం, మహానటుడు ఎన్టీఆర్‌కు  భారతరత్న  ప్రకటించాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమని కొనియాడారు. లోకేష్ ప్రతిపాదించిన 33 శాతం మహిళా రిజర్వేషన్లను పార్టీలోనే అమలు చేద్దామంటూ ఆయన ఇచ్చిన పిలుపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపినప్పటికీ, అందరి దృష్టి మాత్రం భారతరత్న తీర్మానం పైనే ఉంది.

 దశాబ్దాల డిమాండ్ - అందని గౌరవం

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ నిన్న మొన్నటిది కాదు. గత మూడు దశాబ్దాలుగా ప్రతి మహానాడులోనూ టీడీపీ ఈ తీర్మానం చేస్తూనే ఉంది. గతంలో చంద్రబాబు కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్  ప్రభుత్వాకు కీలకంగా వ్యవహరించినప్పటికీ  ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించలేకపోయారు.  వాజ్‌పేయి హయాంలో ఎన్డీయే ప్రభుత్వానికి కింగ్ మేకర్‌గా ఉన్నప్పుడు కూడడాా గౌరవం ఎన్టీఆర్‌కు దక్కలేదు.  రాజకీయ కారణాల వల్ల  ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది.  

 కింగ్ మేకర్‌గా బాబు - ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? 

ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అత్యంత కీలకం. టీడీపీ మద్దతు లేకుండా కేంద్ర ప్రభుత్వం మనగడ సాగించడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించుకోవడం చంద్రబాబుకు పెద్ద కష్టమైన పని కాదు.  కేంద్రంలో పట్టు ఉన్నప్పుడే ఈ పని పూర్తి చేయాలి.. లేకపోతే మరో మహానాడులో మళ్ళీ ఇదే తీర్మానాన్ని చదువుకోవాల్సి వస్తుంది అని  క్యాడర్  భావిస్తున్నారు. ఈసారి కేవలం తీర్మానానికే పరిమితం కాకుండా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి భారతరత్న సాధించాలని ప్రయత్నిస్తున్నారు.   

 మహిళా రిజర్వేషన్లు - ఒక ముందడుగు  

మహానాడు రెండో రోజున చంద్రబాబు చేసిన మరో కీలక ప్రకటన మహిళా రిజర్వేషన్లు. లోకేష్ ప్రతిపాదించిన 33 శాతం కోటాను పార్టీ పదవుల్లోనూ, 2029 అసెంబ్లీ టికెట్ల కేటాయింపులోనూ అమలు చేస్తామన్న ప్రకటన సాహసోపేతమైనదే. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావడానికి ముందే, టీడీపీ దీన్ని ఆచరణలో చూపిస్తామని చెప్పడం ద్వారా మహిళా ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఉందని చంద్రబాబు అభివర్ణించారు.
 
అభిమానుల ఆకాంక్షలు, రాజకీయ అవసరాలు ఎలా ఉన్నా.. ఎన్టీఆర్ ఖ్యాతి భారతరత్న అవార్డుకు అతీతమైనది. కానీ, ఒక రాజకీయ పార్టీగా టీడీపీ తన వ్యవస్థాపకుడికి ఆ అత్యున్నత గౌరవాన్ని ఇప్పించుకోవడం అనేది వారి నైతిక బాధ్యత. కేంద్రంలో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఈసారి ఎన్టీఆర్ జయంతి నాటికైనా ఆ ప్రకటన వచ్చేలా చంద్రబాబు కృషి చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. తీర్మానాలు చేయడం కంటే, ఫలితాలు సాధించడంపైనే క్యాడర్ ఆశలు పెట్టుకుంది. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Support CJP : CJP నేతల అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ - ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయిందని విమర్శలు !
CJP నేతల అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ - ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయిందని విమర్శలు !
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget