అన్వేషించండి

CIBIL Score: మీ సిబిల్ స్కోర్‌ 750కు పెరగాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

CIBIL Score: సిబిల్ స్కోర్ సరిగా లేకుంటే మీకు బ్యాంకు నుంచి ఎలాంటి రుణాలు రావు. క్రిడిట్ కార్డు కూడా రాదు. అలాంటి సిబిల్ స్కోర్ పెంచుకోవాలంటే ఏంచేయాలి?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆర్థిక పరపతికి సిబిల్ స్కోరు అత్యంత కీలకం.
  • క్రెడిట్ వినియోగం, సకాలంలో చెల్లింపులు స్కోరును పెంచుతాయి.
  • తక్కువ స్కోరుతో అధిక వడ్డీ, రుణ తిరస్కరణలు తప్పవు.
  • క్రమశిక్షణతో 6-12 నెలల్లో స్కోరు మెరుగుపడుతుంది.

CIBIL Score: ఆధునిక ప్రపంచంలో సంపాదన ఎంత ముఖ్యమో, మన ఆర్థిక పరపతిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది తమకు బ్యాంకుల్లో అప్పుల్లేవు, క్రెడిట్ కార్డులు లేవు, ఎగవేతలు కూడా లేవు తమకు వెళ్లిన వెంటనే అప్పులు ఇచ్చేస్తాయని భ్రమల్లో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో ఓ వ్యాపారవేత్తకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఆయన సమస్య పరిష్కారమైంది. ఇటువంటి ఘటనలు ఒక చిన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందుకే దేశంలో ప్రతి ఒక్కరి ఆర్థిక భవిష్యత్‌ సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. 

సిబిల్ స్కోరు అంటే ఏంటీ?

సిబిల్ స్కోరు అనేది ట్రాన్స్‌యూనియన్ సిబిల్‌ లిమిటెడ్ అనే సంస్థ అందించే మూడు అంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. మీరు గతంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డుల వినియోగం, వాటిని తిరిగి చెల్లించే తీరును బట్టి ఈ స్కోరు లెక్కిస్తారు. సాధారణంగా 700 కంటే ఎక్కువ స్కోరు ఉంటే మంచిదని, 750 స్కోరు కంటే ఎక్కువ ఉంటే అత్యుత్తమమని బ్యాంకులు పరిగణిస్తాయి. 

సిబిలి స్కోరు ఎందుకు అంత ముఖ్యం?

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీకు అప్పు ఇచ్చే ముందు మీరు ఆ అప్పును తిరిగి చెల్లంచగలరా ేదా అని తనిఖీ చేస్తాయి. దీనికి సిబిల్ స్కోరు ఒక ప్రామాణికంగా పని చేస్తుంది. అదిక స్కోరు ఉన్న వారికి బ్యాంకులు త్వరగా లోన్ మంజూరు చేస్తాయి. తక్కువ స్కోరు ఉన్న వారు అప్పులు కట్టలేరని భావించి బ్యాంకులు మీ దరఖాస్తును తరిస్కరించవచ్చు. లేదా ఎక్కువ వడ్డీ వసూలు చేయవచ్చు. 

వివిధ రుణాలకు అవసరమైన స్కోరు ప్రమాణాలు ఇవే 

రుణం టైపు సిబిల్ స్కోరు పరిధి సూచన 
హోమ్‌లోన్‌ 700-900 750కి పైగా ఉంటే త్వరగా మంజూరు అవుతుంది. 
పర్శనల్ లోన్‌ 700-900 బ్యాంకులు 750పైగా సిబిల్ స్కోరు ఉండాలని కోరుకుంటాయి. NBFCలు 650 ఉన్నా సరే లోన్‌లు ఇస్తాయి.
కార్‌లోన్‌   700-900 750కిపైగా ఉంటే మంచిది
క్రెడిట్ కార్డు 700-900 మంచి స్కోరు ఉంటే ఎక్కువ లిమిట్ లభిస్తుంది

 తక్కువ స్కోరు వల్ల ఆర్థిక భారం 

మీ స్కోరు తక్కువగా ఉంటే ప్రభుత్వ లేదా పెద్ద ప్రైవేటు బ్యాంకులు మీ లోన్‌ను నిరాకరించవచ్చు. అప్పుడు మీరు నాన్‌- బ్యాంకింగ్‌ పైనాన్షియల్‌ కంపెనీలను లేదా డిజిటల్ లెండర్స్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. మీరు రుణాలు ఇచ్చినప్పటికీ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. గడువు తక్కువగా ఉంటుంది. ఇది మీపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. 

సిబిల్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలి?

మీ స్కోరు తక్కువ ఉన్నా ఆందోళన చెందాల్సిన పని లేదు. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లు మీ సిబిల్ స్కోరును పెంచుతాయి. 

సకాలంలో చెల్లింపులు:- మీ ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డు బిల్లులను ఒక రోజు కూడా ఆలస్యం చేయకుండా చెల్లించండి. ఒక ఆలస్యపు చెల్లింపు కూడా మీ స్కోరును భారీగా తగ్గిస్తుంది. 

క్రెడిట్ వినియోగ పరిమితి:- మీకు ఉన్న క్రెడిట్‌ లిమిట్‌లో 30 శాతం కంటే తక్కువగా మాత్రమే వాడటానికి ప్రయత్నించండి. ఉదాహరణకు మీ కార్డ్ లిమిట్‌ లక్ష రూపాయలు ఉంటే 30 వేల లోపు వాడటం వల్ల మీరు అప్పులు ఒత్తిడిలో లేరని బ్యాంకులకు అర్థమవుతుంది. 

పదే పదే లోన్‌ల కోసం దరఖాస్తు చేయొద్దు :- అతి త్కువ సమయంలో ఎక్కువ సార్లు లోన్ లేదా క్రెడిట్‌ కార్డ్ కోసం ఎంక్వైరీ చేయడం వల్ల మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని బ్యాంకులు భావిస్తాయి. దీని వల్ల స్కోరు తగ్గుతుంది. 

తప్పులను సరిదిద్దుకోండి:- మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి. ఒక్కోసారి బ్యాంకులు పొరపాటున లేదా మీరు తీర్చిన అప్పులు ఇంకా ఉన్నట్టు చూపడం వల్ల స్కోరు తగ్గే అవకాశం ఉంది. అటువంటి తప్పులను వెంటనే సిబిల్ దృష్టికి తీసుకెళ్లి సరిచేయాలి. 

క్రెడిట్ మిక్స్:- మీ పోర్ట్పోలియోలో సెక్యూర్డ్‌, అన్‌సెక్యూర్డ్ రుణాల సమతుల్యంగా ఉండటం మంచిది. 

పాత అకౌంట్స్ క్లోజ్ చేయకండి:-  మీ పాత క్రెడిట్ కార్డు ఖాతాలను మూసివేయకుండా ఉంచడం వల్ల మీ క్రెడిట్ చరిత్ర కాలపరిమితి పెరుగుతుంది. ఇది స్కోరుకు సానుకూలం అంశం. 

బకాయిలను క్లియర్ చేయండి:- గతంలో ఏదైనా అప్పులు సెటిల్ చేసి ఉంటే ఆ బకాయిలను పూర్తిగా చెల్లించి అకౌంట్లను క్లోజ్ చేయడానికి ప్రయత్నించండి 

ఎప్పుడు మార్పు కనిపిస్తుంది?

సిబిల్‌ స్కోరు అనేది రాత్రికి రాత్రే పెరగదు. ఇది క నిరంతర ప్రక్రియ, పైన పేర్కొన్న జాగ్రత్తు పాటిస్తే, సుమారు 6 నుంచి 12 నెలల కాలంలో మీ స్కోరులో స్పష్టమైన మార్పును గమనించవచ్చు. 

Frequently Asked Questions

సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?

సిబిల్ స్కోర్ అనేది ట్రాన్స్‌యూనియన్ సిబిల్ లిమిటెడ్ అందించే మూడు అంకెల సంఖ్య. ఇది 300 నుండి 900 మధ్య ఉంటుంది మరియు మీ రుణ చెల్లింపు చరిత్రను ప్రతిబింబిస్తుంది.

సిబిల్ స్కోర్ ఎందుకు ముఖ్యం?

బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు మీకు రుణం మంజూరు చేసే ముందు మీ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సిబిల్ స్కోర్‌ను ఒక ప్రామాణికంగా ఉపయోగిస్తాయి. మంచి స్కోర్ ఉంటే రుణాలు త్వరగా మంజూరు అవుతాయి.

వివిధ రుణాలకు ఎలాంటి సిబిల్ స్కోర్ అవసరం?

హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ మరియు క్రెడిట్ కార్డ్ వంటి వాటికి సాధారణంగా 700-900 మధ్య సిబిల్ స్కోర్ అవసరం. 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే చాలా మంచిది.

తక్కువ సిబిల్ స్కోర్ వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

తక్కువ స్కోర్ ఉంటే బ్యాంకులు మీ లోన్ దరఖాస్తును తిరస్కరించవచ్చు లేదా అధిక వడ్డీ రేట్లను వసూలు చేయవచ్చు. ఇది మీపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది.

సిబిల్ స్కోర్‌ను ఎలా మెరుగుపరచుకోవాలి?

సకాలంలో EMIలు మరియు క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం, క్రెడిట్ వినియోగ పరిమితిని 30% లోపు ఉంచడం, పదే పదే లోన్ కోసం దరఖాస్తు చేయకపోవడం వంటివి మీ స్కోర్‌ను మెరుగుపరుస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget