వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించి వారిని గౌరవిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
Nara Lokesh On Women Reservation: రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహానాడు వేదికగా కీలక ప్రకటన చేశారు.

- మహిళలకు 33% సీట్లు, రిజర్వేషన్ బిల్లుపై టీడీపీ ప్రకటన.
- దేశానికి తొలి ప్రాధాన్యత, హైబ్రిడ్ విధానంలో మహానాడు.
- చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం, ఉద్యోగాల కల్పన.
- కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 164 సీట్లతో విజయం.
Nara Lokesh Speech At TDP Mahanadu | అమరావతి: మహిళలకు రిజర్వేషన్లపై తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill) ఆమోదం పొందినా, పొందకపోయినా వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు ఇచ్చి వారిని గౌరవిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు నారా లోకేష్ కీలక తీర్మానాన్ని ప్రతిపాదించారు. మంగళగిరి సెంట్రల్ ఆఫీసు నుంచి హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్న మహానాడు సదస్సులో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. ‘టీడీపీ మహానాడు’ అంటే కేవలం రాజకీయ సభ మాత్రమే కాదని, అది కార్యకర్తలకు ఒక పండగ లాంటి 'మాస్ జాతర' అని అభివర్ణించారు. ఎక్కడెక్కడో ఉన్న పార్టీ శ్రేణులంతా ఈ వేదిక ద్వారా ఒకే చోట కలిసి పసుపు పండగను జరుపుకుంటారని వ్యాఖ్యానించారు.
నేషన్ ఫస్ట్ నినాదంతో సరికొత్త హైబ్రిడ్ విధానం
ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే తమ పార్టీ తొలి ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే నేషన్ ఫస్ట్ (దేశమే ముఖ్యం) అనేది టీడీపీ నినాదమని నారా లోకేష్ స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధ పరిణామాలతో దేశంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని ఆయన గుర్తుచేశారు. ప్రధాని పిలుపుమేరకు, దేశ హితం కోసం ఈసారి టీడీపీ మహానాడును సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరికొత్త హైబ్రిడ్ విధానంలో (ఫిజికల్, వర్చువల్ గా) నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
జెట్ స్పీడ్‌తో చంద్రబాబు పనితీరు.. ప్రపంచవ్యాప్తంగా సీబీఎన్ క్రేజ్
ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సీబీఎన్(CBN) అనే మాట స్పష్టంగా వినిపిస్తుందని, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు అని లోకేష్ కొనియాడారు. ఈ వయస్సులోనూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జెట్ స్పీడ్‌తో (అత్యంత వేగంగా) పనిచేస్తున్నారని శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాష్ట్ర పునర్నిర్మాణం, యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాకెట్ వేగంతో దూసుకుపోతోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

టిడిపి మహిళా సాధికారతను విశ్వసిస్తోంది
నారా లోకేష్ ఇంకా మాట్లాడుతూ.. ‘దేశ భవిష్యత్తు పట్ల ఒక నిబద్ధతగా ఉండాలి. మాకు మరింత మంది మహిళా చట్టసభ సభ్యులు కావాలి… మరింత మంది మహిళా నాయకులు కావాలి… మరింత మంది మహిళా విధాన నిర్ణేతలు కావాలి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును మహిళలు భుజం భుజం కలిపి నడిపిస్తారు. ఇది మా సంకల్పం. ఇది మా బాధ్యత. ఇది మా కమిట్ మెంట్. భారత రాజకీయాల తదుపరి శకం మహిళా నాయకత్వానిదే కావాలని నేను గట్టిగా నమ్ముతున్నాను.

మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం ద్వారా ఎన్డీయే ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. మహిళలు కేవలం లబ్ధిదారులుగా మాత్రమే మిగిలిపోకూడదు… మహిళలు నిర్ణయాలు తీసుకునేవారుగా మారాలి. దురదృష్టవశాత్తు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తిరస్కరించి, మహిళా సాధికారతకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించాయి. ఎన్నికల సమయంలో చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడతాయి. కానీ ఎన్నికల తర్వాత మహిళలను మర్చిపోతాయి. కానీ తెలుగుదేశం పార్టీ సూత్రప్రాయంగా, ఆచరణలో మహిళా సాధికారతను విశ్వసిస్తోంది.

ఇతరులు మద్దతిచ్చినా, మద్దతు ఇవ్వకపోయినా… పార్లమెంట్ అమలు చేసినా చేయకపోయినా మనం ముందుండి నడిపించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. కొంతమంది మహిళలను అవమానపరిచేలా మాటలు మాట్లాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు అంటూ మహిళలను తక్కువచేసి మాట్లాడతారు. అలాంటి మాటలు ఎవరూ మాట్లాడకూడదు అని మనం ముందుండి పోరాడాలి. స్కూల్ బుక్స్ లో ఇంటి పనులు చేసే బొమ్మలు అన్నీ మహిళలవే ఉంటే 50 – 50 ఉండాలని ఆదేశించాను.
టిడిపిలో కార్యకర్తే అధినేత
తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత. 2019 నుంచి 2024 వరకు పసుపు సైన్యం చేసిన పోరాటం ఒక చరిత్ర. మెడపై కత్తి పెట్టి వారి నాయకుడు పేరు చెప్పమంటే "జై చంద్రబాబు, జై టిడిపి" అని ప్రాణాలు వదిలారు తోట చంద్రయ్య. నామినేషన్ పత్రాలు లాక్కొని, దాడి చేస్తే తొడకొట్టి మీసం మెలేశాడు అంజిరెడ్డి తాత. వైసిపి రౌడీల దాడిలో రక్తం కారుతున్నా చివరి ఓటు పడేవరకు పోలింగ్ బూత్‌లో కూర్చున్నారు మంజుల గారు. వైసిపి గూండాల దాడిలో కన్నుపోయినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడారు చెన్నుపాటి గాంధీ. వీరంతా మనకు స్ఫూర్తి. మన అధినేతను 53 రోజులు అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా రోడ్లపైకి వచ్చారు. అది మన క్రెడిబిలిటీ. కేసులకు వెనకడుగు వేయలేదు, అరెస్టులకు భయపడలేదు. అవతల వైపు ఎవరున్నా మన డైలాగే ఒకటే... తగ్గేదే లే. మనం కొట్టిన దెబ్బకి వై నాట్ 175 కాస్తా టీమ్ 11 అయ్యిందని’ నారా లోకేష్ సెటైర్లు వేశారు.

రికార్డులు బద్దలుకొట్టాం
‘2024 ఎన్నికల్లో రికార్డులు బద్దలుకొట్టాం. 94 శాతం స్ట్రైక్ రేట్...164 సీట్లు. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు... ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించారు. అన్ని రికార్డులు బద్దలుకొట్టాం. శ్రీకాకుళంలో 10 సీట్లకు పది, విజయనగరంలో 9 సీట్లకు 9, తూర్పుగోదావరిలో 19కి 19, పశ్చిమ గోదావరిలో 15కి 15, కృష్ణాలో 16కి 16, గుంటూరులో 17కి 17, నెల్లూరులో 10కి 10, అనంతపురంలో 14కి 14.. మొత్తం 8 ఉమ్మడి జిల్లాల్లో క్లీన్ స్వీప్. కడపలో కూడా 10కి 7 గెలిచాం. ప్రభుత్వం సూపర్ హిట్ అయింది.
Also Read: పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే

ప్రజాప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎవరూ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తున్నాం. 4వేల పెన్షన్, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీతో 16వేల టీచర్ పోస్టుల భర్తీ, 6వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, 10వేల పోస్టులతో జాబ్ క్యాలండర్, చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, మత్స్యకార సేవలో, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, దీపం -2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తున్నామని’ నారా లోకేష్ అన్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
మహిళలకు ఎన్ని శాతం సీట్లు కేటాయిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు?
ఈసారి టీడీపీ మహానాడును ఏ విధానంలో నిర్వహిస్తున్నారు?
ఈసారి టీడీపీ మహానాడును సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరికొత్త హైబ్రిడ్ విధానంలో (ఫిజికల్, వర్చువల్ గా) నిర్వహిస్తున్నారు.
టీడీపీ మహానాడును హైబ్రిడ్ విధానంలో ఎందుకు నిర్వహిస్తున్నారు?
పశ్చిమాసియా యుద్ధ పరిణామాలతో దేశంలో ఇంధనాన్ని పొదుపు చేయాలనే ప్రధాని పిలుపు మేరకు, దేశ హితం కోసం మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు పనితీరును నారా లోకేష్ ఎలా అభివర్ణించారు?
ఈ వయస్సులోనూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జెట్ స్పీడ్‌తో (అత్యంత వేగంగా) పనిచేస్తున్నారని, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు అని లోకేష్ కొనియాడారు.
2024 ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు గెలుచుకుంది?
2024 ఎన్నికల్లో టీడీపీ 94 శాతం స్ట్రైక్ రేట్ తో 164 సీట్లు గెలుచుకొని రికార్డులు బద్దలు కొట్టింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























