News
News
X

Pawan Kalyan: వైసీపీ నేతలకు పవన్ రివర్స్ కౌంటర్... ట్విట్టర్ వేదికగా వరుస పంచ్ లు...

పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ ఇంకా కొనసాగుతోంది. తాజాగా పవన్ కల్యాణ్ ఒక ట్వీట్ చేశారు. ఇందులో వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే అంటూ విమర్శించారు.

FOLLOW US: 
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై జనసేనాని చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా తగ్గలేదు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దానిపై వైసీపీ మంత్రులు పవన్ పై విరుచుకుపడ్డారు. సినిమా ఫంక్షన్ల నుంచి సోషల్ మీడియా వరకు జనసేన, వైసీపీ నేతలు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

పవన్ తాజా ట్వీట్

News Reels

"తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే" అని పేర్కొంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అలాగే తనకిష్టమైన పాట ఇదేనంటూ ఓ సాంగ్‌ను కూడా పవన్ పోస్టు చేశారు. 

Also Read: మోహన్ బాబు గారూ.. వైఎస్ కుటుంబీకులు మీ బంధువులే కదా.. కావాలంటే నన్ను బ్యాన్ చేసుకోమని చెప్పండి

పవన్ వర్సెస్ వైసీపీ 

ఆన్లైన్ టికెట్ల విషయంలో పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసి విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు స్పందిస్తూ పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ గురించి పవన్‌ కల్యాణ్‌ నిజాలు తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో 519 థియేటర్లకు గాను 419 థియేటర్లు మాత్రమే తెరిచారన్నారు. ఏపీలో 1100 థియేటర్లలో 800 థియేటర్లు నడుస్తున్నాయన్నారు. సీఎం జగన్‌ లక్ష్యంగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం ఎపిసోడ్ పై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా స్పందించింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తమకు సంబంధంలేదని స్పష్టంచేసింది. అవి అతని వ్యక్తగతంమని చెప్పుకొచ్చింది. తాజాగా నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. పవన్ కల్యాణ్ ప్రశ్నించడంతో తప్పు లేదని, కానీ ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే బాగుంటుందని అన్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన భాష సరిగ్గా లేదన్నారు. చిరంజీవి నోటి నుంచి ఏరోజైనా అమర్యాద పదాలు వచ్చాయా? అని ప్రశ్నించారు.  Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్

పవన్ కి జగన్ తో పోలికా..?

పవన్ కల్యాణ్ ఏంటో సినీ పరిశ్రమకు, ప్రపంచానికి బాగా తెలుసని వెటకారంగా అన్నారు. జగన్ తో అసలు పవన్ కి పోలికే లేదని మండిపడ్డారు. సీఎం జగన్ కు కులపిచ్చి ఉందని నిరూపించగలరా? అని ప్రశ్నించారు. అవకాశాల పేరుతో పంజాబ్ అమ్మాయిని ఓ వ్యక్తి మోసం చేసి విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిసిందన్నారు. ఈ విషయం స్వయంగా విన్నానని పోసాని అన్నారు. బాధితురాలికి న్యాయం చేయడానికి పవన్ కల్యాణ్ ఎందుకు ముందుకు రాలేదని పోసాని ప్రశ్నించారు. 

Also Read: అవకాశాల పేరుతో అమ్మాయిని మోసం చేస్తే.. మీరేం చేశారు..? పవన్ పై పోసాని వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 27 Sep 2021 11:06 PM (IST) Tags: pawan kalyan ap govt AP News YSRCP News ap ministers on pawan kalyan janasena vs ysrcp janasean news

సంబంధిత కథనాలు

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Donkey milk story: గాడిద పాలలో పోషక విలువలున్నాయా..? వాస్తవం ఏంటి..?

Donkey milk story: గాడిద పాలలో పోషక విలువలున్నాయా..? వాస్తవం ఏంటి..?

Two States Sentiment Politics: ఉభయతారక సమైక్యవాదం - టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ పక్కా ప్లానింగ్‌తోనే అంటించేశాయా ?

Two States Sentiment Politics:  ఉభయతారక సమైక్యవాదం  - టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ పక్కా ప్లానింగ్‌తోనే అంటించేశాయా ?

Nadendla Manohar : పవన్ ప్రచార రథం రంగుపై వైసీపీ విమర్శలు, నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్

Nadendla Manohar : పవన్ ప్రచార రథం రంగుపై వైసీపీ విమర్శలు, నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!