అన్వేషించండి

Credit Card Settlement Offer: క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !

Credit Card Settlement Offers | కస్టమర్లు తమ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి క్రెడిట్ కార్డులు వినియోగిస్తారు. కానీ తరచుగా బిల్లులు చెల్లించలేకపోతే అవి గడువు మీరిపోతాయి.

Credit Card Settlement: ప్రస్తుతం బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకరు క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ప్రజలు తమ ఆర్థిక పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోవడం సులభతరం అవుతుంది. కానీ కొందరు క్రెడిట్ కార్డును అవసరానికి మించి వాడేస్తుంటారు. దీనివల్ల బిల్లులు సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు ఎదురవుతాయి. బిల్లును సమయానికి చెల్లించకపోవడం వల్ల వడ్డీ పెరుగుతూ పోతుంది. కొన్నిసార్లు పెనాల్టీ భారం పెరుగుతుంది. మరోవైపు సిబిల్ స్కోరు దారుణంగా పడిపోతుంది.

క్రెడిట్ కార్డ్ బకాయిలను 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం చెల్లించనప్పుడు, బ్యాంక్ మీ ఖాతాను డిఫాల్ట్‌గా భావిస్తుంది. ఈ పరిస్థితిలో బ్యాంకులు తరచుగా కస్టమర్లకు క్రెడిట్ కార్డ్ సెటిల్‌మెంట్ ఆఫర్‌ ఇస్తాయి. ఫస్ట్ విజిట్‌లో ఇది చాలా ఉపశమనం కలిగించేలా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం బకాయి కంటే తక్కువ డబ్బు చెల్లించి మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. కానీ దీని వల్ల కొన్ని లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. పరిస్థితిని బట్టి వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

క్రెడిట్ కార్డ్ సెటిల్‌మెంట్ అంటే ఏమిటి?
ఒక క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు చాలా కాలం పాటు క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లించలేనప్పుడు, బ్యాంక్ మొత్తం మనీ వసూలు చేయడానికి బదులుగా కొంత తక్కువ మొత్తాన్ని తీసుకుని ఆ బిల్లు క్లోజ్ చేయాలని ప్రపోజ్ చేస్తుంది. దీనినే క్రెడిట్ కార్డ్ సెటిల్‌మెంట్ అంటారు. దీని కోసం బ్యాంక్ మీకు మొత్తం బకాయి మొత్తంలో 50 శాతం లేదా 40% మాత్రం జమ చేయమని ఆఫర్ ఇస్తుంది. దీని తర్వాత అకౌంట్ క్లోజ్ చేస్తారు. 

సెటిల్‌మెంట్ వల్ల కలిగే లాభనష్టాలు.. 
మీరు క్రెడిట్ కార్డును సెటిల్‌మెంట్ చేయాలని ఆలోచిస్తుంటే, అంతకంటే ముందు దీనివల్ల కలిగే లాభాలు, నష్టాలు తెలుసుకోవాలి. 

దానివల్ల కలిగే లాభాలు..

  • కస్టమర్ మొత్తం మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. 
  • పెరుగుతున్న వడ్డీ, లేట్ ఫీజు నుండి ఉపశమనం లభిస్తుంది.
  • లీగల్ నోటీసులు రావడం లేదా రికవరీ ఏజెంట్ల వేధింపులు ఉండవు. 
  • ఆర్థిక సంక్షోభంలో ఉన్నవారికి ఇది తక్షణం కొంత ఊరటనిస్తుంది.

కలిగే నష్టాలివే..  

  • క్రెడిట్ కార్డ్ సెటిల్‌మెంట్ వల్ల కలిగే అతిపెద్ద ప్రభావం సిబిల్ (CIBIL) స్కోర్‌పై పడుతుంది.
  • బ్యాంక్ మీ అకౌంట్‌ను సెటిల్డ్ అని రిపోర్ట్ చేస్తుంది కానీ క్లోజ్డ్ (Closed) లేదా పెయిడ్ ఇన్ ఫుల్ (Paid in Full) అని మాత్రం చూపదు.
  • భవిష్యత్తులో లోన్ లేదా కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
  • హోమ్ లోన్, కార్ లోన్ లేదా బిజినెస్ లోన్ మంజూరు చేయడం కష్టమవుతుంది.
  • చాలా బ్యాంకులు ఇటువంటి కస్టమర్లను హై-రిస్క్ కేటగిరీలో ఉంచి, ప్రతి అప్లికేషన్ జాగ్రత్తగా చెక్ చేస్తాయి. 

మీ క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా ఎక్కువగా పెరిగిపోయి మీరు చెల్లించలేకపోతుంటే, సెటిల్‌మెంట్ అనేది మంచి ఆప్షన్. కానీ దీని లాభనష్టాలు తెలుసుకున్న తర్వాతే మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి. లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.


మీ దగ్గర అసలు డబ్బు లేని పక్షంలో, జైలు శిక్ష లేదా లీగల్ సమస్యల నుండి తప్పించుకోవడానికి సెటిల్‌మెంట్ ఒక చివరి మార్గంగా పనికొస్తుంది. కానీ, అవకాశం ఉంటే మాత్రం మొత్తం బకాయిని చెల్లించి ఖాతాను 'Closed' అనిపించుకోవడమే ఉత్తమం. దీనివల్ల మీ ఆర్థిక గౌరవం (Credit Score) కాపాడబడుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget